కొవిడ్ అలర్ట్.. ఒక్కరోజే 50శాతం పెరిగిన కేసులు..
Publish Date:Apr 14, 2022
Advertisement
కరోనానా? అంటే ఏంటి? అనేలా ఉంది ప్రస్తుత పరిస్థితి. కొవిడ్ ఆంక్షలు ఎత్తేసింది ప్రభుత్వం. జనం బిందాస్‌గా తిరుగుతున్నారు. కొందరు మాత్రమే మాస్కులు పెట్టుకుంటున్నారు. ఇప్పట్లో కొత్త వేవ్ లేదని.. రాలేదని అనుకుంటున్నారు. కానీ, సడెన్‌గా ఒమిక్రాన్ XE వేరియంట్ అంటూ కాస్త అలజడి రేపింది. ఇండియాలో ఎంట్రీ అంటూ కాస్త టెన్షన్ పుట్టిచ్చింది. ఆ తర్వాత ఎలాంటి అప్‌డేట్స్ లేకపోవడంతో ప్రజలు రిలాక్డ్స్‌గా ఉన్నారు అనుకుంటుండగా.. ఢిల్లీలో ఒక్కరోజులోనే కేసులు పెరగడం చిన్నపాటి అటెన్షన్ క్రియేట్ చేస్తోంది. దేశంలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. తాజాగా మళ్లీ వెయ్యికి దగ్గర్లోనే కొత్త కేసులు నమోదయ్యాయి. అయితే, దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం 24 గంటల వ్యవధిలో 50 శాతం మేర అధికంగా కేసులు రావడంతో అటెన్షన్ నెలకొంది. ముందురోజు 202 మందికి కరోనా సోకగా..ప్రస్తుతం ఆ సంఖ్య 299కి చేరింది. కొవిడ్ పాజిటివిటీ రేటు 0.5 శాతం నుంచి 2.70 శాతానికి పెరిగింది. మరోవైపు, దేశవ్యాప్తంగా క్రియాశీల కేసుల సంఖ్యలో కూడా స్వల్ప పెరుగుదల కనిపించింది. గురువారం కేంద్రం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. బుధవారం 4.34 లక్షల మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. 1,007 మందికి పాజిటివ్ వచ్చింది. ఇది ముందురోజు కంటే 7 శాతం అధికం. 818 మంది కోలుకోగా.. రికవరీ రేటు 98.76 శాతంగా ఉంది. ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 11,058 (0.03 శాతం). కేసుల సంఖ్యను గమనిస్తున్నామని.. పెద్దగా ఆందోళన చెందాల్సిన పనిలేదని అంటున్నారు నిపుణులు.
http://www.teluguone.com/news/content/covid-cases-in-india-39-134372.html





