ఇంటర్నెట్ పిల్లలకు ప్రాథమిక హక్కు..సుప్రీంకోర్టు సంచలన తీర్పు.!

Publish Date:Oct 17, 2026

Advertisement

ఇంటర్నెట్ వినియోగం కేవలం పెద్దలకే పరిమితం కాదు, పిల్లలకు కూడా ఇదొక ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. డిజిటల్ యుగంలో విద్య, విజ్ఞానం  సమాచార యాక్సెస్ ప్రతి ఒక్కరికీ అవసరమని పేర్కొంటూ, కేవలం వయసును బట్టి పిల్లలపై ఇంటర్నెట్ నిషేధం విధించడం సరికాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జస్టిస్ జె.బి. పార్దివాలా  జస్టిస్ కె.వి. విశ్వనాథన్ (లేదా కేవీ చందన్) ధర్మాసనం ఈ కీలక తీర్పును వెలువరించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21  ఆర్టికల్ 19(1)(ఎ) కల్పించిన భావప్రకటన స్వేచ్ఛ, వ్యక్తిగత స్వేచ్ఛ హక్కుల కింద ఇంటర్నెట్ వినియోగం పిల్లలకు కూడా వర్తిస్తుందని కోర్టు తేల్చి చెప్పింది. 

ప్రస్తుత కాలంలో ఇంటర్నెట్‌లో పిల్లలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆన్‌లైన్ లైంగిక దుర్వినియోగాలు, వేధింపులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని కోర్టు అంగీకరించింది. అయితే, ఈ ముప్పును సాకుగా చూపి పిల్లలను పూర్తిగా ఇంటర్నెట్‌కు దూరం చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని, పైగా ఇది మరింత ప్రమాదకరమైన అనూహ్య పరిణామాలకు దారితీస్తుందని అభిప్రాయపడింది. పిల్లలపై ఆన్‌లైన్ వేధింపులు లేదా దోపిడీ జరిగినప్పుడు, తాము నిషేధాలు ఉల్లంఘించామనే భయంతో పిల్లలు తల్లిదండ్రులకు లేదా అధికారులకు ఫిర్యాదు చేయడానికి వెనుకంజ వేసే ప్రమాదం ఉందని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. అంతేకాకుండా, ప్రధాన స్రవంతి ప్లాట్‌ఫారమ్‌ల నుంచి పూర్తిగా నిషేధించబడితే, పిల్లలు ఎలాంటి నియంత్రణ లేని ఇతర అసురక్షిత వెబ్‌సైట్ల వైపు ఆకర్షితులయ్యే ముప్పు ఎక్కువగా ఉంటుందని కోర్టు హెచ్చరించింది. 

అందువల్ల పిల్లల రక్షణ, వారి స్వేచ్ఛ ఒకదానికొకటి వ్యతిరేకం కాదని, రెండూ సమానంగా ముఖ్యమని ధర్మాసనం పేర్కొంది. ఈ నేపథ్యంలో పిల్లల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వానికి మరియు సోషల్ మీడియా సంస్థలకు సుప్రీంకోర్టు పలు మార్గదర్శకాలను జారీ చేసింది. ఆన్‌లైన్‌లో పిల్లలపై లైంగిక దుర్వినియోగానికి సంబంధించిన కంటెంట్‌ను (CSEAM) వేగంగా గుర్తించి తొలగించేందుకు సమగ్రమైన జాతీయ డేటాబేస్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఇందుకోసం కంటెంట్‌కు సంబంధించిన పెర్సెప్చువల్ హ్యాష్‌లు, వెబ్‌ చిరునామాలతో డేటాబేస్‌ల రూపకల్పనకు మార్గదర్శకాలు రూపొందించాలని కేంద్రాన్ని కోరింది. 

దీనివల్ల వివిధ ప్లాట్‌ఫారమ్‌లలో అభ్యంతరకర కంటెంట్‌ను గుర్తించి ఏకకాలంలో సమన్వయంతో తొలగించడం సులభమవుతుందని వివరించింది. అలాగే సోషల్ మీడియా ఖాతాలలో కఠినమైన ప్రైవసీ సెట్టింగ్‌లతో కూడిన ప్రత్యేక ‘చైల్డ్ మోడ్’ (Child Mode) విధానాన్ని తీసుకురావాలని సూచించింది. ప్రాథమిక పాఠశాల స్థాయి నుంచే పిల్లలకు ఆన్‌లైన్ ప్రమాదాలు, వేధింపులను గుర్తించే విధానంపై అవగాహన కల్పించాలని, ఆపదలో ఉన్నప్పుడు తల్లిదండ్రుల లేదా నమ్మకమైన పెద్దల సహాయం కోరేలా శిక్షణ ఇవ్వాలని కోర్టు పేర్కొంది. మొత్తానికి పిల్లలను ఇంటర్నెట్‌కు పూర్తిగా దూరం చేయడం కాకుండా, వారికి సురక్షితమైన డిజిటల్ వాతావరణాన్ని కల్పించడమే ప్రభుత్వాల ప్లాట్‌ఫారమ్‌ల ప్రధాన కర్తవ్యం కావాలని సుప్రీంకోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది.

 

 

 

[ Supreme Court internet access, children fundamental right, age based internet ban, online child safety, Article 21, child sexual abuse material, Fundamental Rights India, Online Safety for Kids, Article 21 Internet Access, Telugu One, Telugu news ]


 

By
en-us Political News

  
బర్త్‌డే నాడే భార్యను చంపి సూసైడ్ చేసుకున్న టెకీ.!
చిన్నారుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని దేశీయ ఆహార భద్రతా నియంత్రణ సంస్థ కీలకమైన ముసాయిదా నిబంధనను తెరపైకి తెచ్చింది.
భారతీయ సైన్యంలో అత్యున్నత ప్రమాణాలుగా భావించే క్రమశిక్షణను ఉల్లంఘించిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మవారిని ప్రముఖ సినీ నటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న దంపతులు దర్శించుకున్నారు
ఢిల్లీలో తీవ్ర సంచలనం సృష్టించిన పరిణామాల మధ్య కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేకు న్యాయస్థానం ఊరటనిచ్చింది.
ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోలేకపోయాననే అసంతృప్తి.. కొత్తగా తన జీవితంలోకి వచ్చిన భర్తపై ద్వేషంగా మారిందా? కాపురం ప్రారంభమై నెల రోజులు కూడా గడవకముందే ఓ నవవధువు తీసుకున్న నిర్ణయం
సోషల్ మీడియాలో విపరీతమైన వ్యూస్, లైక్స్ సంపాదించాలనే దురాశతో కొందరు యువకులు రోజుకో ప్రమాదకర చర్యకు పాల్పడుతున్నారు.
గుంపులను చెదరగొట్టేందుకు  టియర్ గ్యాస్   ప్రయోగించారు. అప్పటికీ పరిస్థితి అదుపులోకి రాలేదు. దీంతో  భద్రతా దళాలు ఆరు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపి ఆందోళనకారులను చెదరగొట్టాయి. 
రాత్రి అందరూ కలిసి భోజనం చేశారు.. ఎన్నో ఆశలతో నిద్రలోకి జారుకున్నారు.. కానీ తెల్లవారేసరికి ఆ ఇంట్లో ఐదుగురు విగతజీవులుగా కనిపించారు
బిల్లులకు అవసరమైన మద్దతు   లభిస్తుందనే ధీమాతో కేంద్రం పార్లమెంటు ప్రత్యేక సమావేశాల నిర్వహణకు నడుంబిగించిందని అంటున్నారు. అయితే రాజ్యాంగ సవరణ అవసరమైన ఈ బిల్లులకు సభలో మూడింట రెండొంతుల మోజారిటీ అవసరం.  కేంద్రం ఆ మద్దతును సమకూర్చుకోగలుగుతుందా అన్న విషయంపై సర్వత్రా ఆసక్తి, ఉత్కంఠ వ్యక్తమౌతోంది. 
ఎడతెగని చర్చలు, మంతనాల అనంతరం, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి మధ్య సీట్ల కేటాయింపు ప్రక్రియ  పూర్తయింది.
ఇలాంటి అణచివేత చర్యలు, అరెస్టులు  పరిస్థితిని మరింత దిగజార్చుతాయని పేర్కొన్నారు. ఇంత కాలం కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని, బీజేపీని జగన్ నేరుగా విమర్శించిన లేదా వ్యతిరేకించిన సందర్భం లేదు. అటువంటి జగన్ ఇప్పుడు బొద్దింకల ఉద్యమానికి మద్దతుగా మాట్లాడటం, ఆ పార్టీ నేతల అరెస్టులను ఖండించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
మహానగరంలో శాంతిభద్రతలకు సవాల్ విసురుతూ మరో కిరాతక ఘటన వెలుగు చూసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.