పులివెందులలో కాల్పులు: స్థానిక నామినేషన్ల వేళ అదుపుతప్పిన లా అండ్ ఆర్డర్.!

Publish Date:Oct 17, 2026

Advertisement

స్థానిక  ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన వేళ కడప జిల్లాలోని పులివెందుల ఉద్రిక్తతలకు వేదికగా మారింది. నామినేషన్ల దాఖలు ప్రక్రియ సందర్భంగా నామినేషన్ కేంద్రం వద్ద వైపీసీ, తెలుగుదేశం కూటమి   శ్రేణుల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ చెలరేగింది. పరిస్థితి అదుపు తప్పడంతో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు గాల్లోకి ఆరు రౌండ్ల కాల్పులు జరపాల్సి వచ్చింది.

స్థానిక పోరుకు సంబంధించి నామినేషన్ ప్రక్రియ మొదలైనప్పటి నుంచే పులివెందులలో రాజకీయ వేడి తార స్థాయికి చేరింది. ఈ క్రమంలో శనివారం (సెప్టెంబర్ 17) నామినేషన్ల దాఖలుకు ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. నామినేషన్ కేంద్రానికి అత్యంత సమీపంలోకి రెండు వర్గాలకు చెందిన శ్రేణులు ఏకకాలంలో రావడంతో వాతావరణం హీటెక్కింది. ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగి తోపులాటకు, ఘర్షణకు దారి తీసింది. ఇరు వర్గాల మధ్యా రాళ్లు దాడులు జరిగాయి. పరిస్థితి అదుపుతప్పుతుండటంతో   పోలీసులు అప్రమత్తమయ్యారు. గొడవను అదుపు చేసేందుకు   హెచ్చరికలు జారీ చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో లాఠీచార్జ్ జేశారు. అయినా ఫలితం లేకపోవడంతో గుంపులను చెదరగొట్టేందుకు  టియర్ గ్యాస్   ప్రయోగించారు. అప్పటికీ పరిస్థితి అదుపులోకి రాలేదు. దీంతో  భద్రతా దళాలు ఆరు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపి ఆందోళనకారులను చెదరగొట్టాయి. 

నామినేషన్ కేంద్రం పరిసర ప్రాంతాల్లో హఠాత్తుగా లాఠీచార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగం కాల్పుల శబ్దాలు వినిపించడంతో స్థానికులు  తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఉద్రిక్తతల నేపథ్యంలో చుట్టుపక్కల దుకాణాలను మూసివేశారు. కాగా ఘర్షణలో ఇరువర్గాలకు చెందిన పలువురు కార్యకర్తలకు   గాయాలయ్యాయి. 

ఈ ఘటనపై స్పందించిన ఉన్నతాధికారులు నామినేషన్ కేంద్రం వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. అదనపు పోలీసు బలగాలను రంగంలోకి దించి, పులివెందుల పట్టణంలో నిషేధాజ్ఞలను పటిష్టంగా అమలు చేస్తున్నారు. నామినేషన్ల ప్రక్రియకు ఎలాంటి విఘాతం కలగకుండా నిఘా పెంచారు. ఈ ఘర్షణకు కారణమైన వారిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు జిల్లా పోలీస్ యంత్రాంగం వెల్లడించింది. 

[Pulivendula Election Tension, Pulivendula Police Firing, Local Body Elections, YCP, TDP Alliance Clash, Telugu One]

By
en-us Political News

  
బర్త్‌డే నాడే భార్యను చంపి సూసైడ్ చేసుకున్న టెకీ.!
చిన్నారుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని దేశీయ ఆహార భద్రతా నియంత్రణ సంస్థ కీలకమైన ముసాయిదా నిబంధనను తెరపైకి తెచ్చింది.
భారతీయ సైన్యంలో అత్యున్నత ప్రమాణాలుగా భావించే క్రమశిక్షణను ఉల్లంఘించిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మవారిని ప్రముఖ సినీ నటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న దంపతులు దర్శించుకున్నారు
ఢిల్లీలో తీవ్ర సంచలనం సృష్టించిన పరిణామాల మధ్య కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేకు న్యాయస్థానం ఊరటనిచ్చింది.
ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోలేకపోయాననే అసంతృప్తి.. కొత్తగా తన జీవితంలోకి వచ్చిన భర్తపై ద్వేషంగా మారిందా? కాపురం ప్రారంభమై నెల రోజులు కూడా గడవకముందే ఓ నవవధువు తీసుకున్న నిర్ణయం
సోషల్ మీడియాలో విపరీతమైన వ్యూస్, లైక్స్ సంపాదించాలనే దురాశతో కొందరు యువకులు రోజుకో ప్రమాదకర చర్యకు పాల్పడుతున్నారు.
ఇంటర్నెట్ వినియోగం కేవలం పెద్దలకే పరిమితం కాదు, పిల్లలకు కూడా ఇదొక ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
రాత్రి అందరూ కలిసి భోజనం చేశారు.. ఎన్నో ఆశలతో నిద్రలోకి జారుకున్నారు.. కానీ తెల్లవారేసరికి ఆ ఇంట్లో ఐదుగురు విగతజీవులుగా కనిపించారు
బిల్లులకు అవసరమైన మద్దతు   లభిస్తుందనే ధీమాతో కేంద్రం పార్లమెంటు ప్రత్యేక సమావేశాల నిర్వహణకు నడుంబిగించిందని అంటున్నారు. అయితే రాజ్యాంగ సవరణ అవసరమైన ఈ బిల్లులకు సభలో మూడింట రెండొంతుల మోజారిటీ అవసరం.  కేంద్రం ఆ మద్దతును సమకూర్చుకోగలుగుతుందా అన్న విషయంపై సర్వత్రా ఆసక్తి, ఉత్కంఠ వ్యక్తమౌతోంది. 
ఎడతెగని చర్చలు, మంతనాల అనంతరం, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి మధ్య సీట్ల కేటాయింపు ప్రక్రియ  పూర్తయింది.
ఇలాంటి అణచివేత చర్యలు, అరెస్టులు  పరిస్థితిని మరింత దిగజార్చుతాయని పేర్కొన్నారు. ఇంత కాలం కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని, బీజేపీని జగన్ నేరుగా విమర్శించిన లేదా వ్యతిరేకించిన సందర్భం లేదు. అటువంటి జగన్ ఇప్పుడు బొద్దింకల ఉద్యమానికి మద్దతుగా మాట్లాడటం, ఆ పార్టీ నేతల అరెస్టులను ఖండించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
మహానగరంలో శాంతిభద్రతలకు సవాల్ విసురుతూ మరో కిరాతక ఘటన వెలుగు చూసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.