వివేకా హత్య కేసు.. మరోసారి సుప్రీం కు డాక్టర్ సునీత
Publish Date:Jan 13, 2026
Advertisement
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు లో ఆయన కుమార్తె సునీత మళ్లీ సుప్రీం మెట్లెక్కారు. తన తండ్రి వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగింపునకు ట్రయల్ కోర్టు పాక్షిక అనుమతి మాత్రమే ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ఆమె సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ విచారణ అంశంపై నిర్ణయం తీసుకోవాలని హైదరాబాద్ నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టు ను గతంలో సుప్రీంకోర్టు ఆదేశించింది. దీనిపై విచారణ జరిపిన ట్రయల్ కోర్టు కేవలం ఇద్దరి పాత్రపై మాత్రమే విచారణ జరపాలని ఆదేశాలు ఇచ్చింది. తాము లేవనెత్తిన అంశాలకు విరుద్ధంగా పాక్షిక విచారణకు ట్రయల్ కోర్టు ఆదేశాలిచ్చిందనీ, సుప్రీం ధర్మాసనం ఇచ్చిన మార్గదర్శకాలను ట్రయల్ కోర్టు పట్టించుకోలేదని సునీత సుప్రీం ను ఆశ్రయించారు. దీంతో ప్రస్తుత అప్లికేషన్తో పాటు పెండింగ్ లో ఉన్న అన్ని పిటిషన్లపై విచారణను సుప్రీం కోర్టు వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది.
http://www.teluguone.com/news/content/sunitha-another-application-in-supreme-36-212467.html





