ఏపీ డీజీపీగా సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్?

Publish Date:Jan 30, 2023

Advertisement

డాక్టర్  సునీల్ కుమార్ ఐపీఎస్. ఏపీలో ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. నిన్న మొన్నటి వరకూ ఏపీ సీఐడీ చీఫ్ గా బాధ్యతలను నిర్వర్తించిన ఈయన తీరు అత్యంత వివాదాస్పదంగా మారింది. ఆ వివాదాస్పద వైఖరి కారణంగానే   సునీల్ కుమార్ ఐపీఎస్ రాష్ట్రంలో పరిచయం అక్కర్లేని పేరుగా మారింది.

 వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు అరెస్టు, మ్యాన్ హ్యాండలింగ్,  ఐటీడీపీ చీఫ్ చింతకాయల విజయ్ నివాసంపై సీఐడీ పోలీసుల దాడి వంటి ఘటనలన్నీ ఈయన హయాంలోనే జరిగాయి. జర్నలిస్టు అంకబాబును అర్ధరాత్రి అరెస్టు చేయడం కూడా సీఐడీ చీఫ్ గా సునీల్ కుమార్ ఉన్న సమయంలోనే జరిగింది. దాదాపు ఏపీ సీఐడీ చీఫ్ గా సునీల్ ఉన్న కాలంలో ఆ దర్యాప్తు సంస్థ డీల్ చేసిన కేసులన్నీ వివాదాస్పదమైనవే.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం ఎత్తే వారిని టార్గెట్ చేసి ఉద్దేశ పూర్వకంగా కేసులు బనాయించేవారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి.  ఏపీ సీఐడీ జగన్ సర్కార్ కు అనుకూలంగా పని చేస్తున్నదన్న ఆరోపణలూ ఉన్నాయి. అయితే సునీల్ కుమార్ ను జగన్ సర్కార్ హఠాత్తుగా బదిలీ చేసింది. అలా బదిలీ చేయడానికి రోజుల  ముందు ఆయనకు పదోన్నతి కల్పించింది.  

దాంతో ఆయనను ఏపీ డీజీపీగా నియమించే అవకాశాలున్నాయని అప్పట్లోనే పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇప్పుడు తాజాగా ఆయనను ఏపీ డీజీపీగా నియమించనున్నారని విశ్వసనీయ సమాచారం. ప్రస్తుతం డీజీపీగా ఉన్న  రాజేంద్రనాథ్ రెడ్డి సెలవుపై వెళ్లనున్నారని, దీంతో ఆయన స్థానంలో సునీల్ కుమార్ ను నియమించనున్నారని, ఏ క్షణంలోనైనా ఇందుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశాలున్నాయనీ అంటున్నారు.

 సీఐడీ చీఫ్ గా ఉన్న కాలంలో సునీల్ కుమార్ ను ప్రభుత్వం తన రాజకీయ కక్ష సాధింపు చర్యలకు వినియోగించుకుందనీ విపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శించాయి.  ఆయనను బదలీ చేసిన సమయంలోనే సునీల్ కుమార్ కు మరింత కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని అప్పట్లోనే రాజకీయ వర్గాలు అంచనా వేశాయి. ఇప్పుడు ఆ అంచనాలే వాస్తవమని తేలిందని అంటున్నారు.   

By
en-us Political News

  
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఇజ్రాయెల్ దేశం నుంచి అత్యున్నత గౌరవం దక్కింది.
ఆంధ్రప్రదేశ్ ప్రజలను మరో వాతావరణ గండం ఆందోళనకు గురిచేస్తోంది.
ప్రకృతిని ఎదిరించి జీవించడం ఎవరికీ సాధ్యం కాదని, దానితో ఘర్షణకు దిగితే మానవాళి తీవ్ర విపత్తులను ఎదుర్కోవాల్సి వస్తుందని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు హితవు పలికారు.
DRDO ఉద్యోగి ఎదురింట్లో ఉన్న ఓ యువతిపై మనసు పడ్డాడు.. అవకా శం కోసం ఎదురుచూశాడు యువతి ఒంటరిగా ఉన్నట్లు గుర్తించి ఇంట్లోకి చొరబడ్డాడు.
ఆకలి వేస్తే అన్నం పెట్టే విశాల హృదయం మనది.. దాహమేస్తే గుక్కెడు మంచినీళ్లు ఇవ్వడం మన సంస్కృతి.
 సీజేపీ నిరసన తెలిపేందుకు అనుమతి కోరిన తర్వాత, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్టాండింగ్ ఆర్డర్ ద్వారా జంతర్ మంతర్‌ను నిరసన ప్రదేశంగా డీనోటిఫై చేయడం నుండి నీట్ పేపర్ లీక్ సమస్యల వరకు అన్నామలై కేంద్రాన్ని డిఫెన్స్ లోకి నెట్టేశారు.
కాన్వాయ్ భద్రతా సిబ్బంది లేకుండా, ప్రోటోకాల్స్ ను కాదని మరీ సీఎం చంద్రబాబు అధికారిక నివాసానికి చేరుకుని ఆయనతో సుదీర్ఘ చర్చలు జరిపారు. ఈ భేటీలో ఇరువురూ, ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు  స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ జరగిందని అంటున్నారు.  
పరకాల ప్రభాకర్ మద్దతు కేంద్రానికి ఎందుకు షాక్ గా మారిందంటే.. ఆయన కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ భర్త కావడం వల్లనే. . ఈ ఉద్యమానికి ఒక అనూహ్య వ్యక్తి మద్దతు తెలపడంతో దీనికి మరింత బలం చేకూరింది.కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త  పరకాల ప్రభాకర్, అక్టోబర్ 23న జరగనున్న ఈ నిరసనలో పాల్గొంటాననీ, బొద్దింకల ఉద్యమానికి సంపూర్ణ మద్దతు, సంఘీభావం తెలుపుతాననీ ప్రకటించారు.   
భారత దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టోర్నీ కోసం ఫ్రాంచైజీలు ఇప్పటి నుంచే తమ వ్యూహాలను రచిస్తున్నాయి.
న్నబిడ్డలకు కడుపునిండా అన్నం పెట్టలేని నిస్సహాయత.. కనీస అవసరాలు తీర్చలేని దుర్భర పరిస్థితి.
భారతదేశపు అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సైబర్ భద్రతా రంగంలో తీవ్ర కలకలం రేపిన ఒక పెద్ద ఉదంతాన్ని ఎదుర్కొంది.
24 ఏళ్లకే అద్భుత ఆవిష్కరణ.. డేటా స్టోరేజ్‌ రంగంలో యువతి సంచలనం.!
ఉద్యోగ వేటలో విజయం సాధించి తొలిసారి కొలువులో అడుగుపెట్టే యువతకు కేంద్ర ప్రభుత్వం నుంచి అండగా నిలిచేలా సరికొత్త వెసులుబాటు అందుబాటులోకి వచ్చింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.