సర్వత్రా వ్యతిరేకతే.. గుర్తించిన జగన్ ఏం చేస్తున్నారంటే..?

Publish Date:Jan 30, 2023

Advertisement

తన పాలనపై ప్రజలలో తీవ్ర వ్యతిరేకత గూడు కట్టుకుందన్న సంగతి జగన్ కు అర్ధమైంది. అలాగే కార్యకర్తలూ పార్టీకి దూరం జరిగారనీ గుర్తించారు. దీంతో జగన్ అనివార్యంగా ప్రజా వ్యతిరేకతను తగ్గించుకోవడం, కార్యకర్తలను మళ్లీ పార్టీతరఫున పని చేసేలా చేయడం కోసం చర్చలు చేపట్టడం మొదలు పెట్టారు.   పార్టీకి దూరమైన క్యాడర్ ను దగ్గరకు చేర్చుకోవడానికి, వారినే ప్రజల వద్దకు పంపి ప్రభుత్వ వ్యతిరేకతను తగ్గించే విధంగా వ్యూహ రచన చేశారు.

 అధికారంలోకి రాకముందు ఐదేళ్ల పాటు కష్టనష్టాలకు ఓర్చి, సొంత జేబులు ఖాళీ చేసుకని వైసీపీ కోసం.. కాదు కాదు జగన్ ను సీఎంను చేయడం కోసం కష్టపడిన కార్యకర్తలను అధికారంలోకి వచ్చిన తరువాత కనీసం పట్టించుకోని ఫలితం ఇప్పుడు జగన్ కు అడుగడుగునా కనిపిస్తోంది. వైసీపీ సభలకు ఎంత ప్రయత్నించినా జనాలను తరలించడం గగనమైపోతుండటంతో కార్యకర్తలు పార్టీకి సహకరించి పని చేసేందుకు సిద్ధంగా లేరన్న విషయం అర్ధమైంది. అందుకే ఈ మూడున్నరేళ్లలో ఎన్నడూ లేని విధంగా   గృహ సారథులు, సచివాలయ కన్వీనర్ల నియామకాలు, అదే సమయంలో పార్టీ నిర్మాణం బలోపేతంపై దృష్టి పెట్టారు జగన్.  అలా చేయడం వల్ల కార్యకర్తల్లో నెలకొని ఉన్న అసంతృప్తిని కొంత మేరైనా తగ్గించవచ్చన్నది ఆయన వ్యూహంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే జగన్ ఇటీవలి కాలంలో చేపట్టిన నష్టనివారణ యత్నాలు ఏ మేరకు సత్ఫలితాలను ఇస్తాయన్న విషయంపై వైసీసీ శ్రేణుల్లోనే పలు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.

   గృహ సారథులు, గ్రామ, వార్డు సచివాలయ కన్వీనర్లుగా కార్యకర్తలను నియమించడం ద్వారా ఇటు కార్యకర్తలను పట్టించుకోలేదనే దానికి చెక్​ పెట్టడంతో పాటు వారు ప్రజలను నేరుగా కలిసి మాట్లాడడం ద్వారా కొంత వ్యతిరేకతను తగ్గించ వచ్చనేది జగన్ వ్యూహంగా చెబుతున్నారు. కానీ మూడున్నరేళ్లుగా తిన్నారా లేదా అన్న మాట కూడా ఎత్తని జగన్ ఇప్పుడు ఎన్నికల వేడి మొదలయ్యే సరికి కార్యకర్తలను గృహసారథులుగా నియమించేసి,వారిని ప్రజల దగ్గరకు పంపితే నమ్మేస్తారా అన్న అనుమానాలు పార్టీలోనే వ్యక్తమౌతున్నాయి.  అయినా గృహ సారథులు మేం అధికార పార్టీ నుంచి మేమొచ్చాం. మీ సమస్యలు చెప్పండి. అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తాం!' అంటూ గృహ సారథులు వెళ్తే..  గడప గడపకూ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలకూ ఎదురైన ‘మర్యాదే’ వారికీ ఎదురౌతుందన్న అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో వ్యక్త మౌతోంది.

అందుకే  ఎమ్మెల్యేలు ఎవరికి వారుగా తమ కార్యకర్తలను ఇన్ టాక్ట్ గా ఉంచుకోవడం కోసం సొంత ప్రయత్నాలు మొదలు పెట్టేశారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన నియోజకవర్గంలో పార్టీ కోసం పని చేసిన కార్యకర్తల కుటుంబాలకు ఉచిత వైద్యం అని ప్రకటించారు. ఇక బాలినేని అయితే తన నియోజకవర్గంలో తానే సొంతంగా పెన్షన్లు ఇవ్వడానికి సిద్ధపడ్డారు.  ప్రభుత్వ  పింఛన్ వివిధ కారణాలతో ఆగిపోయిన వారికీ, అలాగే అర్హత ఉండీ పింఛన్ మంజూరు కాని వారికీ తానే స్వయంగా తన సొంత ఖర్చుతో పింఛన్ అంద జేస్తున్నారు.

 అలా సొంత ప్రయత్నాలు చేసుకుంటున్న వారంతా జగన్ విధానాలతో విభేదించి, తమ అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తం చేసిన వారే కావడం గమనార్హం. పార్టీ అవసరాలో, మరో కారణమో బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేసినా వారిని పిలిచి బుజ్జగించిన జగన్.. ముందు ముందు వారికి అవసరమైన ప్రాధాన్యత ఇస్తారా, అసలు వారికి వచ్చే ఎన్నికల్లో పార్టీ టికెట్ దక్కుతుందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమౌతున్నాయి.  

By
en-us Political News

  
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఇజ్రాయెల్ దేశం నుంచి అత్యున్నత గౌరవం దక్కింది.
ఆంధ్రప్రదేశ్ ప్రజలను మరో వాతావరణ గండం ఆందోళనకు గురిచేస్తోంది.
ప్రకృతిని ఎదిరించి జీవించడం ఎవరికీ సాధ్యం కాదని, దానితో ఘర్షణకు దిగితే మానవాళి తీవ్ర విపత్తులను ఎదుర్కోవాల్సి వస్తుందని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు హితవు పలికారు.
DRDO ఉద్యోగి ఎదురింట్లో ఉన్న ఓ యువతిపై మనసు పడ్డాడు.. అవకా శం కోసం ఎదురుచూశాడు యువతి ఒంటరిగా ఉన్నట్లు గుర్తించి ఇంట్లోకి చొరబడ్డాడు.
ఆకలి వేస్తే అన్నం పెట్టే విశాల హృదయం మనది.. దాహమేస్తే గుక్కెడు మంచినీళ్లు ఇవ్వడం మన సంస్కృతి.
 సీజేపీ నిరసన తెలిపేందుకు అనుమతి కోరిన తర్వాత, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్టాండింగ్ ఆర్డర్ ద్వారా జంతర్ మంతర్‌ను నిరసన ప్రదేశంగా డీనోటిఫై చేయడం నుండి నీట్ పేపర్ లీక్ సమస్యల వరకు అన్నామలై కేంద్రాన్ని డిఫెన్స్ లోకి నెట్టేశారు.
కాన్వాయ్ భద్రతా సిబ్బంది లేకుండా, ప్రోటోకాల్స్ ను కాదని మరీ సీఎం చంద్రబాబు అధికారిక నివాసానికి చేరుకుని ఆయనతో సుదీర్ఘ చర్చలు జరిపారు. ఈ భేటీలో ఇరువురూ, ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు  స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ జరగిందని అంటున్నారు.  
పరకాల ప్రభాకర్ మద్దతు కేంద్రానికి ఎందుకు షాక్ గా మారిందంటే.. ఆయన కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ భర్త కావడం వల్లనే. . ఈ ఉద్యమానికి ఒక అనూహ్య వ్యక్తి మద్దతు తెలపడంతో దీనికి మరింత బలం చేకూరింది.కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త  పరకాల ప్రభాకర్, అక్టోబర్ 23న జరగనున్న ఈ నిరసనలో పాల్గొంటాననీ, బొద్దింకల ఉద్యమానికి సంపూర్ణ మద్దతు, సంఘీభావం తెలుపుతాననీ ప్రకటించారు.   
భారత దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టోర్నీ కోసం ఫ్రాంచైజీలు ఇప్పటి నుంచే తమ వ్యూహాలను రచిస్తున్నాయి.
న్నబిడ్డలకు కడుపునిండా అన్నం పెట్టలేని నిస్సహాయత.. కనీస అవసరాలు తీర్చలేని దుర్భర పరిస్థితి.
భారతదేశపు అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సైబర్ భద్రతా రంగంలో తీవ్ర కలకలం రేపిన ఒక పెద్ద ఉదంతాన్ని ఎదుర్కొంది.
24 ఏళ్లకే అద్భుత ఆవిష్కరణ.. డేటా స్టోరేజ్‌ రంగంలో యువతి సంచలనం.!
ఉద్యోగ వేటలో విజయం సాధించి తొలిసారి కొలువులో అడుగుపెట్టే యువతకు కేంద్ర ప్రభుత్వం నుంచి అండగా నిలిచేలా సరికొత్త వెసులుబాటు అందుబాటులోకి వచ్చింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.