Publish Date:Apr 25, 2022
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ నిర్ణయాలు నవ్వుల పాలౌతున్నాయి. తుగ్లక్ పాలనను స్ఫురింప చేస్తున్నాయి. అందుకు తాజా ఉదాహరణగా రాష్ట్రంలో టీచర్లకు వేసవి సెలవులు ప్రకటిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని చెప్పుకోవచ్చు. సమ్మర్ హాలీడేస్ ను వర్షాకాలానికి మార్చేసి జగన్ పాలనలో తనదైన ముద్ర వేసుకున్నారు. రాష్ట్రంలో వచ్చే నెల 6 నుంచి జూలై 3 వరకూ ప్రభుత్వం విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది. అంత వరకూ బానే ఉంది కానీ టీచర్లకు మాత్రం ఈ సెలవులు వర్తించవట. వీరంతా మే 20 వరకూ పాఠశాలలకు హాజరు కావాల్సిందేనట. రాష్ట్రంలో పరీక్షలన్నీ మే 7తో ముగుస్తున్నాయి. పరీక్షలు అయిపోయిన తరువాత విద్యార్థులకు సెలవులు ఇచ్చేసిన తరువాత టీచర్లు పాఠశాలలకు ఎందుకో అర్థం కాదు. సీపీఎస్ రద్దు కోసం డిమాండ్ చేస్తున్నారన్న కక్షతో ఏదో రకంగా వేధింపులకు గురి చేయడమే ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తున్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇప్పటికీ టీచర్లకు క్లాసులో విద్యార్థులకు పాఠాలు చెప్పడం కంటే ఇరత పనులే అధికమయ్యాయి. విద్యార్థుల అటెండెన్స్ నుంచి అన్నీ ప్రతి రోజూ వాట్సన్ ద్వారా విద్యాశాఖకు పంపాల్సిందే. ఇక ఇప్పుడు తాజాగా వేసవి సెలవులను మే 20 తరువాతే టీచర్లకు ఇవ్వాలన్న నిర్ణయం వెనుక కూడా టీచర్లకు ఆదాయంలో కోత పెట్టే ఉద్దేశమే కనిపిస్తున్నది. టీచర్లకు వేసవి సెలవులలో స్పీట్ వేల్యుయేషన్ విధులు ఉంటాయి. ఆ విధులకు హాజరైన వారికి ఆర్జిత సెలవు ఇవ్వాల్సి ఉంటుంది. దానిని ఎగ్గొట్టేందుకే సర్కార్ వేసవిలో సెలవులను వర్షాకాలానికి మార్చేయడం లాంటి వింత పోకడలకు పోతున్నదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఆర్థిక క్రమశిక్షణ లేక...ఆర్థికంగా రాష్ట్రాన్ని కుదేలు చేసిన జగన్ సర్కార్ ఇప్పుడు..టీచర్లకు న్యాయబద్ధంగా రావాల్సిన వేతనాలు అలవెన్సులు వంటి వాటిని చెల్లించలేక వారిని ఇబ్బందుల పాలు చేస్తున్నదని టీచర్లు విమర్శిస్తున్నారు. ప్రశ్నించడమే నేరం అన్నట్లు సీపీఎస్ రద్దు కోసం చలో విజయవాడ వెళ్లిన టీచర్లను అరెస్టులు చేయడమే కాకుండా మొత్తం బెజవాడనే జైలుగా మార్చేశారంటే రాష్ట్రంలో ఉన్నది ప్రజా ప్రభుత్వమా? అన్న అనుమానాలు కలుగుతున్నాయంటున్నారు. ఏది ఏమైనా వేసవి సెలవులను వర్షాకాలంలో ఇస్తామంటూ...జగన్ సర్కార్ వింత నిర్ణయం ప్రజలలో నవ్వుల పాలౌతున్నది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/summer-holidays-in-rainy-season-to-teachers-25-134961.html
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్‌లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.
ఈ అరెస్టు పై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. హరీష్ రావు అరెస్టు సందర్భంగా పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. గురుకులాల్లో అవినీతి, రాష్ట్ర అప్పులపై గన్ పార్క్ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్.. బీఆర్‌ఎస్ నేతలు హరీశ్‌రావు, కేటీఆర్‌లకు సవాల్ విసిరారు.
జగన్ ప్రసంగాలు, మీడియా సమావేశాలు... ట్రోలింగ్‌కు, మీమ్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి. నెటిజనులు, తెలుగుదేశం, జనసేన సోషల్ మీడియా యాక్టివిస్టులు జగన్ ప్రెస్ మీట్ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారంటే ఇసుమంతైనా అతిశయోక్తి కాని పరిస్థితి ఉంది.
గతంలో ప్రభుత్వ పనుల కాంట్రాక్టులు దక్కించుకోవాలంటే కేవలం రాజకీయ పలుకుబడి, కమిషన్లు మాత్రమే ప్రాధాన్యత సంతరించుకునేవనే విమర్శలు బలంగా ఉన్నాయి. ఈ విధానాన్ని మార్చి విజయ్ ఇప్పుడు ప్రతిభ, పారదర్శకత ఆధారంగానే టెండర్లు లభించే కొత్త విధానాన్ని తీసుకువచ్చారు.
ఇటువంటి ఉత్కంఠభరిత రాజకీయ వాతావరణంలో.. ఇద్దరు బద్ద రాజకీయ ప్రత్యర్థులు అకస్మాత్తుగా ఒ ముఖాముఖి ఎదురైతే.. అసలా ఊహే ఎవరికీ రాదు అన్నట్లుగా ప్రస్తుతం ఏపీ రాజకీయ పరిస్థితి ఉంది. కానీ అనూహ్యంగా రఘురామకృష్ఫం రాజు, అంబటి రాంబాబు ఓ వివాహ వేడుకలో ఎదురు పడ్డారు.
రాజధాని వంటి అత్యంత కీలకమైన, సున్నితమైన విషయంలో జగన్ పదే పదే తన స్టాండ్ మార్చుకోవడం పరిశీలకులను సైతం విస్మయానికి గురి చేస్తున్నది. స్థిరత్వం లేని జగన్ తీరు వెనుక ఎవరి సలహాలు ఉన్నాయన్న చర్చ ఇప్పుడు ఏపీ రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది.
పాత చరితను పునరావృతం చేస్తున్న డిప్యూటీ స్పీకర్!
తమిళనాడులో నటుడు విజయ్ నేతృత్వంలో టీవీకే ప్రభుత్వాన్ని కూల్చేందుకు జరిగిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు.
వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో నోటికి హద్దూ పద్దూ లేదన్నట్లుగా, జనసేనాని పవన్ కల్యాణ్, తెలుగుదేశం నేతలపై అనుచిత వ్యాఖ్యలతో దువ్వాడ రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. ఈ అనుచిత వ్యాఖ్యలపై దువ్వాడ శ్రీనివాస్ పై కొత్తూరు పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఒక కేసుకు సంబంధించి వివరణ ఇచ్చేందుకు బయలుదేరిన దువ్వాడ శ్రీనివాస్.. పోలీసు స్టేషన్ కు చేరకుండానే మిస్సయ్యారు.