కోతల రాజ్యంలో కోతల రాయుళ్ల దర్బార్.. నాణ్యమైన కరెంట్ బరాబర్!

Publish Date:Apr 25, 2022

Advertisement

ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ కోతలతో జనం అల్లాడుతుంటే...ప్రభుత్వం మాత్రం నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నాం, ట్రాన్స్ కో అద్భుతంగా పని చేస్తున్నదంటూ గప్పాలు కొడుతోంది. వాస్తవానికి మండు వేసవిలో  విద్యుత్ కోతలతో జనం అల్లాడి పోతున్నారు. విద్యుత్ కోతలు ఒక్క గృహావసరాలకే పరిమితం కాలేదు. అన్ని రంగాలకూ విస్తరించాయి. వ్యవసాయానికి కోత, పరిశ్రమలకు కోత...ఇలా ఏపీలో జగన్ సర్కార్ కోతల సర్కార్ గా మారిపోయింది. జనం అవస్థలను పట్టించుకోకుండా కోతల సర్కార్ లో కొందరు కోతల రాయుళ్లు దర్బార్ లు (మీడియా సమావేశాలు) పెట్టి మరీ విద్యుత్ సరఫరా భేష్ అంటూ సొంత భుజాలను తట్టుకుంటున్నారు.  ఈ కోతల రాయుళ్ల మాటలు వాస్తవ పరిస్థితికి పూర్తి భిన్నంగా ఉన్నాయి. వాస్తవానికి ఏపీలో న గరాలు, పట్టణాలు, గ్రామాలు అన్న తేడా లేకుండా ఎడాపెడా విద్యుత్ కోతలను అమలు చేస్తున్నారు. వ్యవసాయానికి  విద్యుత్ సరఫరా ఎప్పుడుంటుందో, ఎప్పుడుండదో రైతులకే కాదు విద్యుత్ అధికారులకే తెలియని పరిస్థితి ఉందంటే అతి శయోక్తి కాదు. ఇక పరిశ్రమల విషయానికి వస్తే ఏకంగా వారానికి ఒక రోజు పవర్ హాలీడే ప్రకటించేశారు. మిగిలిన రోజులైనా సక్రమంగా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉంటుందా? అంటే ఆ గ్యారంటీ లేదు. రాష్ట్రంలో విద్యుత్ కోతల కారణంగా ఇప్పటికే అనేక పరిశ్రమలు మూతపడ్డాయి. వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే...నాణ్యమైన విద్యుత్ అంటూ మంత్రి పెద్దిరెడ్డిగారు ట్రాన్స్ కోను పొగిడేస్తున్నారు. విద్యుత్ పంపిణీ వ్యవస్థను మరింత మెరుగు పరిచేందుకు కోట్ల రూపాయలు వ్యయం చేస్తున్నదంటూ సర్కార్ కు భుజకీర్తులు తగిలించేస్తున్నారు. ఆయన మాటలు కోటలు దాటుతున్నాయనీ, ప్రభుత్వ చేతలు మాత్రం గడప దాటుతున్న పరిస్థితి కనిపించడం లేదనీ విద్యుత్ రంగ నిపుణులు పెదవి విరుస్తున్నారు.   

విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి ఇలా ప్రదాన నగరాలతో పాటు పట్టణాలూ పల్లెల్లో విద్యుత్ కోతలు మండు వేసవిలో మంటలు రేపుతున్నాయి.    ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ అంటూ సర్కార్ వేస్తున్న ఈ కోతల వాతల వల్ల జనం అల్లాడుతున్నారు. మండు వేసవిలో జనాల పరిస్థితి మగ్గపెట్టిన మామిడి పళ్లలా తయారైంది.  రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ కోతల వళ్ల జనం నరకయాతన పడుతుంటే మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి విలేకరుల సమావేశం పెట్టి మరీ రాష్ట్రంలో విద్యుత్ సరఫరా భేషుగ్గా ఉందంటూ సర్కర్ పని తీరుకు కితాబులిచ్చేస్తున్నారు. గణాకాంలు కాదు సారూ...వాస్తవాలు చెప్పండంటూ జనం నిలదీస్తున్నారు.  విద్యుత్ కోతలతో ఆంధ్రప్రదేశ్ లో అందకారం తాండవిస్తోంది. పరిశ్రమలు మూతపడ్డాయి. వేల మంది కార్మికులు ఉపాధికి దూరమయ్యారు. వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే....సర్కార్ మాటలు మరోలా ఉండటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ లో సాయి కృష్ణ అనుమానాస్పద లాకప్ డెత్ వ్యవహారం ఇప్పుడు రచ్చ లేపుతోంది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఈ వ్యవహారంలో చర్యలు తీసుకుంది. కొంతమంది పోలీసులను సస్పెండ్ చేసింది.. విచారణకు ఆదేశించింది. ప్రభుత్వం చర్యలు తీసుకుంటుండగానే.. వైసిపి నాయకులు విమర్శలతో చెలరేగిపోయారు. వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి అంబటి రాంబాబు అలవాటుగా తన నోటికి పని చెప్పారు
బీజేపీ, ఎన్‌డీఏ నైతిక మద్దతుతో ఇండిపెండెంట్ గా బరిలోకి దిగిన నత్వానీ.. ఇండియా కూటమికి గట్టి షాక్ ఇచ్చారు. అసెంబ్లీలో ప్రతిపక్షాల కంటే అధికార కూటమికే స్పష్టమైన సంఖ్యాబలం ఉన్నప్పటికీ, కాంగ్రెస్ అభ్యర్థి ప్రణవ్ ఝాను మట్టికరిపించి నత్వానీ విజేతగా నిలవడం హాట్ టాపిక్‌గా మారింది.
2024 ఎన్నికలలో పరాజయం తరువాత రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించిన నాని.. ఇప్పుడు పొలిటికల్ గా యాక్టివ్ అవ్వడం సంచలనంగా మారింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రస్తుతం అత్యంత ఆసక్తికరమైన మరియు సంక్లిష్టమైన దశకు చేరుకున్నాయి
ఈ భవనాన్ని అలాగే వదిలేయడం వల్ల ఇప్పటివరకు 6 కోట్ల రూపాయల ప్రజాధనం బుడిదలో పోసిన పన్నీరైందన్నారు.
సూర్యనారాయణ రెడ్డికి సొంతంగా మాట్లాడే శక్తి లేదని, చేతిలో స్క్రిప్ట్ ఉంటే తప్ప ఆయన ప్రెస్ మీట్లలో కూడా మాట్లాడలేరని ఎద్దేవా చేశారు. ఆయన ప్రవర్తనను సినీ నటుడు బ్రహ్మానందం హావభావాలతో పోలుస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ఏసీ రూముల్లో కూర్చుని సోషల్ మీడియా వేదికగా అసత్యాలు ప్రచారం చేయడం కాదు.. ధైర్యముంటే ప్రజాక్షేత్రంలోకి వచ్చి నేరుగా చర్చకు రావాలని సవాల్ విసిరారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, ఉద్యోగాల భర్తీపై బహిరంగ చర్చకు తాను ఎప్పుడైనా సిద్ధమేనని లోకేష్ స్పష్టం చేశారు.
తమిళ రాజకీయాల్లో డీఎంకే చిరకాల మిత్రుడు ఎండీఎంకే అధ్యక్షుడు వైకో తాజాగా స్టాలిన్‌కు ఊహించని షాక్ ఇచ్చారు.
ఎవరికీ ఉపయోగపడకుండా ఖాళీగా పడి ఉన్న ఈ ప్యాలెస్ నిర్వహణ కోసమే నెలకు లక్షలాది రూపాయల ప్రజాధనం ఖర్చవుతుండటం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణకు భారీ ఎత్తున గంజాయి తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాపై ఈగల్ ఫోర్స్ మరోసారి ఉక్కు పాదం మోపింది.
వైసిపి నేత పెర్ని నాని ఈ విషయంపై చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. పవన్ కళ్యాణ్ ఆంధ్రా ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదనీ.. కానీ తెలంగాణలో ఎవడో ఒంట్లో బాలేదు అంటే వస్తున్నా తమ్ముడూ అంటూ వెళ్ళిపోయారంటూ చేసిన వ్యాఖ్యల పట్ల సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది.
ఇటీవల ఒక జాతీయ టీవీ చానల్ కు కవిత ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో బీఆర్ఎస్ నుంచి ఆహ్వానం వస్తే తిరిగి సొంత గూటికి వెడతారా అన్న ప్రశ్రకు ఆమె భావోద్వేగంగా స్పందించారు.
దెందులూరు నియోజకవర్గంలో ఏమి జరుగుతుంది..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.