ఢిల్లీలో సుబ్బారావు గుప్తా.. సింగిల్ హ్యాండ్ భారీ స్కెచ్
Publish Date:Feb 3, 2022
Advertisement
జంతర్ మంతర్ ఛ్ మంత్రకాళి.. అని ఎవరో మాయ చేసినట్లు.. వైయస్ జగన్ పార్టీ కీలక నేత సుబ్బారావు గుప్తా.. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ప్రత్యక్షమయ్యారు. చేతిలో బ్యానర్ పట్టుకుని.. మరీ ఆందోళనకు దిగారు.. తన కుటుంబాన్ని కాపాడాలని.. తనకు ప్రాణ రక్షణ కల్పించాలని.. తన ఇంటిపైనే కాకుండా.. గుంటూరు లాడ్జిలో తనపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలంటూ ఢిల్లీ వేదికగా డిమాండ్ చేస్తూన్నారీ సుబ్బారావు గుప్తా. అంతేకాదు.. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలిసేందుకు ఈ సుబ్బారావు గుప్తా.. తన ప్రయత్నాలను.. ఢిల్లీలో ముమ్మరం చేశాడని సమాచారం. అయితే ఎప్పుడు అమిత్ షాను కలిస్తాడనేది మాత్రం స్పష్టం కాలేదని తెలుస్తోంది. కానీ.. ఢిల్లీలో అమిత్ షాను కలవకుండా.. వెనక్కి ఒంగోలు వెళ్లేదే లే.. అన్నట్లు.. సుబ్బారావు గుప్తా ఉడుం పట్టుతో ఉన్నాడని మాత్రం స్పష్టమవుతోంది. ఏదీ ఏమైనా.. తనపై దాడి చేసిన మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి రైట్ హ్యాండ్ సుభానీ మాత్రం అత్తరింటికి వెళ్లి వచ్చినట్లు .. పోలీస్ స్టేషన్‌కు అలా వెళ్లి.. ఇలా స్టేషన్ బెయిల్‌తో బయటకు రావడం మాత్రం సుబ్బారావును బాగా కృంగ తీసిందని తెలుస్తుందీ. కానీ సుబ్బారావు గుప్తాపై మంత్రి బాలినేని వాసన్న అండ్ కో దాడిని తెలుగు రాష్ట్రాల్లోని ఆర్యవైశ్య సంఘాలు ముక్త కంఠంతో ఖండించాయి. అంతేకాదు.. సుబ్బారావుపై దాడిని ప్రజల్లోకి బలంగా తీసుకు వెళ్తామంటూ.. జగన్ పార్టీ నేతలకు సదరు సంఘాలు గట్టిగానే వార్నింగ్ ఇచ్చాయని తెలుస్తోంది. ఆ క్రమంలోనే మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆగమేఘాల మీద రంగంలోకి దిగి... పోలీసులకు చెప్పి.. సుభానీని అరెస్ట్ చేయించడం... సుబ్బారావుగుప్తాకు కేకు తినిపించడం.. ప్రకాశం జిల్లాలో ఏక్కడంటే అక్కడ పొట్టి శ్రీరాముల విగ్రహాం ఏర్పాటుకు తాను సొంతంగా నిధులు ఇస్తానని ప్రకటించడం.. ఇలా మళ్లీ సుబ్బారావు గుప్తా సామాజిక వర్గానికి మంత్రి బాలనినే వాసన్న దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేశారు.. చేస్తున్నారని తెలుస్తోంది. కానీ సుబ్బారావు గుప్తా ఎపిసోడ్‌లో జగన్ పార్టీకి జరగాల్సిన నష్టం మాత్రం అప్పటికే జరిగిపోయిందన్న విషయం అందరికీ తెలిసిందే. సుబ్బారావు గుప్తాపై దాడి జరిగిన వెంటనే.. మంత్రి బాలినేని వాసన్న రంగంలోకి దిగి.. సుభానీపై బలమైన కేసులు పెట్టించడంతోపాటు మీడియా సాక్షిగా.. సుబ్బారావు గుప్తాకు, ఆయన కుటుంబానికి క్షమాపణలు చెప్పి ఉంటే.. ఈ సుబ్బారావు గుప్తా ఎపిసోడ్.. దేశ రాజధాని ఢిల్లీకి చేరేదే కాదనే టాక్ ఒంగోలులో వైరల్ అవుతోంది. అదీకాక.. గుంటూరు లాడ్జిలో సుబ్బారావు గుప్తాపై సుభానీ దాడి చేసిన వీడియో.. అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.. అవుతోంది కూడా. ఈ నేపథ్యంలో సదరు వీడియోను.. సుబ్బారావు గుప్తా.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు చూపిస్తే.. జగన్ సర్కార్‌కు ఇక షో పడే అవకాశం లేక పోలేదని సుబ్బారావు గుప్తా సన్నిహితులు జోస్యం చెబుతున్నారు. ఏదీ ఏమైనా.. ఒంగోలు గల్లీ నుంచి.. ఢిల్లీకి చేరిన ఈ సుబ్బారావు గుప్తా.. రేపోమాపో.. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలిసినా ఆశ్చర్యపడక్కర్లేదని ప్రకాశం జిల్లా వాసులు పేర్కొంటున్నారు.
జగన్ పార్టీలో చోటు చేసుకోంటున్న పరిణామాలపై పెదవి విప్పితే.. తనను ఇంతలా కొడతారా? అంటూ.. ఒంగోలులోని మంత్రి బాలినేని వాసన్న అండ్ కోపై సుబ్బరావు గుప్తా ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారట. జగన్ వీరాభిమానిగా.. జగన్ పార్టీ బాగొగుల కోసం ఇంతలా మంచి చెప్పేవారు ఈ రోజుల్లో ఎక్కడున్నారని.. మంచి చెప్పినా.. తనకు అవమానం జరిగిందని తన సన్నిహితుల వద్ద సుబ్బారావు గుప్తా వాపోయినట్లు తెలుస్తోంది. గుంటూరు లాడ్జిలో ప్రాణ భయంతో తలదాచుకున్న తనపై మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి.. రైట్ హ్యాండ్ సుబానీతో చితకబాదించడం.. ఆ తర్వాత.. మంత్రే స్వయంగా తనకు కేకు తినిపించడం.. అంతా తెరచాటు రాజకీయమని సుబ్బారావు గుప్తా అభివర్ణిస్తున్నారని తెలుస్తోంది.
http://www.teluguone.com/news/content/subbarao-gupta-in-delhi-39-131224.html





