స్టడీస్‌కు ఉక్రెయిన్‌కే ఎందుకు?.. ఖర్చు ఎంత తక్కువ?
Publish Date:Feb 26, 2022
Advertisement
ఉక్రెయిన్‌పై రష్యా సైనిక దాడి చేసింది. బాంబులు, రాకెట్లతో విరుచుకుపడుతోంది. రష్యన్ ఆర్మీ ఉక్రెయిన్ లోలోనికి చొచ్చుకువెళుతోంది. వార్‌జోన్‌లో చిక్కుకుపోయిన భారతీయులు వేలాదిగా ఉన్నారు. అందులో అధికంగా విద్యార్థులే. వివిధ కోర్సులు చదివేందుకు వారంతా ఉక్రెయిన్ వెళ్లారు. వారి క్షేమం కోసం ఇక్కడి వారు తల్లడిల్లుతున్నారు. ఇంతకీ, అంతమంది ఉక్రెయిన్ వెళ్లి చదువుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇండియాలో ప్రముఖ విద్యాసంస్థలు లేవా? అయినా, ఏ అమెరికానో, ఆస్ట్రేలియానో, బ్రిటనో, కెనడానో వెళ్లేవారు ఉన్నారు కానీ.. ఉక్రెయిన్‌కు కూడా వేలాది మంది భారతీయ విద్యార్థులు వరుస కట్టడానికి కారణం ఏంటి? అనేది ఇంట్రెస్టింగ్ పాయింట్. ఉక్రెయిన్‌కు వెళ్లిన ఇండియన్ స్టూడెంట్స్‌లో ఎక్కువ మంది మెడిసిన్ చదివే వారే. ఆ దేశంలో వైద్య విద్య ఇక్కడితో పోలిస్తే ఖరీదు తక్కువ. మెడిసిన్ అనే కాదు.. ఉక్రెయిన్‌లో పలు అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. భారీ సంఖ్యలో విదేశీ విద్యార్థులు ఇక్కడ చదువుతున్నారు. అమెరికా, కెనడా, బ్రిటన్ దేశాలతో పోల్చుకుంటే ఉక్రెయిన్‌లో కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా తక్కువ. కోర్సు ఫీజులు కూడా తక్కువగానే ఉంటాయి. మరి, ఇండియాలో మెడికల్ కాలేజీలు లేవా? అంటే ఉన్నాయి.. కానీ, ఎంట్రన్స్ టెస్ట్‌లో మంచి ర్యాంక్ వస్తేనే మన దగ్గర సీటు. లేదంటే లేదు. మెడికల్ సీట్లు కూడా చాలా తక్కువ. ఇక, ఇండియాలో ఎంబీబీఎస్‌లో పేమెంట్ సీట్ కావాలంటే.. రూ.కోటికి పైనే ఫీజు కట్టాలి. అదే ఉక్రెయిన్‌లో అయితే.. ఎంట్రన్స్ టెస్ట్ ఉండదు.. కోటి కూడా అవసరం లేదు. లక్షల్లోనే అయిపోతుంది. పైగా ఫారిన్ రిటర్న్ అనే ట్యాగ్. అందుకే, ప్రతీఏటా వైద్య విద్య కోసం వేల సంఖ్యలో భారతీయ విద్యార్థులు ఉక్రెయిన్ వెళ్తుంటారు. ఉక్రెయిన్‌లో వివిధ కోర్సులకు ఏడాదికి యావరేజ్ ట్యూషన్ ఫీజు ఇలా ఉంది... ఇక, అకాండేషన్‌కి, ఫుడ్‌కి ఖర్చు అదనం. సిటీ సెంటర్‌లో ఉండే అపార్ట్‌మెంట్‌లోని సింగిల్ బెడ్‌రూం నెలకు 20వేల వరకూ ఉంటుంది. డబుల్ అయితే 30వేలు.. త్రిబుల్ అయితే 40వేలు రెంట్ ఉంటుంది. ఒక్కో ఫ్లాట్‌లో నలుగురు నుంచి ఎనిమిది మంది వరకూ విద్యార్థులు ఉంటున్నారు. అలా చూస్తే ఒక్కో స్టూడెంట్‌కి నెలకు రెంట్‌కి 5 వేలుంటే సరిపోతుంది. ఇక, సిటీ బయట ఉండే అపార్ట్‌మెంట్ రెంట్స్ చీప్‌గా ఉంటాయి. అక్కడ సింగిల్ బెడ్‌రూం ఫ్లాట్ 12వేలకే వచ్చేస్తుంది. అలాగైతే ఖర్చు మరింత తగ్గుతుంది. అంటే, దాదాపు మన హైదరాబాద్‌లో ఉండే ధరలే అక్కడా కూడా. ఇక్కడైతే లోకల్.. అదే అక్కడైతే ఫారిన్ అనే బిల్డప్. ఉక్రెయిన్‌లో వసతి, పుస్తకాలు, యూటిలిటీ బిల్స్, ఇతర ఖర్చులు అన్నీకలిపి.. ఒక స్టూడెంట్‌కి కోర్సును బట్టి.. నెలకు 20వేల నుంచి 30వేల వరకు ఖర్చు అవుతుందని అంటున్నారు. పెద్ద నగరాలైన కీవ్, ఒడెస్సాలో వ్యయం చాలా అధికం. చిన్న నగరాలైన ఖార్కీవ్, సుమీలలో ఖర్చు చాలా తక్కువ. ఇక, ఫుడ్‌కి ఒక స్టూడెంట్‌కి నెలకు సుమారు 10వేలు అవుతుందని తెలుస్తోంది. ఉక్రెయిన్‌లో....
మెడిసిన్ - రూ. 3,12,118
ఇంజనీరింగ్ - రూ. 1,70,922
కంప్యూటర్ సైన్స్ - రూ.1,70,922
బిజినెస్ అండ్ ఫైనాన్స్ - రూ. 1,48,628
పోస్టుగ్రాడ్యుయేట్ కోర్సులు - రూ. 2,22,942
లీటర్ పాలు రూ.42
కిలో బియ్యం రూ.74
డజన్ ఎగ్స్ రూ.75
కిలో టమాట రూ.95
అరటి పండ్లు రూ.95
1.5 లీటర్ వాటర్ బాటిల్ రూ. 30
http://www.teluguone.com/news/content/students-fee-and-cost-of-living-in-ukrain-39-132336.html





