హర్మూజ్ గుండా సురక్షిత రవాణా కోసం అమెరికా అయిల్ కారిడార్.!

Publish Date:Aug 20, 2026

Advertisement

ఇంధన రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధిలో అమెరికా సైన్యం పటిష్ఠ భద్రత కల్పించింది. చమురు రవాణాకు ఇసుమంతైనా అవరోధం  కలగకుండా కీలక నిర్ణయం తీసుకుంది. హర్మూజ్ గుండా చమురు రవాణాకు అంతరాయం లేకుండా పటిష్ఠ భద్రత కల్సిస్తూ  ఒక షిప్పింగ్ కారిడార్ ను ఏర్పాటు చేసింది. గల్ఫ్ దేశాల నుంచి అంతర్జాతీయ మార్కెట్లకు చమురు రవాణాను పునరుద్ధరించేందుకు అమెరికా ఈ చర్య తీసుకుంది.  

యుద్ధానికి ముందు ఈ జలసంధి గుండా వెళ్లే చమురు పరిమాణంతో పోలిస్తే..ఇప్పుడు  అమెరికా పర్యవేక్షణలో సగం మేర రవాణా పున్: ప్రారంభమైంది. ప్రస్తుతం రోజుకు  కోటి బ్యారెళ్ల  చమురు హర్మూజ్ ద్వారా  సురక్షితంగా రవాణా అవుతోంది. పరిస్థితి మరింత అనుకూలిస్తే రాబోయే కొద్ది రోజుల్లో ఈ సరఫరా రోజుకు రెండు కోట్ల బ్యారెళ్లకు  పెరుగుతుందని అంచనా.  

ఇరాన్ నుంచి పొంచి ఉన్న డ్రోన్లు, క్రూయిజ్ క్షిపణుల ముప్పును తిప్పికొడుతూ వాణిజ్య నౌకలను సురక్షితంగా దాటించడం  కోసం అమెరికా యుద్ధ విమానాలు నిరంతరం ఆకాశంలో మోహరించి, చమురు ట్యాంకర్లకు భద్రత కల్పిస్తున్నాయి.

హర్మూజ్ జలసంధిలోని దక్షిణ మార్గంలో, ఒమన్ తీరానికి సమీపంలో అమెరికా నియంత్రణలోని ఈ ప్రత్యేక కారిడార్‌..  సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్, ఇరాక్, ఖతార్ వంటి  ఇంధన ఉత్పత్తి దేశాల నుంచి చమురు నింపుకున్న ట్యాంకర్లతో పాటు, ఖాళీగా తిరిగొచ్చే నౌకలకు కూడా పూర్తి భద్రత కల్పిస్తూ రవాణాను సమన్వయం చేస్తున్నది.

గత రెండు వారాలుగా ప్రతి రోజూ 15 నుండి 20 బారీ ఆయిల్ ట్యాంకర్లు ఈ  మార్గంలో ప్రయాణిస్తున్నాయి. హర్మూజ్ ప్రాంతంలో ఇరాన్‌కు చెందిన రాడార్ వ్యవస్థలు, సముద్ర నిఘా నెట్‌వర్క్‌లను అమెరికా సైన్యం   దెబ్బతీయడంతో ఈ నౌకల కదలికల సమన్వయం సులభతరమైంది.  ప్రపంచ మార్కెట్లో చమురు కొరత ఏర్పడి ధరలు ఆకాశాన్ని తాకకుండా చూడటంలో ఈ ఆయిల్ కారిడార్   కీలక పాత్ర పోషిస్తోంది. అయితే ఇరాన్ క్షిపణి దాడుల భయం ఇంకా పూర్తిగా తొలగిపోకపోవడంతో ఈ మార్గంలో ప్రతి చమురు ట్యాంకర్ ప్రయాణం ఇప్పటికీ ప్రమాదంగానే ఉంది. 

Strait of Hormuz, US Oil Corridor, Gulf Oil Supply, Fort Bragg Task Force, Iran Conflict, Oil Tanker Security

By
en-us Political News

  
 దక్షిణాదిలోని ప్రధాన ఆర్థిక కేంద్రాల మధ్య రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సిన చంద్రబాబు నొక్కి చెప్పారు.  అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలను సమర్థవంతంగా అనుసంధానిస్తూ కుప్పం మీదుగా ప్రత్యేక బుల్లెట్ ట్రైన్ కారిడార్‌ను ఏర్పాటు  ప్రతిపాదించారు.
ప్రాజెక్ట్ కోసం ఆంధ్రప్రదేశ్‌లోని చింతలపూడి,  రేచర్ల బొగ్గు బ్లాకులను ఎంపిక చేశారు. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ నిర్వహించిన ఈ వేలం ప్రక్రియ ద్వారా ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్ ఈ రెండు  బొగ్గు బ్లాకులను దక్కించుకుంది.
దాదాపు వెయ్యి కోట్ల రూపాయల  విదేశీ చెల్లింపుల  వ్యవహారంలో పన్ను ఎగవేత, యు అక్రమ నిధుల మళ్లింపు ఆరోపణలపై ఐటీ అధికారులు ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఏకకాలంలో  13 ప్రాంతాలలో సోదాలు చేపట్టారు.  ఈ సోదాల్లో డిజిటల్ ఆధారాలు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లో తన వాటాను 9.99 శాతానికి పెంచుకోవడానికి ఎల్‌ఐసికి ఆర్బీఐ అనుమతి లభించింది. ఈ వార్తతో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ షేరు ధర 1% పెరిగింది. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
ఆస్ట్రేలియా టెన్నిస్ స్టార్ నిక్ కిర్గియోస్ డోపింగ్ వివాదంలో చిక్కుకున్నాడు. కొకైన్ పరీక్షలో పాజిటివ్‌గా తేలడంతో ITIA అతడిపై తాత్కాలిక సస్పెన్షన్ వేటు వేసింది. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
ఎఫ్‌ఐహెచ్ పురుషుల హాకీ వరల్డ్ కప్ పూల్ డి మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై భారత్ 5 3 తేడాతో సంచలన విజయం సాధించింది. హర్మన్‌ప్రీత్ సింగ్, అభిషేక్ చెరో రెండు గోల్స్‌తో చెలరేగి జట్టుకు ఘన విజయాన్ని అందించిన పూర్తి వివరాలు చూడండి.
బిడబ్ల్యూఎఫ్ వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్‌లో పీవీ సింధు, ఆయుష్ శెట్టి ప్రిక్వార్టర్స్‌లోకి దూసుకెళ్లారు. సాత్విక్ చిరాగ్ జోడీకి వాకోవర్ లభించగా, లక్ష్యసేన్ తీవ్ర పోరాటంలో ఓటమి పాలయ్యాడు. మ్యాచ్ ఫలితాలు, కీలక గణాంకాల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి!
అంతర్జాతీయ చెస్ రంగాన్ని ఏలుతున్న భారత్! ప్రతిష్టాత్మక సింక్‌ఫీల్డ్ కప్‌లో ఫ్రాన్స్ గ్రాండ్‌మాస్టర్‌ను ఓడించి అగ్రస్థానానికి చేరుకున్న ఆర్. ప్రజ్ఞానంద. మరోవైపు ఆసియాన్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో భారత అండర్ 11 బాలికల జట్టు బ్రాంజ్ మెడల్ సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది. పూర్తి వివరాలు చదవండి.
నాసా ప్రతిష్టాత్మక స్విఫ్ట్ గామా-రే టెలిస్కోప్ రెస్క్యూ మిషన్ విఫలమైంది. $30 మిలియన్ల వ్యయంతో చేపట్టిన రోబోటిక్ క్రాఫ్ట్ నియంత్ పిలవకపోవడంతో మిషన్‌ను నాసా రద్దు చేసింది. త్వరలోనే భూ వాతావరణంలో మండిపోనున్న స్విఫ్ట్ టెలిస్కోప్ పూర్తి వివరాలు ఇవే!
ఆస్టిన్ నగరంలో టెస్లా రోబోటాక్సీ ప్లాస్టిక్ బొల్లార్డ్స్‌ను ఢీకొట్టిన వైరల్ వీడియో వెనుక ఉన్న పూర్తి వివరాలు, టెస్లా స్వయంప్రతిపత్తి భద్రతా రికార్డులు మరియు సైబర్‌క్యాబ్ ప్రయోగాల వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
గుడ్‌లక్ ఇండియా 2:1 బోనస్ షేర్ల ప్రకటన అర్హత సాధించడానికి మార్చి 13 రికార్డు తేదీ కాగా, షేర్లు కొనుగోలు చేయడానికి ఈరోజే ఆఖరి అవకాశం. షేర్ల ధర, డివిడెండ్ ప్రభావం మరియు పూర్తి వివరాలు తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.