టైగర్ నాగేశ్వరరావును నిలిపేయండి

Publish Date:Jul 11, 2023

Advertisement

టైగర్ నాగేశ్వరరావు చిత్రం విడుదల అయితే తమ మనోభావాలు దెబ్బతింటాయని గిరిజన సంఘం నాయకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ క్రమంలో ఈ చిత్ర టీజర్‌ని నిలిపి వేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అందులోభాగంగా ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ కమిషనర్, డీజీపీకి వారు వినతి పత్రాన్ని అందజేశారు.

అనంతరం వారు మాట్లాడుతూ.. దక్షిణ భారతదేశంలో నేరస్తుల రాజధాని స్టూవర్ట్ పురం. ఈ గ్రామానికి చెందిన గజదొంగ టైగర్ నాగేశ్వరరావుపై చిత్రం తెరకెక్కిస్తున్నట్లు.. ఆ చిత్ర టీజర్‌ విడుదల సమయంలో సినిమా నిర్మాతలు ప్రకటించారన్నారు. టైగర్ నాగేశ్వరరావు ఎరుకుల సామాజిక వర్గానికి చెందిన వారని.. ఈ నేపథ్యంలో ఈ చిత్రం వల్ల .. తమ సామాజిక వర్గం పట్ల.. ప్రజల్లో ఓ వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశాలు ఉన్నాయని.. దీని వల్ల తమకు భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని సదరు గిరిజన నాయకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ రంగంలో సైతం ప్రస్తుత తమ సామాజిక వర్గానికి ఉద్యోగాలు దొరకడం లేదని.. అలాంటి వేళ ఇటువంటి సినిమాలు విడుదల అయితే తమ పరిస్థితి మరింత దిగజారుతోందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  

ఇప్పటికే ఎరుకుల ప్రజలన్నా.. స్టూవర్ట్‌పురం అన్నా ప్రజల్లో ఓ విధమైన చులకన భావం ఉందని వారు ఈ సందర్బంగా గుర్తు చేస్తున్నారు. అందువల్ల ఈ చిత్రాన్ని నిలుపుదల చేయాలని అటు సినిమాటోగ్రఫీ కమిషనర్, ఇటు డీజీపీని కోరినట్లు వారు వివరించారు.  

డీజీపీని, సినిమాటోగ్రఫీ కమిషనర్‌ను కలిసి వినతి పత్రం అందజేసిన వారిలో గిరిజన నాయకులు చుక్కా పాల్ రాజు, స్టూవర్ట్‌పురం వైస్ ప్రెసిడెంట్ శ్రీరాగాల రాము, విశ్రాంత ఎస్‌ఐ వల్లాగి కాంతారావు, ఎబినేజర్, రామారావుతోపాటు విజయవాడకు చెందిన ప్రముఖ గిరిజన నాయకులు తిమ్మాసర్తి నాగేశ్వరరావు, మల్లి భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.

By
en-us Political News

  
డేటింగ్ యాప్ ద్వారా పరిచయం.. పబ్‌కు తీసుకెళ్లి రూ.29 వేల బిల్లు.!
హైదరాబాద్ నగరంలోని ఎస్‌ఆర్‌ నగర్ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపిన ఒక విషాదకర ఘటనలో యువతి ప్రాణాలు కోల్పోయింది.
అరుణాచల్ ప్రదేశ్‌లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో ఖాళీగా ఉన్న స్థానాలను భర్తీ చేసేందుకు కొలీజియం కీలక నిర్ణయం తీసుకుంది.
సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రి ప్రాంగణంలో ఓ మానసిక రోగి హల్‌చల్‌ చేయడంతో కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
దేశ రాజకీయాల్లో ప్రాంతీయ అసమానతలు, ఉత్తరాది ప్రాబల్యంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి తన గళాన్ని గట్టిగా వినిపించారు.
జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత యువ షూటర్, తెలంగాణ ముద్దుబిడ్డ ఈషా సింగ్ అద్భుత ప్రతిభ కనబరిచారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు సంబంధించి ప్రభుత్వం అధికారిక ప్రకటన జారీ చేసింది.
హైదరాబాద్ నగరంలో మహిళల భద్రతను ప్రశ్నార్థకం చేస్తూ మరో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది.
బాలీవుడ్‌లో మరోసారి ఆదాయపు పన్ను శాఖ దూకుడు పెంచింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.