Khairatabad: శాసనసభ స్థానంపై గెజిట్ నోటిఫికేషన్‌ జారీ.!

Publish Date:Sep 28, 2026

Advertisement

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు సంబంధించి ప్రభుత్వం అధికారిక ప్రకటన జారీ చేసింది. దానం నాగేందర్ ఎమ్మెల్యేగా అనర్హతకు గురైనట్లు ప్రకటిస్తూ గెజిట్ నోటిఫికేషన్ వెలువడింది. దీంతో ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం సీటు 2024 ఏప్రిల్ 23 నుంచే ఖాళీగా ఉన్నట్లు అధికారికంగా ప్రకటించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో దానం నాగేందర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఖైరతాబాద్ నుంచి గెలిచారు. అయితే 2024 మార్చిలో ఆయన కాంగ్రెస్‌లో చేరారు. అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతూనే 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా సికింద్రాబాద్ నుంచి పోటీ చేశారు. ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ ఆయనపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి తదితరులు స్పీకర్‌ను ఆశ్రయించారు.

ఈ అనర్హత పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ నిర్ణయం తీసుకున్నారు. అయితే స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు 2026 సెప్టెంబర్ 18న కీలక తీర్పు వెలువరించింది. దానం నాగేందర్‌ను రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌ 2(1)(a) ప్రకారం అనర్హుడిగా ప్రకటిస్తూ, స్పీకర్ గత నిర్ణయాన్ని పక్కనపెట్టింది. 2024 ఏప్రిల్ 23 నుంచే ఆయన ఎమ్మెల్యే పదవికి అనర్హుడని, ఫలితంగా ఖైరతాబాద్ అసెంబ్లీ సీటు ఖాళీగా మారిందని హైకోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలోనే సెప్టెంబర్ 26న ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. హైకోర్టు W.P. నెం. 8409, 8647 (2026) లో సెప్టెంబర్ 18న ఇచ్చిన తీర్పుకు అనుగుణం గా ఈ ప్రకటన చేసినట్లు గెజిట్‌లో పేర్కొన్నారు. 


భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 191(2)తో కలిపి పదో షెడ్యూల్‌లోని 2(1)(a) ప్రకారం దానం నాగేందర్ అనర్హతకు గురైనట్లు స్పష్టం చేశారు. ఆయన అనర్హత 2024 ఏప్రిల్ 23 నుంచి అమ ల్లోకి వచ్చినట్లు, అదే తేదీ నుంచి ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీగా ఉన్నట్లు అధికారికంగా నమోదు చేశారు.ఇదిలా ఉంటే.. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దానం నాగేందర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే సెప్టెంబర్ 24న సుప్రీంకోర్టు ఆయన పిటిషన్‌ను కొట్టివేసి, హైకోర్టు ఇచ్చిన అనర్హత తీర్పులో జోక్యం చేసుకోవడానికి కారణం లేదని స్పష్టం చేసింది. 

దీంతో దానం నాగేందర్ అనర్హతపై హైకోర్టు ఇచ్చిన తీర్పు కొనసాగింది. దానం నాగేందర్ బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి, ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరి అదే సమయంలో కాంగ్రెస్ అభ్యర్థిగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం ఈ కేసులో ప్రధాన అంశంగా మారింది. ఇదే చర్యను పార్టీ మార్పుగా పరిగణించిన కోర్టులు రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ కింద అనర్హతకు దారితీసినట్లు తీర్పుల్లో పేర్కొన్నాయి.ఇప్పుడు ప్రభుత్వం జారీ చేసిన గెజిట్‌తో దానం నాగేందర్ అనర్హత, ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీగా ఉన్న అంశం అధికారిక రికార్డులో స్పష్టంగా నమోదైంది. ముఖ్యంగా 2024 ఏప్రిల్ 23 నుంచే సీటు ఖాళీగా ఉన్నట్లు గెజిట్‌లో పేర్కొనడం కీలక అంశంగా మారింది.

 

 

[ Khairatabad Assembly constituency, Danam Nagender, Gazette Notification, Supreme Court, Padi Kaushik Reddy, BJP MLA Yeleti Maheshwar Reddy, Speaker Gaddam Prasad Kumar, CM Revanth reddy, KTR, BRS Party ]

By
en-us Political News

  
దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో ఖాళీగా ఉన్న స్థానాలను భర్తీ చేసేందుకు కొలీజియం కీలక నిర్ణయం తీసుకుంది.
సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రి ప్రాంగణంలో ఓ మానసిక రోగి హల్‌చల్‌ చేయడంతో కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
దేశ రాజకీయాల్లో ప్రాంతీయ అసమానతలు, ఉత్తరాది ప్రాబల్యంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి తన గళాన్ని గట్టిగా వినిపించారు.
జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత యువ షూటర్, తెలంగాణ ముద్దుబిడ్డ ఈషా సింగ్ అద్భుత ప్రతిభ కనబరిచారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
హైదరాబాద్ నగరంలో మహిళల భద్రతను ప్రశ్నార్థకం చేస్తూ మరో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది.
బాలీవుడ్‌లో మరోసారి ఆదాయపు పన్ను శాఖ దూకుడు పెంచింది.
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త సంక్షేమ అధ్యాయానికి తెరలేచింది.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
ఒకవైపు ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే, మరోవైపు అదే ఎన్నికల్లో ప్రతిపక్షాలు పాల్గొనడం వల్ల ఆ తప్పులకూ, లోపాలకు చట్టబద్ధత కల్పించినట్లవుతోందన్న ఆయన ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
శంషాబాద్ వద్ద హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై ఊహించని ఘటన చోటుచేసుకుంది.
దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న అర్బన్ ల్యాండ్ సీలింగ్‌ (ULC) దరఖాస్తుల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.