ఫ్యాక్షన్ వెనక్కు, ప్రగతి ముందుకు: సీమలో బెల్ భారీ ప్లాంట్.!

Publish Date:Oct 26, 2026

Advertisement

తెలుగుదేశం కూటమి ప్రభుత్వ హయాంలో రాయలసీమ ఫ్యాక్షన్ ముద్రను చెరిపేసుకుంటోంది. ఫ్యాక్షన్ సంస్కృతికి మారుపేరుగా గుర్తింపు పొందిన రాయలసీమ ఇప్పుడు పారిశ్రామికంగా ప్రగతి బాటలో పరుగులు తీస్తోంది. తాజాగా రాయలసీమలోని సత్యసాయి జిల్లా  డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా మారడానికి సర్వం సిద్ధమైంది.  ఒకప్పుడు వెనుకబడిన ప్రాంతంగా పేరొందిన రాయలసీమ నేలపై ఇప్పుడు దేశ రక్షణకు అవసరమైన  అత్యాధునిక క్షిపణులు, రాడార్లు  రక్షణ సాంకేతిక పరికరాల తయారీ ప్రాజెక్టులు రాబోతున్నాయి. ఇండియన్  భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) ఈ జిల్లాలో సుమారు పాతిక వందల కోట్ల రూపాయల  వ్యయంతో అంతర్జాతీయ స్థాయి రక్షణ తయారీ కేంద్రాన్ని నెలకొల్పనుంది. .

పాలసముద్రం ప్రాంతంలో  914 ఎకరాల విస్తీర్ణంలో రూపుదిద్దుకుంటున్న ఈ ప్లాంట్‌లో  క్షిపణులు, రాడార్ వ్యవస్థలు,  వాటికి సంబంధించిన   కీలకమైన పరీక్షా పరికరాల ఉత్పత్తి జరగనుంది. 1956 నుంచి దేశ రక్షణ రంగ సేవల్లో క్రియాశీలకంగా ఉన్న బీఈఎల్, ప్రస్తుతం  350కి పైగా స్వదేశీ ఉత్పత్తులను తయారు చేస్తోంది. ప్రసిద్ధ ఆకాశ్ క్షిపణి వ్యవస్థల తయారీలో కీలక పాత్ర పోషిస్తున్న బెల్  పాలసముద్రం యూనిట్ ద్వారా సరికొత్త సాంకేతికతలను అందుబాటులోకి తేనుంది.

ఈ యూటిన్  ఏర్పాటుతో  800 మందికి గా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. అలాగే ఈ   రక్షణ పరిశ్రమ ఆధారంగా పనిచేసే పలు అనుబంధ చిన్న, మధ్య తరహా పరిశ్రమలు  కూడా ఇక్కడ కొలువుదీరనున్నాయి. దీనివల్ల శ్రీ సత్యసాయి జిల్లా పరిధిలో  వేలాది మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

కేవలం బెల్  ప్లాంట్ మాత్రమే కాకుండా, ఈ ప్రాంతాన్ని సమగ్ర రక్షణ కారిడార్‌గా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. అందులో భాగంగా పుట్టపర్తి పరిధిలోని 350 ఎకరాల్లో డిఆర్డిఓ ఆధ్వర్యంలో విమానాల సమీకృత,  ఫ్లైట్ టెస్టింగ్ కాంప్లెక్స్ ఏర్పాటుకానుంది. ఇది దేశానికే అత్యంత ప్రాధాన్యమైన అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాష్ట   రక్షణ కార్యక్రమానికి వేదికగా నిలవనుంది. ఇంకా  మడకశిర ప్రాంతంలో కూడా పలు రక్షణ ఆధారిత కంపెనీలు తమ ప్రాజెక్టులను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నాయి. 

[Sri Sathya Sai District As Defense Hub, Bharat Electronics Limited,  Palasamudram,  DRDO Puttaparthi Complex, Employment, Telugu One]

By
en-us Political News

  
ఈ అల్పపీడనం  పశ్చిమ, వాయువ్య దిశగా పయనిస్తూ అండమాన్, అండమాన్ నికోబా దీవుల సమీపంలో  తుపానుగా బలపడే సూచనలు ఉన్నాయి. ఆ తరువాత  ఇది మరింత బలపడి ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో  వచ్చే నెల  1, 2 తేదీలలో కోస్తాంధ్రతో పాటు పలు ప్రాంతాలలో  భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
అధికారులు, యంత్రాంగం, ప్రభుత్వం సమష్టి కృషితో ప్రాణ, ఆస్తి నష్టాన్ని గణనీయంగా తగ్గించగలిగామన్న సీఎం.. అవిశ్రాంతంగా శ్రమించిన అధికారులు, యంత్రాంగాన్ని అభినందిస్తూనే..   విపత్తు ప్రభావం నుంచి ప్రజలు పూర్తిగా కోలుకునే వరకు  నిరంతరం అప్రమత్తంగా ఉండాలని దిశా నిర్దేశం చేశారు.
మేము మోచేతులు పైకి మడత పెట్టాం.. పులివెందుల సభలో జగన్‌పై విమర్శలు..!
తుపానును సమర్ధంగా ఎదుర్కొనేందుకు సర్వశక్తులూ ఒడ్డామని చెప్పిన ఆయన అర్నాబ్ కారణంగా రాష్ట్రంలో ఐదుగురు మరణించారని తెలిపారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా వారిని కాపాడలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు.
 సహాయ చర్యలలో   39 ఎన్‌డీఆర్‌ఎఫ్  బృందాలతో పాటు 80 రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన  బృందాలు నిమగ్నమై ఉన్నాయి. ఇవి కాకుండా . ఇండియన్ ఎయిర్‌ఫోర్స్  ప్రత్యేకంగా రెండు విమాన సర్వీసులను నడిపి అదనపు బలగాలను క్షేత్రస్థాయిలో  మోహరించింది.
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల రాజకీయ వాతావరణం వేడెక్కుతున్న తరుణంలో రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) కీలక నిర్ణయం తీసుకుంది.
అర్నాబ్ తుపాను కారణంగా భారీ వర్షాలు, ప్రచండ గాలుల కారణంగా అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్ ను మరో ఏడురోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు ముంచెత్తనున్నాయి. అర్నాబ్ తుపాను తీరం దాటింది.. ఇక వానలు తగ్గుతాయి అనుకుంటున్న దశలో వాతావరణ శాఖ మరో వారం పాటు ఏపీకి భారీ వర్షాల బెదల కొనసాగుతుందని హెచ్చరించింది. 
అర్నాబ్   కాకినాడ జిల్లాలోని   ఉప్పాడలో బీభత్సం సృష్టించింది. సముద్ర రాకాసి అలలు బీచ్ రోడ్డును ధ్వంసం చేశాయి. పెద్ద పెద్ద బండరాళ్లు సైతం కొట్టుకు పోయాయంటే అలల ఉధృతి ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు.
మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా మారింది ఆంధ్రప్రదేశ్ రైతుల పరిస్థితి.
ఆర్నాబ్ ప్రభావంతో రాష్ట్రంలో రవాణా వ్యవస్థ పరిస్థితి దయనీయంగా మారింది.  ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో రైళ్లు రద్దయ్యాయి.  ఇక ఇప్పుడు అర్పాబ్ ప్రభావం కారణంగా రైల్వే ట్రాక్ లు దెబ్బతిన్న సంఘటనలు ఇప్పుడు వెలుగు చూస్తున్నాయి.  అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన అరకులో తుపాను ధాటికి రైల్వే   ట్రాక్ ధ్వంసమైంది.
అర్నాబ్ తుపాను ప్రభావం కారణంగా రాష్ట్రంలో జరిగి ఆస్తి నష్టం అంచనాకు సత్వరమే కేంద్ర బృందాన్ని పంపాలని ఆ లేఖలో చంద్రబాబు హోంమంత్రిని కోరారు.  అలాగే అర్నాబ్ కారణంగా జరిగిన నష్టాన్ని పూడ్చే విషయంలో కేంద్రం నుంచి ఆర్థిక సహాయాన్ని చంద్రబాబు కోరారు.
రీ వర్షం కారణంగా బందరు వీధులు చెరువులను తలపించాయి.  లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి.  ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన సహాయ కార్యక్రమాలు చేపట్టింది.   రహదారులపై పడిన చెట్లను, కొమ్మలను యంత్రాల సాయంతో తొలగించి దారులను పునరుద్ధరించే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.