ఏపీ బీజేపీలో చీలిక!.. వీర్రాజు తీరుతో వినాశనం!

Publish Date:Apr 5, 2022

Advertisement

ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీలిక వైపుగా అడుగులు వేస్తోందా? ఇంతవరకు తెరచాటున, ముఖ్యమంత్రి  జగన్ రెడ్డి చంకెక్కి కూర్చున్న, వైసీపీ అనుకూల వర్గం, ఇప్పుడు బహిరంగంగానే వైసీపీకి బీ’టీమ్ అనిపించుకునేందుకు ఆరాట పడుతోందా? అందుకూ అవుననే సమాధానమే వస్తోంది. అలాగే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్,తెలుగు దేశం పార్టీతో చేతులు కలిపితే, ఆయనతోనూ తెగతెంపులు చేసుకునేందుకు సిద్డమవుతోందా, అంటే అందుకూ అవుననే సమాధానమే వస్తోంది. నిజానికి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, మొదటినుంచి కూడా తెలుగు దేశం, వ్యతిరేక స్టాండ్ తీసుకోవడం తెలిసిన విషయమే.అదేమిటో కానీ, సోము వీర్రాజు ప్రభుత్వం మారి మూడు సంవత్సరాలు అయినా.. ఇంకా చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి అనే భ్రమల్లో ఉన్నట్లు వ్యవహరిస్తున్నారు అని పించేలా చంద్రబాబు పైనే ఆరోపణలు చేస్తున్నారు.

కాగా,  వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తానని ప్రకటించడం ద్వారా పవన్ కళ్యాణ్ ఇప్పటికే టీడీపీతో పొత్తు పక్కా, అనే సంకేతాలు ఇచ్చారు. అదే సమయంలో బీజేపీ రోడ్ మ్యాప్ గురించి మట్లాడడం ద్వారా 2014లో లాగా మళ్ళీ బీజేపీ, తెలుగు దేశం, జనసేన ఉమ్మడిగా పనిచేయాలనే సంకల్పాన్ని వ్యక్తపరిచారు. ఈ నేపధ్యంలోనే సోము వీర్రాజు వర్గం, ‘ఒంటరి పోరాటం’ అనే కొత్త రాగం ఎత్తుకుంది. 

నిజానికి బీజేపీ కేంద్ర నాయకత్వం, పొత్తుల గురించి ఇప్పుడే మాట్లాడవద్దని, ఎన్నికలు వచ్చినప్పుడు, అప్పటి పరిస్థితిని బట్టి కేంద్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని, అంతవరకు జనసేనతో కలిసి వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఆందోళనచేయాలని ఆదేశించింది. అయితే, వీర్రాజు వర్గం, అందుకు విరుద్ధంగా, అధికారంలో ఉన్న వైసీపీని వదిలేసి టీడీపీ వ్యతిరేక ప్రచారం సాగిస్తున్నారు. నిజానికి, ఏపీలో బీజేపీకి ఉన్న బలం ఎంతో అందరికీ తెలిసిన విషయమే. బీజేపీ రాష్ట్రంలో ఎవరితో అయినా పోటీ పడగలదు అంటే, అది ఒక్క నోటా’తో మాత్రమే. 

అయినా, సోము వీర్రాజు ఎక్కువగా ఉహించుకుంటున్నారో ఏమో కానీ, అవసరమైతే ఒంటరిగా పోటీ చేస్తాం’ అని బింకాలు పోతున్నారు. ఒంటరిగా పోతే ఏమవుతుందో, తెలియని విషయం కాదు. బీజేపీ 2019 ఎన్నికలో ఒంటరిగానే పోటీ చేసింది. ఒక్క సీటు కాదు ఒక్క సీట్లో డిపాజిట్’ కూడా రాలేదు.అయినా ఒంటరిగా పోటీ చేస్తామంటే అది వేరే విషయం, కానీ, అరాచక పాలనతో రాష్ట్రాన్ని వినాశనం దిశగా పరుగులు తీయిస్తున్న వైసీపీకి మేలు చేసే విధంగా ప్రవర్తించడం, ఏమిటని పార్టీలోనే చర్చ మొదలైంది. జనసేన పార్టీని కూడా దూరం చేసే వ్యూహాన్ని సోము వీర్రాజు అమలు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం బీజేపీ – జనసేన పొత్తులో ఉన్నా కేవలం సోము వీర్రాజు వ్యవహారశైలి వల్లనే ఆ రెండు పార్టీలు కలసి పని చేయలేకపోతున్నాయన్న అభిప్రాయం వినిపిస్తోంది. 

సోము వీర్రాజు అనుసరిస్తున్న వైసీపీ అనుకూల ధోరణిని, పార్టీలోని మెజారిటీ వర్గం వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే సోము వీర్రాజును అధ్యక్ష పదవి నుంచి తప్పించాలనే డిమాండ్ రోజు రోజుకు బలం పుంజుకుంటోంది. అలాగే, ఆయన తీరు మార్చుకోవాలని  బీజేపీలోని ఓ వర్గం కోరుతోంది, కాదంటే, పార్టీకి గుడ్ బై చెప్పేందుకు కూడా సిద్డంవుతున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే అసలే అంతంత మాత్రంగా ఉన్న కమల దళం, ఎన్నికలకు ముందే వాడి పోవడం ఖామని అంటున్నారు.

By
en-us Political News

  
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.