పేలని జ'గన్' హస్తిన పయనమెందుకు?
Publish Date:Apr 5, 2022
Advertisement
ఏపీ సీఎం జగన్ సడెన్‌గా ఢిల్లీ వెళ్తున్నారు. ప్రధాని మోదీని కలుస్తున్నారు. కుదిరితే కేంద్రహోంమంత్రి అమిత్‌షాతోనూ భేటీ కానున్నారు. పోలవరం, ఏపీకి నిధులు తదితర అంశాలపై చర్చిస్తారని అంటున్నారు. ఎప్పటిలానే స్పెషల్ స్టేటస్ అంశం ఈసారి కూడా ఎజెండాలో లేదని తెలుస్తోంది. ఇక, జగన్‌రెడ్డి ఢిల్లీ పర్యటనపై టీడీపీ విమర్శలు గుప్పిస్తోంది. పేలని జ'గన్' హస్తిన పయనమెందుకు? అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విటర్‌లో ప్రశ్నించారు. సీఎం జగన్ హస్తిన టూర్ ఇందుకోసమే అంటూ లోకేశ్ నాలుగు సెటైర్లు సంధించారు. ఏ1) బాబాయ్ హత్యలో దొరికిన అవినాష్ రెడ్డిని తప్పించేందుకు. ఏ2) తాను కొట్టేస్తే కాగ్ పట్టేసిన రూ.48 వేల కోట్ల వ్యవహారాన్ని కామప్ చేయాలని. ఏ3) తన పై సీబీఐ, ఈడీ కేసుల దర్యాప్తు ఆపేయాలని. ఏ4) లక్షల కోట్ల ఆస్తిలో చెల్లికి చిల్లి గవ్వ కూడా దక్కకుండా మహిళలకు ఆస్తి హక్కు రద్దు చేయాలని. ఈ నాలుగింటి కోసమే జగన్‌రెడ్డి ఢిల్లీ వెళ్లి మోదీని, అమిత్‌షాను కలవబోతున్నారంటూ లోకేశ్ ట్విటర్‌లో గ్రాఫిక్ కంటెంట్‌తో పోస్ట్ చేయడం ఆసక్తికరంగా మారింది.
http://www.teluguone.com/news/content/lokesh-tweet-on-cm-jagan-delhi-tour-39-133923.html





