స్పీడ్ న్యూస్ 3

Publish Date:Jul 19, 2023

Advertisement

41.  జగన్ సర్కారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తోందని బీజేపీ ఏపీ చీఫ్ పురందేశ్వరి మండిపడ్డారు.  బుధవారం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆమె  మద్యం అమ్మకాలపై భవిష్యత్తులో వచ్చే ఆదాయం తాకట్టు పెట్టి  రూ.8 వేల కోట్లకు పైగా   అప్పు చేసిందన్నారు. 

........................................................................................................................................................

42.  వరంగల్ జిల్లాలో భారీ వర్షం కారణంగా రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు క్యాంపు కార్యాలయంలో భారీ వృక్షం నేలకూలింది.  ఈ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.  

............................................................................................................................................

43. గత రెండు రోజుల నుంచి కురుస్తున్న వానలకు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం స్వల్పంగా పెరుగుతుంది. ఈరోజు ఉదయం 9 గంటల సమయంకి భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 25.8 అడుగులకు చేరుకుంది. ఇది మరింతగా పెరిగే అవకాశం ఉంది.  

.............................................................................................................................................

44. ఎల్‌ సాల్వడార్‌లో భారీ భూకంపం వచ్చింది. ప దీని తీవ్రత రికార్ట్ స్కేల్ పై 6.5గా నమోదయ్యింది. వెల్లడించింది. సముద్ర గర్భంలో 70 కిలోమీటర్ల లోతులో ప్రకంపణలు చోటు చేసుకున్నాయి. ఈ భూకంపం కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు.

........................................................................................................................................

 

45.  వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తే రాష్ట్రానికి మళ్లీ చీకటి రోజులు వస్తాయని మంత్రి మల్లారెడ్డి  అన్నారు.  రైతు వేదిక సభలో మాట్లాడిన ఆయన  రేవంత్ రెడ్డిని  రైతు వ్యతిరేగా అభివర్ణించారు.

..................................................................................................................................................

46. ఇంటర్ కాలేజీలలో మౌలిక సదుపాయాల కల్పన కోసం 60 కోట్ల రూపాయలు మంజూరు చేసినా ఇంకా పనులు పూర్తి కాకపోవడంపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటర్ విద్యపై సమీక్ష నిర్వహించిన ఆమె  మౌలిక సదుపాయాల కల్పనకు తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. 

........................................................................................................................................

47.  60 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ ఎప్పుడూ రైతులను పట్టించుకోలేదన్న మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు  ఏడాది మూడు పంటలు కావాలంటే బీఆర్ఎస్ ను గెలిపించాలనీ, మూడు గంటల కరెంట్ కావాలంటే కాంగ్రెస్ కు ఓటేయాలని అన్నారు. 

..................................................................................................................................................

48. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను సీపీఔ నారాయణ రాజకీయ బ్రోకర్ అంటూ విమర్శించారు.  ఎన్డీఏతో పవన్ కలవడం  ప్రజాస్వామ్యానికి, లౌకికవాదానికి ప్రమాదకరమని హెచ్చరించారు.  

...................................................................................................................................................

49.  మంత్రి అంబటి రాంబాబు పోలవరం ప్రాజెక్టును పరిశీలించారు.  డయాఫ్రమ్ వాల్, డ్యామ్ దగ్గర వరదపై సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు నిర్మాణ పనులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా అంబటి మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వం కారణంగానే ప్రాజెక్టు ఆలస్యమౌతోందన్నారు. 

...........................................................................................................................................

50. పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందన్న మంత్రి హరీష్ రావు వెంటనే సమ్మె విరమించి విధుల్లో చేరాల్సిందిగా వారిని కోరారు. వ‌ర్షాలు కురుస్తున్న‌ నేపథ్యంలో సీజనల్ వ్యాధుల  వ్యాప్తి ముప్పు ఉన్నందున సమ్మె విరమించాలని హరీష్ అన్నారు. 

By
en-us Political News

  
హైదరాబాద్‌‌ నగరంలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది.
గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని చారిత్రాత్మక బాపూఘాట్ వద్ద జాతిపిత మహాత్మా గాంధీకి రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నివాళులు అర్పించింది.
కనీస ధర రూ.30కి పెంపునకు సిఫార్సు.!
వెబ్‌సిరీస్‌ ల్లో ఎక్కువగా బ్యాంకులు, బంగారు దుకాణాల్లో దోపిడీలకు సంబంధించిన వీడియోలే చూసేవాడు.. ఆ తర్వాత తనకున్న ఆర్మీ అనుభవాన్ని ఉపయోగించుకోని సికింద్రాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌ను ఎంచుకున్నాడు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) వ్యవహారశైలిని నిరసిస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
హైదరాబాద్ నగరవాసుల ప్రయాణ కష్టాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకుంది.
కొత్త కారు కొనుక్కోవాలని ఎన్నో రోజులుగా కలలు కంటారు.. ఆ కల నెరవేరిన రోజు ఆ ఆనందమే వేరు! ఎంతో ఇష్టపడి కొత్త బీఎండబ్ల్యూ కారు కొనుగోలు చేసిన ఓ వ్యక్తి..
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త వాతావరణం నెలకొంది.
మహారాష్ట్రలోని ప్రఖ్యాత హిందూ హృదయసమ్రాట్ బాలాసాహెబ్ థాకరే మహారాష్ట్ర సమృద్ధి మహామార్గ్‌పై జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది.
దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు బయలుదేరిన ఫ్లైదుబాయ్ విమానంలో భారత సంతతి కెప్టెన్‌‌పై జరిగిన కత్తిదాడి అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది.
మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
జాతిపిత మహాత్మా గాంధీ 157వ జయంతి వేడుకలను దేశవ్యాప్తంగా అత్యంత భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్ విడుదలకు కసరత్తు వేగవంతమైంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.