స్నీడ్ న్యూస్ 2

Publish Date:Jul 27, 2023

Advertisement

కడెం ప్రాజెక్టుకు భారీగా వరద.. తెరుచుకోని నాలుగు గేట్లు

11.నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్ట్ కు భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో జలాశయం పూర్తి స్థాయి  700 అడుగులకు నీటి మట్టం చేరుకుంది.  ప్రాజెక్టుకు మొత్తంగా 18 వరద గేట్లు ఉండగా.. అందులో నాలుగు గేట్లు తెరుచుకోలేదు. దీంతో  14 గేట్ల ద్వారా వాటికి  నీటిని వదులుతున్నారు. వరద ఉధృతి మరింత పెరిగితే ముంపు తప్పదన్న ఆందోళన వ్యక్తమౌతోంది.

...............................................................................................................................................................

శ్రీశైలం ప్రాజెక్టుకు పోెటెత్తుతున్న వరద

12.  విస్తారంగా కురుస్తున్న వర్షాలతో  శ్రీశైలం జలాశయానికి వరద పోటెత్తుతోంది. జూరాల ప్రాజెక్ట్‌ నుంచి 52,856 క్యూసెక్కులు, హంద్రీ నుంచి 117 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ ఉదయానికి  816.20 అడుగులకు చేరుకుంది. 

............................................................................................................................................................

విశాఖలో భారీ వర్షాలు

13. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు విశాఖ నగరం అతలాకుతలమైంది.    మున్సిపల్‌ స్టేడియం, పోర్టుకు వెళ్లే మార్గం జలమయమైంది  ఆ ప్రాంతంలో రోడ్డు పక్కన దుకాణాల్లోకి వర్షపు నీరు చేరింది. సమాన్లు నీటిలో కొట్టుకుపోయాయి. 

...............................................................................................................................................................

సీతారాంపురంలో వరద

14.భద్రాద్రికొత్తగూడెం జిల్లా  సీతారాంపురం పంచాయతీ హార్జా తండా చప్టాపైనుంచి పారుతున్న వరద నీటిలో ఆటో కొట్టుకుపోయింది. ఈ ఆటో నీటి మధ్యలోకి వెళ్లిన తర్వాత సైలెన్సర్ లో కి నీరు పోయి ఆగిపోయింది.  ఆటో డ్రైవర్, అందులో ఉన్న ఇద్దరు ప్రయాణీకులు క్షేమంగా ఒడ్డుకు చేరారు. ఆటో మాత్రం కొట్టుకు పోయింది. 

...................................................................................................................................................

ములుగులో వరదలో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు

15. ములుగు జిల్లాలో ఆర్టీసీ బస్సు వరదలో చిక్కుకుంది. హైదరాబాద్ నుంచి ములుగుకు వెడుతున్న బస్సుఈ ఉదయం ములుగు స‌మీపంలోని గట్టమ్మ జాకారం మధ్యలో భారీ వరద తాకిడికి కొంతదూరం కొట్టుకుపోయి పొలాల మధ్య లో నిలిచిపోయింది. బస్సులో 40 మంది ప్రయాణీకులు ఉన్నారు. అందరూ సురక్షితంగా బయటపడ్డారు.

................................................................................................................................................

ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్ష బీభత్సం

16. బుధవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న  వర్షాలతో ఉమ్మడి వరంగల్ జిల్లా అతలాకుతలమైంది. పరకాల భూపాలపల్లి మధ్యలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అలాగే  హనుమకొండ ఎటురునాగారం ప్రధాని రహదారిపై రాకపెకలు స్తంభించిపోయాయి.

........................................................................................................................................................

భద్రాద్రి కొత్తగూడెంలో భారీ వర్షం

17. గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి.  ఏడూళ్ల బయ్యారం పెద్దవాగు పొంగి పొర్లడంతో  గ్రామంలోకి నీరు చేరింది. వరద నీరు ఊరును ముంచెత్తడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటు భయాందోళనకు గురవుతున్నారు.

.........................................................................................................................................................

రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులు విడుదల కాలేదు

18.కడప-బెంగళూరు కొత్త రైల్వే లైన్ నిర్మాణ పనులు ఆగిపోడానికి రాష్ట్ర ప్రభుత్వం తన వాటా జమ చేయకపోవడమే కారణమని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.  వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి బుధవారం అడిగిన ప్రశ్నకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి  లిఖితపూర్వక సమాధానంలో  రాష్ట్ర ప్రభుత్వం  వాటా సొమ్ము ఇచ్చే వరకు ప్రాజెక్టు పనులు  సాగవని  స్పష్టం చేశారు.

...............................................................................................................................................................

ఏపీలో భారీ వర్షాలు

19. ఏపీలోని ఆరు జిల్లాల్లో ఈ రోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు, పల్నాడు జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందని పేర్కొంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

...........................................................................................................................................

బిగ్ బాస్ కు సెన్సార్

20. బిగ్‌బాస్‌ రియాల్టీ షో   ప్రసారానికి ముందు సెన్సార్‌  చేయకపోతే ఎలాగని ఏపీ హైకోర్టు ప్రశ్నించింది. ప్రశ్నించింది.   బిగ్‌బాస్‌ షో పై తెలుగు యువశక్తి అధ్యక్షుడు, నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి దాఖలు చేసిన రెండుపిల్ లను విచారించిన హైకోర్టు  పూర్తి వివరాలతో కౌంటరు వేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశిస్తూ   విచారణను   వాయిదా వేసింది.

By
en-us Political News

  
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
అయితే ఆయన  తాజాగా   నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు,  వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో  కలకలం రేపింది. 
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
ఒకవైపు ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే, మరోవైపు అదే ఎన్నికల్లో ప్రతిపక్షాలు పాల్గొనడం వల్ల ఆ తప్పులకూ, లోపాలకు చట్టబద్ధత కల్పించినట్లవుతోందన్న ఆయన ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.