‘రాఘవ’ కాదు.. ‘రాక్షస’.. టీఆర్ఎస్ వేటు.. వేట మొదలైందా?

Publish Date:Jan 7, 2022

Advertisement

ఖమ్మం జిల్లాలో ఆయన అధికార పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడుకు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన  నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన రామకృష్ణ కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవడం వెనుక ఆయన కీచక పాత్ర ఉందనే ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఆయనే వనమా రాఘవేందర్రావు. ఆత్మహత్య చేసుకుంటూ నాగ రామకృష్ణ విడుదల చేసిన సెల్ఫీ వీడియోతో రాఘవేందర్రావు వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

వనమా రాఘవేంద్రరావు దౌర్జన్యాలు, కీచక పర్వాలు మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. తాజా సంఘటనలో.. ఆస్తి వివాదం పరిష్కరించాలని రాఘవను నాగ రామకృష్ణ ఆశ్రయించాడు. సమస్య పరిష్కారం కావాలంటే పిల్లలు లేకుండా నీ భార్యను హైదరాబాద్ లోని తన వద్దకు తీసుకు రావాలని రాఘవ చెప్పాడట. మరణ వాంగ్మూల సెల్ఫీ వీడియోలో నాగ రామకృష్ణ ఈ సంగతి పేర్కొనడంతో తీవ్ర సంచలనంగా మారింది. నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య సంఘటనపై రాజకీయ పార్టీలు రంగంలోకి దిగాయి. ఎమ్మెల్యే వనమా ఇంటి వద్ద ధర్నాలు, ఆందోళనలు చేశాయి. దీంతో రాఘవేందర్ రావు ఇంటి నుంచి పరారయ్యాడు. కుటుంబం ఆత్మహత్య సంఘటన రాజకీయరంగు పులుముకోవడంతో హాట్ టాపిక్ గా మారింది.

నిజానికి రాఘవ 1991లోనే అప్పటి స్పాంజ్ ఐరన్, ఇప్పటి ఎన్ఎండీసీ ఫ్యాక్టరీ కార్మిక సంఘం ఎన్నికల సందర్భంగా చర్ల చిట్టయ్యను కిడ్నాప్ చేసి, హతమార్చి గోదావరి నదిలో పడేశాడన్న ఆరోపణలు ఎదుర్కొన్నాడు. అయితే.. ఆ కేసులో రాఘవ నిర్దోషిగా బయటపడ్డాడు. అప్పటి నుంచీ రాఘవ అరాచకాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయిందనే విమర్శలు ఉన్నాయి. 1993లో ఎన్ఎండీసీ సమీపంలో ఒక వ్యక్తికి శిరోముండనం చేయించాడనే ఆరోపణలు కూడా రాఘవ ఎదుర్కొన్నాడు. ఆ సంవత్సరమే ఓ అత్యాచార యత్నం కేసులో కూడా రాఘవ ఇరుక్కోవడం గమనార్హం. అయితే.. ఇలాంటి అరాచకాలను రాఘవ తన తండ్రి రాజకీయ పలుకుబడితో వెలుగులోని రానివ్వకుండా చేశాడని స్థానికులు చెప్పుకుంటారు. ఎవరు, ఎక్కడ రియల్ ఎస్టేట్ వెంచర్ వేసినా రాఘవ కోరిన భూమి ఇచ్చేయాలట. ఎక్కడ అభివృద్ధి పనులు చేసినా తనవారు, ఇతరులు అనే తేడా లేకుండా రాఘవకు ముడుపులు ముట్టజెప్పాల్సిందేనట.

అధికారులు, మహిళా ఉద్యోగుల పట్ల చాలా అసభ్యంగా ప్రవర్తించేవాడనే ఆరోపణలూ రాఘవపై ఉన్నాయని చెప్పుకుంటారు. 25 ఏళ్ల క్రితం పాల్వంచలో ఉద్యోగం చేసిన ఓ పోలీసు భార్యపై రాఘవ అత్యాచారానికి తెగబడితే.. ఆ పోలీసు ఆత్మాభిమానంతో ఆత్మహత్య చేసుకున్నట్లు ఆరోపణలు అప్పట్లో వెల్లువెత్తాయి. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నాడనే ఆరోపణపై రాఘవను 2013లో అప్పటి ఏఎస్పీ భాస్కర్ భూషణ్ అరెస్టు చేసి, పలు కేసులు కూడా నమోదు చేశారు. తండ్రి వనమా 2019లో ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచీ నియోజకవర్గంలో రాఘవే షోడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నాడనే విమర్శలు ఉన్నాయి. ఎమ్మెల్యే పెత్తనం అంతా రాఘవే చేస్తున్నాడంటూ ఆరోపణలు వస్తున్నాయి.

ఇక భూదందాలు, సెటిల్మెంట్లు, ప్రైవేట్ పంచాయితీల విషయంలో రాఘవ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తాడనే ఆరోపణలు ఉన్నాయి. నవభారత్ ప్రాంతంలో సంవత్సరం క్రితం భూ ఆక్రమణ కేసులో ఒక గిరిజన మహిళపై దాడిచేసిన ఘటనలో రాఘవపై కేసు నమోదైంది. జిల్లా మంత్రి ఆ గిరిజన మహిళకు అండగా నిలిచినా.. రాఘవ తన పలుకుబడి ఉపయోగించి కేసును బుట్టదాఖలు చేయించాడంటారు.  ఇక 2021 జూలైలో ఫైనాన్సియర్ వెంకటేశ్వర్లు ఆత్మహత్యకు రాఘవ బెదిరింపులే కారణమనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో రాఘవపై కేసు నమోదైంది. దాంతో పరారైపోయి.. ముందస్తు బెయిల్ తో తిరిగి వచ్చాడు. ఇప్పుడు కూడా నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో రాఘవ ప్రధాన నిందితుడు. ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. కేసీఆర్ ఆదేశాలతో టీఆర్ఎస్ పార్టీ అతనిపై వేటు వేసింది. ఇక వేట మొదలైనట్టేనా?

By
en-us Political News

  
కేవలం తన కోటరీ మాటలు నమ్మి ప్రజా క్షేత్రానికి దూరం కావడం వల్లే ఘోర పరాజయాన్ని చవిచూశారు. అయితే 2024 ఎన్నికలలో విజయం సాధించి అధికారం చేపట్టిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిత్వం ప్రజలకు చేరువగానే ఉంటోంది. ఇక తాజాగా ఈ నెల 9 నుంచి 15 వరకూ ప్రజాబాట కార్యక్రమాలను నిర్వహించనుంది.
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై తన విమర్శల మోతాదు పెంచారు. ఒక భూమి విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పెరు లాగి మీడియా దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నించారు. ఆ క్రమంలో కల్వకుంట్ల కవిత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలకు సంబంధించి అధికార తెలుగుదేశం పార్టీ (టీడీపీ) తమ అభ్యర్థుల ఎంపికను అధికారికంగా పూర్తి చేసింది.
ఈ గ్లోబల్ ఎక్స్‌పోజర్, కమ్యూనికేషన్ స్కిల్స్ నేడు ఆయనను జాతీయ స్థాయి రాజకీయాలకు, ముఖ్యంగా రాజ్యసభ కు సమర్థుడైన అభ్యర్థిగా నిలబెడుతున్నాయి. 2019 ఎన్నికలలో తెలుగుదేశం ఓటమి తరువాత టీడీపీ తీవ్ర సంక్షోభంలో ఉన్న తరుణంలో.. సాంప్రదాయ మీడియా కంటే డిజిటల్ మీడియా ద్వారా అధికార పక్షాన్ని ఎదుర్కోవడం ముఖ్యమని పార్టీ గుర్తించింది
ప్రస్తుత జాతీయ రాజకీయాల పరిస్థితులు, పార్టీ భవిష్యత్ ను పరిగణనలోకి తీసుకుని చింతకాయల విజయ్ రాజ్యసభకు పంపడమే సముచితమని ఆయన నిర్ణయించారు. ప్రస్తుతం కేంద్రంలో తెలుగుదేశం పార్టీ అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తోంది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న తరుణంలో పార్లమెంట్‌లో పార్టీ గళాన్ని బలంగా వినిపించగల యువ, విద్యావంతులైన నాయకత్వం అవసరమని చంద్రబాబు భావించినట్లు కనిపిస్తోంది.
అన్నామలై ఇప్పుడు నేరుగా సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో చేతులు కలపబోతున్నారనే వార్త దావానలంలా వ్యాపిస్తోంది. వీరిద్దరూ కలిసి తమిళనాడులో ఒక సరికొత్త ప్రాంతీయ పార్టీని స్థాపించేందుకు సన్నాహాలు చేస్తున్నారనే వదంతులు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
అలాగే అంతర్జాతీయ వాణిజ్యాన్ని ఊహించని రేంజ్‌లో పెంచడానికి ఈ ప్రాజెక్ట్ దేశానికి ఎంతో రక్షణ, ఆర్థిక ప్రయోజనకరమని కేంద్ర ప్రభుత్వం బలంగా చెప్తోంది. అయితే ఈ మెగా ప్రాజెక్టుపై లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ, ఇది దేశ చరిత్రలోనే అతి పెద్ద స్కామ్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు.
తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందన్న పవన్ కల్యాణ్ ప్రకటనపై స్పందించిన ప్రకాశ్ రాజ్ సింగిల్ గానా, పొత్తుతోనా అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు.
గతంలో ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ నుండి గానీ, అంతకుముందు రెండుసార్లు గెలిచిన జార్ఖండ్ నుండి గానీ, లేదా ఆయన సొంత రాష్ట్రమైన గుజరాత్ నుండి గానీ ఈసారి అభ్యర్థిత్వం లభించలేదు. దేశంలోనే అత్యంత శక్తిమంతమైన రిలయన్స్ కార్పొరేట్ లాబీయింగ్ పప్పులు మారిన రాజకీయ సమీకరణాల ముందు ఉడకలేదు.
పవన్ రాజకీయ అవగాహనారాహిత్యానికి ఆయన వ్యాఖ్యలే తార్కానమన్నారు. ప్రపంచ పరిణామాలు ఏదిశగా నడుస్తున్నాయో కూడా ఆయనకు అర్థం కావడం లేదన్న వీ శ్రీనివాసరావు. . తమిళనాడులో సినీ నటుడు విజయ్ గెలుపు తర్వాత పవన్ కల్యాణ్‌పై ఒత్తిడి తీవ్రంగా ఉండడంతో ఆయన నిస్పృహనకు లోనవుతూ.. దీనివల్ల ఆయన ఏదేదో మాట్లాడుతున్నారన్నారు.
తమిళనాట విజయ్ సునామీ ప్రకంపనలు సద్దుమణగక ముందే, తమిళనాట మరో సీనియర్ సూపర్ స్టార్ రజినీకాంత్ పేరు పొలిటికల్ స్క్రీన్ పైకి రావడం పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది.
ఈ వివాదం కాస్తా ముదరడంతో తెలంగాణ రాజకీయాలపై పవన్ కళ్యాణ్ అత్యంత కీలకమైన ప్రకటన చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో జనసేన పార్టీ ఒంటరిగానైనా బరిలోకి దిగుతుందని, అవసరమైతే ఏ పోరాటానికైనా తాను వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ప్రకటించారు. తెలంగాణ సెంటిమెంట్‌ను టచ్ చేస్తూ కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్న తరుణంలో.. పవన్ కళ్యాణ్ ఈ సవాల్‌ను స్వీకరించడం సంచలనం సృష్టించింది.
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలై కేవలం 80 స్థానాలకే పరిమితమైన టీఎంసీలో అసంతృప్తి జ్వాలలు భగ్గుమన్నాయి. అసమ్మతి గళాలు రోడ్డెక్కాయి. పార్టీ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై మెజారిటీ టీఎంసీ నేతలు తిరుగుబావుటా ఎగురవేశారు. గడిచిన 15 ఏళ్లుగా బెంగాల్‌ను ఏకఛత్రాధిపత్యంగా పాలించిన దీదీ, ఇప్పుడు సొంత పార్టీపై పట్టు కోల్పోయే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.