Publish Date:Apr 26, 2025
ఏపీ లిక్కర్ స్కాంపై ఏపీ ప్రభుత్వం సీరియస్‌గా విచారణ చేపట్టింది. ఈ కేసు విషయంలో సిట్ అధికారులు వేగంగా దర్యాప్తు జరుపుతున్నారు. ఈ స్కాంలో ఎవరున్నా విడిచి పెట్టవద్దని ఏపీ ప్రభుత్వం పోలీసులను ఆదేశించింది. దీంతో సిట్ అధికారులు ఈ కేసు విషయంలో దూకుడు పెంచారు. ఆ క్రమంలో ఇప్పటికే ఇదే కేసులో రాజ్ కసిరెడ్డిని అదుపులోకి తీసుకున్న సెట్ అధికారులు తాజాగా మరో కీలక వ్యక్తి సజ్జల శ్రీధర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపధ్యంలో మాజీమంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Publish Date:Apr 26, 2025
తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా 2001 ఏప్రిల్ 27న ఏర్పడింది. అయితే.. బీఆర్ఎస్ ఆవిర్భవించి 25 ఏండ్లు పూర్తి కావడంతో వరంగల్‌లో భారీ సభ నిర్వహిస్తున్నారు. వేలాదిగా జనం వస్తారని అంచనా వేశారు. అందుకు తగ్గట్టుగానే తాత్కాలిక వసతి సౌకర్యాలు ఏర్పాటు చేశారు. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో 1,213 ఎకరాల్లో రజతోత్సవ సభ నిర్వహిస్తున్నారు. 500 మంది కూర్చునేలా గులాబీ రంగులతో వేదికను తీర్చిదిద్దారు. వేదిక పక్కనే కళాకారుల ఆట-పాట కోసం ప్రత్యేకంగా మరో స్టేజ్‌ను ఏర్పాటుచేశారు. సభకోసం రాష్ట్రంలోని నలుమూలల నుంచి దాదాపు 50 వేల వాహనాల వస్తాయని అంచనా వేస్తున్నారు. పార్కింగ్ కోసం 1,059 ఎకరాలను కేటాయించారు. సభకు వచ్చే ప్రజల కోసం లక్షకు పైగా కుర్చీలను ఏర్పాటు వేశారు
Publish Date:Apr 26, 2025
దేశంలో ప్రస్తుతం ప్రతిపక్షాలన్ని మాట్లాడనివ్వకుండా గొంతునొక్కేవిధంగా ఎన్డీయే ప్రభుత్వం ప్రయత్నిస్తుందని లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో కొనసాగుతున్న భారత్ సమ్మిట్‌లో ఆయన మాట్లాడారు. గత పదేళ్లలో ప్రపంచ రాజకీయాలు మారిపోయాయని రాహుల్ అన్నారు. ఆధునిక సామాజిక మాధ్యమాలతో అంతా మారిపోయిందన్నారు. తాను నిన్ననే రావాల్సి ఉన్నా, కశ్మీర్‌కు వెళ్లడం వల్ల రాలేకపోయానని, అందుకు క్షమించాలని కోరారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర (భారత్ జోడో యాత్ర) చేయాలని నిర్ణయించుకున్నట్లు రాహుల్ గాంధీ వివరించారు. తాను కశ్మీర్‌లో యాత్రను ముగించినట్లు గుర్తుచేశారు
Publish Date:Apr 26, 2025
మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలో మత్స్యకారుల సేవ పథకాన్ని ప్రారంభించారు. బుడగట్లపాలెం సముద్రతీరంలో మత్య్సకారుల వద్దకు వెల్లి వారి జీవన విధానాన్ని పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. మత్స్య కారులను ఆదుకుంటామన్నారు. బడుగు, బలహీన వర్గాలకు అండగా ఉంటామని.. ఎన్ని కష్టాలున్నా మీ పరిస్థితి మారుస్తామని తెలిపారు. ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు వేట విరామ సమయానికి సంబంధించి భృతి కింద ఒక్కో కుటుంబానికి ఇచ్చే మొత్తాన్ని రూ.10 వేల నుంచి రూ.20 వేలకు పెంచిన సంగతి తెలిసిందే. మొత్తం రూ.259 కోట్ల మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు.
Publish Date:Apr 26, 2025
గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్టయిన కన్నడ నటి రన్యారావుకు కర్ణాటక హైకోర్టులో చుక్కెదురైంది. ఆమెతో పాటు మరో నిందితుడు తరుణ్ కొండూరు రాజు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్లను ఉన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్ ఎస్. విశ్వనాథ్ శెట్టి ఈ మేరకు తీర్పు వెలువరించారు. డీఆర్ఐ అధికారుల వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి, నిందితుల అభ్యర్థనలను తోసిపుచ్చారు. గత నెలలో దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం తరలిస్తూ రన్యారావు బెంగళూరు విమానాశ్రయంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులకు పట్టుబడిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆమె వద్ద నుంచి సుమారు 14.7 కిలోల గోల్డ్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో రన్యాతో పాటు ఇప్పటివరకు ముగ్గురిని అరెస్టు చేశారు
Publish Date:Apr 26, 2025
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక సాక్షిగా ఉండి ఇటీవల మరణించిన రంగన్న భార్య సుశీలమ్మకు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరు కావాలని ఆమెను ఆదేశించినట్లు సమాచారం. వివేకా మర్డర్ కేసులో ఫస్ట్ నుంచి సాక్షులుగా ఉన్న వ్యక్తులు ఒకరి తర్వాత ఒకరు అనుమానాస్పద రీతిలో మృతి చెందడం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. దాదాపు ఆరుగురు సాక్షులు ఇలా మరణించడంతో, ముఖ్యంగా కీలక సాక్షి రంగన్న మృతి తర్వాత, ప్రభుత్వం ఈ వరుస మరణాలపై దృష్టి సారించి సిట్ ను ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి సిట్ అధికారులు పులివెందులలో ఉంటూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Publish Date:Apr 26, 2025
కాశ్మీర్ పహల్గామ్ ఘటన నేపథ్యంలో హైదరాబాద్‌లో ఉంటున్న నలుగురు పాక్ పౌరులకు తెలంగాణ పోలీసులు నోటీసులు ఇచ్చారు. వీరు షార్ట్ వీసాలతో ఉంటున్నట్లు గుర్తించారు. రేపటిలోగా నగరం విడిచి వెళ్లిపోవాలంటూ ఆదేశించారు. కాగా, భాగ్యనగరంలో మొత్తం 213 మంది పాకిస్థానీయులు ఉన్నట్లు పోలీసుల తనిఖీల్లో తేలింది. ఉగ్రదాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం పాకిస్థానీలను దేశం నుంచి వెళ్లగొడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు
Publish Date:Apr 26, 2025
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్ర అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీలకు నోటీసులు ఇవ్వాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీ హైకోర్టును కోరింది. అందుకు కోర్టు నిరాకరించింది. నూతన న్యాయ చట్ట నిబంధనల ప్రకారం నిందితులను విచారించకుండా ఛార్జిషీట్ తీసుకోలేమని పేర్కొంది. కాగా, మనీలాండరింగ్ కేసు ఛార్జిషీట్లో కాంగ్రెస్ అగ్రనేతలు శామ్ పిట్రోడా, సుమన్ దూబేలను కూడా ఈడీ నిందితులుగా చేర్చిన విషయం తెలిసిందే.సుమారు రూ. 5,000 కోట్ల మేర మనీలాండరింగ్ జరిగినట్లు ఈడీ ఈ చార్జిషీట్‌లో ఆరోపించింది
Publish Date:Apr 26, 2025
అనుచిత వ్యాఖ్యలు, అడ్డగోలు దౌర్జన్యాలు, కిడ్నాప్ లు, బెదరింపులకు పాల్పడిన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నదంట. ఆయన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి, అలాగే నారాలోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు ేసినప్పుడూ, గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడికి ఉసికొల్పిన సమయంలోనూ.. అదే కేసులో ఫిర్యాదు దారుడిని కిడ్నాప్ చేసి బెదరించినప్పుడూ నోరెత్తిని ఆ గొంతు ఇప్పుడు లేస్తోంది.
Publish Date:Apr 26, 2025
తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగ్గుమంటున్నాడు. ముఖ్యంగా తెలంగాణ లోని పలు జిల్లాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి. దీంతో వేడికి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అయితే నిన్న సాయంత్రం పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసినప్పటికీ.. తీవ్ర ఉక్కపొతతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. గత రెండు వారాలుగా ఎండ తీవ్రతలు అధికంగా ఉండటంతో 30 మంది వరకు వడదెబ్బ కారణంగా మరణించారు. అలాగే మరో మూడు రోజుల పాటు రాష్ట్రంలో ఎండల తీవ్ర అధికంగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు
Publish Date:Apr 26, 2025
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రభుత్వ వ్యతిరేక స్వరం వినిపిస్తూనే ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఆయన ఆశించిన మంత్రి పదవి దక్కలేదనో? ఏమో? ఎప్పటికప్పుడు వివాదాల్లో నిలుస్తూనే ఉన్నారు. సర్కారుని ఇరుకున పెట్టేలా తాజాగా బీఆర్ఎస్ ఎల్కతుర్తి సభ విజయవంతం అవుతుందంటూ దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Publish Date:Apr 26, 2025
ఏపీలోని కూటమి ప్రభుత్వానికి కేంద్రం శుభవార్త చెప్పింది. 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేసింది. ఈ మేరకు 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో రూ. 1121.20 కోట్ల నిధులు జమయ్యాయి. ఇందులో 70 శాతం గ్రామ పంచాయతీలకు, మండల పరిషత్‌లకు 20 శాతం, జిల్లా పరిషత్‌లకు 10 శాతం చొప్పున నిధులను కేటాయించనున్నారు.
Publish Date:Apr 26, 2025
తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల రద్దీ సాధారణం ఉంది. టోకెన్లు లేని భక్తులకు సుమారు 12 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతానికి 26 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండి ఉంది. శుక్రవారం 64వేల 536 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 30వేల 612మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా భక్తులు 3 కోట్ల 36 లక్షల ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు