Publish Date:Mar 10, 2025
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీకి అవకాశం లభిస్తుందని భావించిన ఇద్దరు తెలుగుదేశం నేతలకు తీవ్ర నిరాశ మిగిలింది. వారిలో ఒకరు పిఠాపురం వర్మ కాగా మరొకరు పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ. వీరిరువురూ కూడా ఎమ్మెల్సీ స్థానాన్ని ఆశించారు. ఆశించారనడం కంటే పార్టీ అధిష్ఠానమే వారికి ఎమ్మెల్సీ హామీ ఇచ్చింది. అయితే కారణాలేమైనా తెలుగుదేశం అధిష్ఠానం వీరిద్దరినీ పక్కన పెట్టింది. ఐదు స్థానాలకు ఎన్నికలు జరగనుండగా, వాటిలో ఒక స్థానాన్ని జనసేనకు కేటాయించడం పట్ల తెలుగుదేశంలో ఎవరి నుంచీ ఎటువంటి అభ్యంతరం వ్యక్తం కాలేదు. కానీ బీజేపీకి ఒక స్థానం కేటాయించడం పట్ల క్యాడర్ లోనే కాకుండా.. పార్టీ నేతలలో కూడా అభ్యంతరం, అసహనం వ్యక్తం చేస్తున్నది.
బీజేపీ కోసం ప్రతి సారీ తెలుగుదేశం పార్టీయే ఎందుకు త్యాగాలు చేయాలన్న ప్రశ్న కూడా గట్టిగా వినవస్తున్నది. గతంలో ఆర్ కృష్ణయ్య విషయంలోనూ ఇదే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఎమ్మెల్సీ విషయంలోనూ బీజేపీ పట్టుబట్టి ఒక స్థానాన్ని తెలుగుదేశం నుంచి లాగేసుకుందన్న అభిప్రాయం తెలుగుదేశం శ్రేణుల్లో వ్యక్తం అవుతోంది. అదే విధంగా ఇటీవల విజయసాయిరెడ్డి తన రాజ్యసభ స్థానానికి రాజీనామా చేయడంతో ఏర్పడిన ఖాళీని కూడా బీజేపీ అభ్యర్థితోనే భర్తీ చేయాలని ఆ పార్టీ పట్టుబడుతున్నట్లుగా తెలుగుదేశం వర్గాలలో వినిపిస్తోంది. అది పక్కన పెడితే..
ప్రస్తుతం ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని తెలుగుదేశం బీజేపీ కోసం త్యాగం చేయడం వల్ల పార్టీ ప్రతిపక్షంలో ఉండగా త్యాగాలు చేసి, పోరాటాలు చేసిన నేతలకు అవకాశం దక్కకుండా పోతున్నది. వారిలో ప్రధానంగా పిఠాపురం వర్మ, దేవినేని ఉమ ఉన్నారు. గత ఎన్నికలలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోసం తన సీటును త్యాగం చేసిన పిఠాపురం వర్మకు పార్టీ అధినేత ఎమ్మెల్సీ టికెట్ హామీ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అదే విధంగా పోత్తు ధర్మంతో సీటు త్యాగం చేసిన దేవినేని ఉమకూ దాదాపు ఇలాంటి హామీయే దక్కింది. అయితే ఇప్పుడు ఆ ఇద్దరికీ కూడా తెలుగుదేశం ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీకి అవకాశం ఇవ్వలేదు. దీంతో పిఠాపురం వర్మ ఓపెన్ అయిపోయారంటున్నారు. తన సన్నిహితుల వద్ద పార్టీ కోసం త్యాగాలు చేసి తప్పు చేశానని, త్యాగం చేసిన తనకు తగిన శాస్తే జరిగిందనీ వ్యాఖ్యానించినట్లు చెబుతున్నారు. అయితే తరువాత మీడియా సమావేశంలో పార్టీ నిర్ణయమే శిరోధ్యర్యం అని ప్రకటించారనుకోండి అది వేరే సంగతి. ఇక దేవినేని ఉమ బహిరంగంగా తన అసంతృప్తిని వ్యక్తం చేయనప్పటికీ, తనకు ఎమ్మెల్సీ అవకాశం దక్కకపోవడం పట్ల ఆయన నిరాశకు గురైనట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
వాస్తవానికి బీజేపీలో ఎమ్మెల్సీ స్థానానికి తగిన నేత లేరనే చెప్పాలి. జగన్ అధికారంలో ఉన్నన్నాళ్లూ ఆ పార్టీతో అంటకాగిన సోము వీర్రాజుకు ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడం తెలుగుదేశం శ్రేణులలో అసంతృప్తినీ, ఆగ్రహాన్నీ కలిగిస్తున్నది. నిజానికి బీజేపీ తెలుగుదేశం, జనసేన పార్టీలతో పొత్తు కారణంగా ఇప్పటికే తనకు ఉన్న స్టేక్ కంటే ఎక్కువ లాభం పొందింది. ఇదే పరిస్థితి ముందుముందు కూడా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. వచ్చే ఐదేళ్ల కాలంలో ఖాళీ అయ్యే ప్రతి పదవీ తెలుదగుదేశం కూటమికే దక్కుతుంది. అలాగే తెలుగుదేశం పార్టీపై ఒత్తిడి పెంచి బీజేపీ కూడా తగుదునమ్మా అంటూ పదవుల కోసం పోటీ పడుతుందని అంటున్నారు. మొత్తం మీద కష్టమూ తెలుగుదేశందే, త్యాగాలూ ఆ పార్టీవే అన్నట్లుగా పరిస్థితి తయారైందన్న ఆవేదన పార్టీ శ్రేణులలో వ్యక్తమౌతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/somu-veerraju-gets-mlc-tocket-in-kutami-quota-39-194160.html
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.