సోషల్ మీడియాలో బాలల లైంగిక దోపిడీకి పాల్పడిన...యూట్యూబర్ అరెస్టు
Publish Date:Jan 7, 2026
Advertisement
సోషల్ మీడియాను వేదికగా చేసుకుని మైనర్ పిల్లలను లైంగికంగా దోపిడీ చేస్తూ, అసభ్యకరమైన కంటెంట్‌ను సృష్టించి ప్రచారం చేస్తున్న యూట్యూబర్‌ను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. పిల్లల లైంగిక వేధింపులకు సంబంధించిన కంటెంట్‌ను యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో అప్‌లోడ్ చేసిన కేసులో క్రైమ్ నెం.1885/2025గా నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఏపీకి చెందిన కంబెటి సత్యమూర్తి (39)* “వైరల్ హబ్” (@ViralHub007) పేరుతో యూట్యూబ్ ఛానెల్ నిర్వహిస్తూ, వీక్షణలు మరియు ఆదాయం పెంచుకోవాలనే ఉద్దేశంతో మైనర్లను లక్ష్యంగా చేసుకుని అభ్యంతరకరమైన వీడియో లను రూపొందించాడు. నిందితుడు 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న బాలబాలికలతో ఇంటర్వ్యూలు నిర్వహిం చాడు. ఉద్దేశపూర్వకంగా అసభ్యకరమైన, లైంగికంగా స్పష్టమైన ప్రశ్నలు అడిగేవాడు. కొన్ని వీడియోల్లో మైనర్ పిల్లలను ఒకరినొకరు ముద్దు పెట్టుకోవాలని ప్రేరేపించాడు. ఇది బాలల లైంగిక దోపిడీకి సమానమని అధికారులు స్పష్టం చేశారు. ఈ వీడియోల్లో ఉపయో గించిన భాష, ప్రవర్తన పూర్తిగా నీచమైనదిగా, చట్టవిరుద్ధమైనదిగా ఉండటంతో పాటు, పోక్సో చట్టం, ఐటీ చట్టం మరియు ఇతర క్రిమినల్ చట్టాల నిబంధనలను తీవ్రంగా ఉల్లంఘించినట్లు తేలింది. వీడియోల్లో కనిపించిన మైనర్ల వయస్సు సుమారు 15 నుంచి 17 సంవత్సరాలు గా పోలీసులు అంచనా వేశారు. 2025 అక్టోబర్ 16న ‘వైరల్ హబ్’ యూట్యూబ్ ఛానెల్‌లో బాలల దుర్విని యోగానికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నట్టుగా గుర్తించిన సైబర్ క్రైమ్ పోలీసులు, సుమోటోగా కేసు నమోదు చేశారు. సాంకేతిక విశ్లేషణ, డిజిటల్ ఆధారాల సేకరణ అనంతరం నిందితుడి పాత్రను నిర్ధారించి అరెస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం కి చెందిన కంబెటి సత్యమూర్తి(39) 2018 నుంచి యూట్యూబర్ గా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. మొదట సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయె న్సర్‌లతో అసభ్య భాషతో ఇంటర్వ్యూలు నిర్వహించి వ్యూస్ సంపాదించాడు. ఆ తరువాత మరింత ఆదాయం, ప్రచారం కోసం మైనర్లను లక్ష్యంగా చేసుకుని అత్యంత అసభ్యకరమైన ప్రశ్నలు అడగడం, లైంగిక సూచనలతో కూడిన కంటెంట్‌ను అప్‌లోడ్ చేయడం ప్రారంభించాడు. ఈ విధంగా తీవ్రమైన క్రిమినల్ నేరాలకు పాల్ప డ్డట్లుగా పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఈ సందర్భంగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కఠిన హెచ్చరిక జారీ చేశారు. ఆన్‌లైన్ కంటెంట్ కోసం మైనర్లను దోపిడీ చేయడం తీవ్రమైన నేరమని తెలిపారు. మైనర్లతో అసభ్య భాషలో ఇంటర్వ్యూలు చేయడం, అనుచిత చర్యలకు ప్రేరేపించడం, అటువంటి కంటెంట్‌ను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడం శిక్షార్హమని స్పష్టం చేశారు.బాలలపై లైంగిక దుర్వినియోగ కంటెంట్‌ను సృష్టించినా, పంచుకున్నా, ఫార్వార్డ్ చేసినా కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. పిల్లలపై వేధింపుల కంటెంట్ లేదా ఏదైనా సైబర్ నేరానికి సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే సమీప పోలీస్ స్టేషన్ లేదా సైబర్ క్రైమ్ విభాగానికి తెలియజే యాలని సూచించారు. సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930 లేదా www.cybercrime.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చని తెలిపారు.
http://www.teluguone.com/news/content/social-media-36-212166.html





