ఈ యాక్టివిస్టులున్నారే! తన మన బేధాలు పాటించడం వీరికి పెన్నుతో పెట్టిన విద్య. వివక్ష చూపడం అన్నది వీరికి మైకుతో వచ్చిన ఆర్టు. ఇటీవల తమిళనాడు కేంద్రంగా రెండు ప్రధాన దుర్ఘటనలు జరిగాయి. వాటిలో మొదటిది.. కరూర్ లో జరిగిన తొక్కిసలాట కాగా.. మరొకటి తమిళనాడులో తయారు చేసిన దగ్గుమందు కారణంగా మధ్య ప్రదేశ్, రాజస్థాన్ లో కొందరు పిల్లలు చనిపోవడం. వీటిపై మన దగ్గరున్న యాక్టివిస్ట్ బ్యాచ్ కనీపం స్పందించలేదు. అదే బీజేపీ కూటమి పార్టీ నేతలు చేసే తప్పొప్పుల మీద వీళ్ల బాదుడు.. ఒక రేంజ్ లో ఉంటుందంటే అతిశయోక్తి కాదు.. పవన్ కళ్యాణ్ వైరల్ జ్వరాన్ని కూడా వదలకుండా వాయించేస్తారు. అదే విజయ్ కరూర్ రోడ్ షో కారణంగా 41 మంది చనిపోయారు. అయితే ఈ సంఘటనపై సోకాల్డ్ యాక్టివిస్టులు కనీసం స్పందించను కూడా స్పందించలేదు.
అదే బీజేపీ కేంద్రంగా ఏదైనా చీమ చిటుక్కుమన్నా, పవన్ కళ్యాణ్ తుమ్మినా దగ్గినా కూడా వీరి యాంటీ ర్యాగింగ్ క్యాంపెయినింగ్ ఒక రేంజ్ లో ఉంటుంది. ఆ మాటకొస్తే మొన్న మోడీ మణిపూర్ కి వెళ్లినపుడు కూడా ఘటన జరిగిన ఇన్ని రోజులకు, ఇన్ని గంటలకు, ఇన్ని గడియలకు ఆయనక్కడకు వెళ్లడమా అంటూ సెకన్లతో సహా లెక్కలన్నీ బయటకు తీసి మరీ పోస్టులు పెట్టారీ పెద్ద మనుషులు. అలాంటిది విజయ్ కార్యక్రమం సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో పలువురు మరణించడంపై ఎందుకు స్పందించడంలేదు? అంటే ఇక్కడే ఉంది అసలు లాజిక్కు.. ఇక్కడ విజయ్ కూడా సేమ్ టూ సేమ్ వీరిలాగానే బీజేపీని వ్యతిరేకిస్తారు కాబట్టి. తన సినిమాలో సీన్లు పెట్టిమరీ ఆయన యాంటీ బీజేపీ వాయిస్ వినిపిస్తారు కనుక.
తాజాగా తమిళనాడు కు చెందిన ఒక కంపెనీ తయారు చేసిన విషపూరిత దగ్గుమందు ద్వారా పిల్లలు చనిపోతే.. అదేంటో తెలీదు జస్ట్ ఆస్కింగ్ ప్రకాష్ రాజ్ పత్తా లేరు. ఇక డీఎంకే ద్వారా ఎంపీ అయిన కమల్ హాసన్ కనిపించరు. ఇక సనాతన ధర్మం అంటే విరుచుకుపడే సత్యరాజ్ మాట పెగలదు. అంటే ఇక్కడ వివక్షపై పోరాటం చేసే ఈ యోధాను యోధుల గళం, కలం కొన్నిసార్లంతే అదేంటో తెలీదు.. ఆటోమేటిగ్గా మూగపోతాయి. వీరి దృష్టిలో కరూర్ తొక్కిసలాట అయినా, దగ్గుమందు వల్ల పిల్లలు ప్రాణాలు కోల్పోయిన ఘటన అయినా యధాలాపంగా జరిగినవే. గట్టిగా నిలదీస్తే.. వీటి వెనుక కూడా బీజేపీ కుట్ర అంటూ బుకాయించినా ఆశ్చర్యం లేదు. ఇదే ప్రకాష్ రాజ్ అయోధ్యలో బాబ్రీ మసీదు కూలదోసి మరీ అక్కడ రామ మందిరం నిర్మించారని తీవ్రఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తారుగానీ.. ఇప్పటి వరకూ కూలిన దేవాలయాల సంఖ్య అస్సలు పరిగణలోకి తీస్కోరు.
ఇక దేవుడు లేనే లేడనే కమల్ హాసన్ కి విజయ్ పార్టీ రోడ్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట కారణంగా పోయిన ప్రాణాలకు విలువ లేనట్టే బిహేవ్ చేస్తారు. ఆపై తమ రాష్ట్రంలో తయారైన దగ్గు మందు కారణంగా చనిపోయిన పిల్లల విషయంలో అసలు అలాంటి సంఘటనే జరగలేదన్నట్లుగా సత్యరాజ్ సైలెంటైపోతారు. ఇక్కడ కూడా అంతే తెలుగులో కొందరు యాక్టివిస్టులుంటారు. వీరు కూడా కేవలం హిందుత్వ, ఎన్డీయే, కూటమి ద్వారా జరిగే తప్పొప్పుల మీద మాత్రమే దృష్టి సారిస్తారు. మిగిలింది ఏమైనా కానీ పిన్ డ్రాప్ సైలెన్స్ మెయిన్ టైన్ చేస్తారు. ఇదెక్కడి విడ్డూరమో అర్ధం కాదంటారు కొందరు సామాజికవేత్తలు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/so-called-activists-hypocracy-39-207592.html
ఈ ఎన్నికలకు సంబంధించి దాఖలైన నాలుగు నామినేషన్ పత్రాలు పూర్తిగా సక్రమంగా ఉన్నాయని రిటర్నింగ్ అధికారి, అసెంబ్లీ సంయుక్త కార్యదర్శి ఆర్. వణితా రాణి ప్రకటించారు. శాసనసభ భవనంలోని తన చాంబర్‌లో అభ్యర్థుల సమక్షంలో జరిగిన ఈ స్కృటినీ ప్రక్రియలో ఎలాంటి సాంకేతిక లోపాలు లేవని తేలడంతో కూటమి శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో 2027 సంవత్సరం ఒక సరికొత్త సంచలనానికి వేదిక కాబోతోందా? అంటే రాజకీయ పరిశీలకులు ఔననే ఉంటున్నారు. 2024లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న జగన్, అలాగే 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పరాజయాన్ని చవిచూసిన కేసీఆర్ ఇద్దరూ 2027 సంవత్సరంలో మళ్లీ ప్రజలతో మమేకమై పూర్వ వైభవాన్ని అందిపుచ్చుకోవాలన్నవ్యూహరచనలో ఉన్నారు.
సాక్షాత్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగి ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. క్షేత్రస్థాయిలో అధికారులు ఆ ఫైళ్లను పక్కన పెట్టేయడం రాజకీయ, అధికార వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
మహారాష్ట్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన 20 అడుగుల ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ వేడుకలో వివాదం తలెత్తింది. ఈ భారీ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అయిన ఏక్‌నాథ్ షిండేకు కనీసం ఆహ్వానంఅందలేదు.
దేశరాజకీయాల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి అత్యంత కీలకమైన అడుగులు వేస్తోంది.
రాజ్యసభ ఎంపీ అభ్యర్థులుగా తెలుగు దేశం పార్టీ తరుపున సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ లు నామినేషన్ లు దాఖలు చేశారు.
కేవలం తన కోటరీ మాటలు నమ్మి ప్రజా క్షేత్రానికి దూరం కావడం వల్లే ఘోర పరాజయాన్ని చవిచూశారు. అయితే 2024 ఎన్నికలలో విజయం సాధించి అధికారం చేపట్టిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిత్వం ప్రజలకు చేరువగానే ఉంటోంది. ఇక తాజాగా ఈ నెల 9 నుంచి 15 వరకూ ప్రజాబాట కార్యక్రమాలను నిర్వహించనుంది.
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై తన విమర్శల మోతాదు పెంచారు. ఒక భూమి విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పెరు లాగి మీడియా దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నించారు. ఆ క్రమంలో కల్వకుంట్ల కవిత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలకు సంబంధించి అధికార తెలుగుదేశం పార్టీ (టీడీపీ) తమ అభ్యర్థుల ఎంపికను అధికారికంగా పూర్తి చేసింది.
ఈ గ్లోబల్ ఎక్స్‌పోజర్, కమ్యూనికేషన్ స్కిల్స్ నేడు ఆయనను జాతీయ స్థాయి రాజకీయాలకు, ముఖ్యంగా రాజ్యసభ కు సమర్థుడైన అభ్యర్థిగా నిలబెడుతున్నాయి. 2019 ఎన్నికలలో తెలుగుదేశం ఓటమి తరువాత టీడీపీ తీవ్ర సంక్షోభంలో ఉన్న తరుణంలో.. సాంప్రదాయ మీడియా కంటే డిజిటల్ మీడియా ద్వారా అధికార పక్షాన్ని ఎదుర్కోవడం ముఖ్యమని పార్టీ గుర్తించింది
ప్రస్తుత జాతీయ రాజకీయాల పరిస్థితులు, పార్టీ భవిష్యత్ ను పరిగణనలోకి తీసుకుని చింతకాయల విజయ్ రాజ్యసభకు పంపడమే సముచితమని ఆయన నిర్ణయించారు.
ప్రస్తుతం కేంద్రంలో తెలుగుదేశం పార్టీ అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తోంది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న తరుణంలో పార్లమెంట్‌లో పార్టీ గళాన్ని బలంగా వినిపించగల యువ, విద్యావంతులైన నాయకత్వం అవసరమని చంద్రబాబు భావించినట్లు కనిపిస్తోంది.
అన్నామలై ఇప్పుడు నేరుగా సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో చేతులు కలపబోతున్నారనే వార్త దావానలంలా వ్యాపిస్తోంది. వీరిద్దరూ కలిసి తమిళనాడులో ఒక సరికొత్త ప్రాంతీయ పార్టీని స్థాపించేందుకు సన్నాహాలు చేస్తున్నారనే వదంతులు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
అలాగే అంతర్జాతీయ వాణిజ్యాన్ని ఊహించని రేంజ్‌లో పెంచడానికి ఈ ప్రాజెక్ట్ దేశానికి ఎంతో రక్షణ, ఆర్థిక ప్రయోజనకరమని కేంద్ర ప్రభుత్వం బలంగా చెప్తోంది. అయితే ఈ మెగా ప్రాజెక్టుపై లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ, ఇది దేశ చరిత్రలోనే అతి పెద్ద స్కామ్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు.