ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ ఎగ్జిక్యుటివ్ వైస్ చైర్మన్ గా సీతంరాజు సుధాకర్

Publish Date:Nov 15, 2024

Advertisement

విశాఖపట్నానికి చెందిన సీతంరాజు సుధాకర్ ను నియమిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వ్యులు జారీ చేసింది. ఆయన ఈ పదవిలో రెండేళ్ల పాటు కొనసాగుతారు.  

   ఎన్టీఆర్‌ వైద్యసేవా ట్రస్టు (ఆరోగ్యశ్రీ ట్రస్టు) ఎగ్జిక్యూటివ్‌ వైస్‌-ఛైర్మన్‌గా నియమితులైన విశాఖపట్నంకు చెందిన నేత సీతంరాజు సుధాకర్‌ గతంలో  వైసీపీలో ఉన్నారు. గత ఏడాది డిసెంబర్ లో ఆయన వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు.   ఎన్నికలలో తెలుగుదేశం కూటమి అభ్యర్థుల విజయం కోసం పని చేశారు. 

 వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో  దాదాపు రెండు దశాబ్దాల అనుబంధం ఉన్న సీతంరాజు సుధాకర్  2013 వరకూ కాంగ్రెస్ లో ఉన్నారు. 2013లో  కాంగ్రెస్ కు రాజీనామా చేసి వైసీపీలో చేరారు.  2014 ఎన్నికల్లో  వైసీపీ పరాజయం పాలైన తరువాత సీతంరాజు విశాఖలో పార్టీ పటిష్టత కోసం పని చేశారు.   2019లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. అప్పట్లో సీతంరాజు ఎమ్మెల్సీ పదవిని ఆశించారు. ఆ తరువాత 2021లో ఆయనకు బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారు. తరువాత  2023 ఫిబ్రవరిలో ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్థానం నుంచి పోటీచేసి ఓటమిపాలయ్యారు.

సుధాకర్ విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం కాగా.. అక్కడి నుంచి 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించిన  వాసుపల్లి గణేష్ కుమార్ వైసీపీకి మద్దతు తెలపడంతో సీతంరాజు సుధాకర్ కు వైసీపీలో ప్రాధాన్యత తగ్గడం  మొదలైంది. దాంతో ఆయన పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వచ్చారు. చివరకు గత ఏడాది డిసెంబర్ లో పార్టీకి  గుడ్ బై చెప్పి తెలుగుదేశం గూటికి చేరారు.   

By
en-us Political News

  
తనపై నమోదైన   పరువునష్ట కేసును కొట్టివేయాలని కోరుతూ రాహుల్‌ గాంధీ గతంలో బాంబే హైకోర్టును ఆశ్రయించారు. కానీ, ఆయన చే పిటిషన్‌ను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. కేసును కొట్టివేయలేమని స్పష్టం చేస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
సరే పలు కేసులలో అరెస్టై కొన్ని నెలల పాటు జైలులో గడిపి బయటకు వచ్చారు. ఆ తరువాత అయితే పూర్తిగా అజ్ణాత వాసంలో ఉన్నారా అన్నట్లుగా వంశీ పూర్తిగా మౌనం వహించారు. ఇంత సుదీర్ఘ విరామం తరువాత ఏమైందో ఏమో కానీ.. ఒక్కసారిగా తాను రాజకీయంగా యాక్టివ్ అవుతున్నట్లు ప్రకటించారు.
కవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ, మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో  వేదికపై పంచుకుంటూ మెట్రో రైలులో ప్రయాణించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి  రేకెత్తిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అత్యంత కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ భిన్నమైన వైఖరిని ప్రదర్శించారు.  ప్రధాని మోదీతో ఆదివానం ఒకే వేదిక పంచకున్న తమిళనాడు సీఎం విజయ్.. ఆ బహిరంగ వేదికపైనే  రాష్ట్ర సమస్యలను, అలాగే  రావాల్సిన నిధులను ప్రస్తావించి అందరి దృష్టినీ ఆకర్శించారు. ప్రధాని వేదికపైనే ఆసీనులై ఉన్నప్పటికీ, ఏమాత్రం సంకోచించకుండా రాష్ట్ర ప్రయోజనాలే తమకు అత్యంత ముఖ్యమని విజయ్ కుండబద్దలు కొట్టారు. 
 సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేయే ప్రభుత్వ విధానాలపై న్యాయపోరాటానికి దిగడం, తనకు జరిగిన అన్యాయంపై పార్టీ హైకమాండ్ కూ, సీఎం రేవంత్ రెడ్డి తీరుపై అగ్రనేత రాహుల్ కు ఫిర్యాదు చేస్తానంటూ హెచ్చరికలు జారీ చేయడం సంచలనంగా మారింది.  
జగన్ అక్రమాస్తులకేసుల విచారణను వేగవంతం చేయాలని ఈడీ కోర్టును ఆశ్రయించడాన్ని సమర్ధించిన తెలుగుదేశం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. ఈ కేసులను  కేవలం రోజువారీ విచారణ కాకుండా, ప్రతి రోజూ, రోజంతా విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.  
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఇండియా కూటమి నేతల విజ్ణప్తికి నో చెప్పారు. తనను కలవాలంటూ ఇండియా కూటమి నేతలు చేసిన అభ్యర్థనను ఆయన తిరస్కరించారు. రాజకీయ పార్టీల నేతలతో సమావేశం కావడం కుదరదని విస్పష్టంగా తేల్చేశారు.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్ల ఖరారు వంటి   కీలకమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకునే నిమిత్తం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశానికి  జనసేన అధినేత, ఉప ముఖ్య మంత్రి  పవన్ కల్యాణ్‌తో పాటు జనసేన మంత్రుల గైర్హాజర్ పొలిటికల్ చర్చలకు వేదికగా మారింది.
2015లో ప్రారంభమైన ఈ పథకం కృష్ణా డెల్టా రైతులకు సాగునీటి భరోసా కల్పించడంలో కీలకంగా నిలిచింది.   కృష్ణా డెల్టాలో సాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు నీటి లభ్యతను స్థిరీకరించాలనే ఉద్దేశంతో నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు నూటికి నూరు శాతం ఫలితాలను సాధించింది.
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.