Publish Date:Mar 26, 2026
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి వరుస అగ్నిప్రమాదాలకు సంబంధించి ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. ఏపీ రాజధాని అమరావతిలో వరుసగా జరుగుతున్న అగ్ని ప్రమాదాలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించడమే కాకుండా పలు అనుమానాలు కూడా వ్యక్తమౌతున్న నేపథ్యంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు కీలక పురోగతి సాధించారు. సాంకేతిక ఆధారాలను విశ్లేషించి , రాయపూడి పరిధిలోని జరిగిన అగ్నిప్రమాద ఘటనతో సంబంధం ఉందనే అనుమానంతో రామకుమార్ అనే వాచ్‌మెన్‌ను పోలీసులు గురువారం (మార్చి 26) అదుపులోకి తీసుకున్నారు. గత సోమవారం రాత్రి సుమారు రాజధాని ప్రాంతంలోని ప్రిన్సిపల్ కార్యదర్శుల బంగళాల సమీపంలో భారీ అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే.
ఈ అగ్నిప్రమాదం అమరావతి నిర్మాణ పనులు చేస్తున్న మేఘా ఇంజనీరింగ్ సంస్థకు చెందిన పైపులు నిల్వ ఉంచిన చోట సంభవించింది. ఒక్కసారిగా మంటలు ఎగసిపడటంతో స్థానికులు, కంపెనీ సిబ్బంది పోలీసులకు, అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. మూడు ఫైర్ టెండర్ల సహాయంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. కాగా అగ్నిప్రమాదం సంభవించడానికి అవకాశం లేని మైదాన ప్రాంతంలో మంటలు ఎగసిపడటంపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి.
అమరావతి అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్న తరుణంలో వరుస అగ్నిప్రమాదాల వెనుక కుట్ర కోణం ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ప్రమాదాలపై సమగ్ర విచారణ జరపాలని ఆదేశించి ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఏర్పాటు చేశారు. సిట్ రంగంలోకి దిగిన గంటల వ్యవధిలోనే ఈ అగ్రిప్రమాదాలకు సంబంధించి ఒక అనుమానితుడిని అదుపులోనికి తీసుకుంది. అతడిని సిట్ విచారిస్తున్నది. అమరావతి నిర్మాణ పనులకు ఆటంకం కలిగేలా వరుస అగ్ని ప్రమాదాలపై రాజధాని రైతులు, ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా సిట్ విచారణలో అగ్నిప్రమాదాలకు అసలు కారణాలు వెలుగులోకి వస్తాయని భావిస్తు న్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/sit-arrest-one-regarding-fire-accidents-in-amarawathi-36-216244.html
ఈ విచారణలో విస్తు పోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేవలం రిచ్ కిడ్స్ను మాత్రమే టార్గెట్ చేసుకొని వారితో మెల్లిమెల్లిగా సోషల్ మీడియా వేదిక ద్వారా పరిచయం పెంచుకుం టున్నారు. సోషల్ మీడియాలో ఆకర్షణీయమైన లైఫ్ స్టైల్ చూపిస్తూ ప్రొఫైల్ తయారు చేసుకున్నారు. ముఖ్యంగా ఇంస్టాగ్రామ్ లో ఎస్కార్ట్ గా ఉంటూ రొమాంటిక్ మూడ్ అంటూ మైనర్లకు వల విసురుతున్నారు.
ఈ కొత్త జోన్ వచ్చెనెల మొదటి తేదీ నుంచీ కార్యకలాపాలు ప్రారంభిస్తుందని నోటిఫికేషన్ పేర్కొంది. దీంతో, ఇండియన్ రైల్వేలో దక్షిణ కోస్తా రైల్వే 18వ జోన్‌గా అవతరించనుంది.
ఈ ఆపరేషన్‌లో మొత్తం ఆరు స్టోన్ క్రషింగ్ యూనిట్లను నేలమట్టం చేయడంతో పాటు.. 12 ఆర్‌ఎంసీ ప్లాంట్లను పూర్తిగా తొలగించారు. భవిష్యత్తులో అక్కడ మళ్లీ క్రషింగ్ కార్యకలాపాలు జరగకుండా యంత్ర సామగ్రిని స్వాధీనం చేసుకుని తరలించారు. గతంలో మైనింగ్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు శాఖలు పలుమార్లు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ యథేచ్ఛగా కార్యకలాపాలు కొనసాగించడంతో ఈసారి శాశ్వతంగా చెక్ పెట్టినట్లు హైడ్రా అధికారులు వెల్లడించారు.
టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగుల భారీ స్కోరు సాధించింది. లక్నో బ్యాటర్లలో నికోలస్ పూరన్ ఆకాశమే హద్దుగా చెలరేగి కేవలం 21 బంతుల్లోనే ఒక ఫోరు, 8 సిక్సర్లతో 63 పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.
డ్రోన్ దాడి జరిగిన వెంటనే పెట్రోలియం జోన్‌లోని ఒక విభాగంలో మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో ముగ్గురు భారతీయులకు గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన సహాయక బృందాలు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించాయి. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ చరిత్రాత్మక విజయం దిశగా దూసుకుపోతోంది.
చాందీ ఉమ్మన్, తన తండ్రి పేరిట ఉన్న రికార్డులన్నింటినీ తుడిచిపెట్టేస్తూ భారీ మెజారిటీతో విజయం సాధించారు.
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కేరళలోని కన్నూర్ కు బయలుదేరిన ఇండిగో విమానానికి పెద్ద ప్రమాదం తప్పింది.
పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్. రంగస్వామి మళ్లీ గెలిచారు. ఎన్టీఏ కూటమి భాగస్వామిగా రెండో సారి పదవీ స్వీకారానికి సిద్దమయ్యారు.
అవి 2021 తమిళనాడు శాసన సభ ఎన్నికలు...
తమిళనాడు రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దక్షిణాది రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పట్టణంలో పురాతన రామాలయ పునర్నిర్మాణ పనులు ఘనంగా ప్రారంభమయ్యాయి.