Publish Date:Jun 18, 2025
చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఓవరేక్షన్ బూమరాంగ్ అయ్యింది. ఆలూ లేదు చూలూ లేదు.. అన్న సామెత చందంగా చెవిరెడ్డి భాస్కరరెడ్డి మద్యం కుంభకోణంలో తనను ఇరికించాలన్న కుట్ర జరుగుతోందంటూ నానా యాగీ చేశారు. చెవిరెడ్డి ఈ యాగీ చేసే సమయానికి అసలు చెవిరెడ్డి పేరు మద్యం కుంభకోణం నిందితులలో లేనే లేదు. ఈ కేసులో అరెస్టైన నిందితులు విచారణలో తన పేరు వెల్లడించి ఉంటారన్న అనుమానంతో చెవిరెడ్డి హడావుడి చేశారు. తన వద్ద పని చేసిన వారినీ, తన స్నేహితులనూ బెదరించి, వేధించి తనకు వ్యతిరేకంగా తప్పుడు స్టేట్ మెంట్లు ఇప్పిస్తున్నారంటూ సిట్ పై ఆరోపణలు గుప్పించారు. తనను అరెస్టు చేయడమే సిట్ లక్ష్యమైతే.. తానే స్వయంగా సిట్ కార్యాలయానికి వచ్చి స్వచ్ణందంగా అరెస్టౌతాను అంటూ గంభీరమైన ప్రకటనలు చేశారు. మీడియా ముందు సవాళ్లు చేశారు. దాదాపు తొడకొట్టి మీసం మెలేసినంత పని చేశారు.
ఇంతా చేసి.. చల్లగా దేశం దాటేయడానికి ప్రయత్నించారు. అయితే బెంగళూరు విమానాశ్రయంలో అడ్డంగా దొరికిపోయారు. లుక్ ఔట్ నోటీసు ఉండటంతో ఆయనను బెంగళఊరు విమానాశ్రంయలో ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. సిట్ కు సమాచారం ఇచ్చారు. సిట్ హుటాహుటిన బెంగళురుకు బయలుదేరి వెళ్లింది. ఈ రోజు ఆయనను విజయవాడ తీసుకువచ్చి కోర్టులో హాజరు పరిచే అవకాశాలు ఉన్నాయి. ఇక చెవిరెడ్డి కోసం ఆయన వద్ద పదేళ్ల పాటు గన్ మెన్ గా పని చేసిన మదన్ రెడ్డి అనే హెడ్ కానిస్టేబుల్ కోర్టుకెక్కారు. సిట్ తనను చెవిరెడ్డికి వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వాలంటూ వేధించిందనీ, మ్యాన్ హ్యాండిల్ చేసిందనీ పిటిషన్ దాఖలు చేశారు. సరే సిట్ మదన్ రెడ్డి ఆరోపణలు నిర్ద్వంద్వంగా ఖండించింది. ఆ ఆరోపణలపై డీజీపీ స్థాయి అధికారితో విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. అసలు మదన్ రెడ్డి తమ విచారణకు సహకరించలేదని పేర్కొంది.
అది పక్కన పెడితే.. చెవిరెడ్డి విషయంలో సిట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి సహా ఆరుగురిని నిందితులుగా చేరుస్తూ కోర్టులో మెమో దాఖలు చేసింది. దీంతో మద్యం కుంభకోణంలో చెవిరెడ్డి ఓవరేక్షన్ చేసి తొందరపడి ఒక కోయిలా ముందే కూసింది అన్న చందంగా ముందుగానే అరెస్టు సవాళ్లు విసిరి సిట్ అదుపులోకి వెళ్లిపోయారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/sit-arrest-chevireddy-bhaskarreddy-39-200198.html
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై చార్జ్‌షీట్ విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు. తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే.. మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి సొంత నియోజకవర్గానికే ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి.
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.
ఇండియా కూటమి తరఫున రాహుల్ గాంధీనే ప్రధానమంత్రి అభ్యర్థి అని కుండబద్దలు కొట్టారు. ఆ విషయాన్నే తమిళనాడు కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకురాలు తారాహై కత్‌బర్ట్ మరింత క్లారిటీ ఇస్తూ.. విజయ్ ప్రధాని అవుతారంటూ కొందరు ప్రచారం చేయడం కేవలం టీవీకే శ్రేణుల ఉత్సాహం వల్ల జరుగుతున్న ప్రచారమే తప్ప, అది ఆ పార్టీ అధికారిక వైఖరి కాదన్నారు.