టీమ్ ఇండియా టెస్ట్ కెప్టెన్ రికార్డు.. బ్రాడ్ మన్ తరువాత శుభమన్ గిల్!
Publish Date:Jun 7, 2026
Advertisement
టీమ్ ఇండియా టెస్ట్ కెప్టెన్ శుభమన్ గిల్ అరుదైన రికార్డు సృష్టించాడు. కెప్టెన్ గా అత్యంత వేగంగా వెయ్యి పరుగులు చేసిన బ్యాటర్ గా గవాస్కర్ తరువాతి స్థానంలో నిలిచాడు. అంతే కాకుండా.. కెప్టెన్‌గా వెయ్యి పరుగుల మైలురాయిని అందుకున్న గిల్, ఈ ఘనత సాధించిన కెప్టెన్ల బ్యాటింగ్ సగటులో క్రికెట్ దిగ్గజం డాన్ బ్రాడ్‌మన్ తర్వాత రెండో స్థానంలో నిలిచి ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఆఫ్ఘనిస్థాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో గిల్ ఈ రికార్డు సాధించాడు. న్యూ చండీగఢ్‌లో లో జరుగుతున్న ఈ మ్యాచ్ రెండో రోజు, గిల్ సెంచరీ సాధించాడు. కేవలం 177 బంతుల్లో 126 పరుగులు చేసిన గిల్, కెప్టెన్‌గా తన ఆరో టెస్ట్ శతకాన్ని నమోదు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌తోనే అతను కెప్టెన్‌గా వెయ్యి పరుగుల క్లబ్‌లో చేరాడు. కేవలం 15 ఇన్నింగ్స్‌లలోనే ఈ మైలురాయిని చేరుకోవడం విశేషం. ఈ ఘనతతో కెప్టెన్‌గా గిల్ బ్యాటింగ్ సగటు సుమారు 82.8కి చేరింది. ఇప్పటివరకు టెస్ట్ చరిత్రలో కెప్టెన్‌గా వెయ్యికి పైగా పరుగులు చేసిన 101 మంది ఆటగాళ్లలో ఒక్క డాన్ బ్రాడ్‌మన్ మాత్రమే గిల్ కంటే ఎక్కువ సగటు 99.94 కలిగి ఉన్నారు. ఆప్ఘన్ తో జరుగుతున్న ఏకైక మ్యాచ్ లో గిల్ శతకంపుణ్యమాని టీమ్ ఇండియా 8 వికెట్లనష్టానికిొ 564 పరుగుల భారీ స్కోరు చేసి డిక్లేర్ చేసింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఆఫ్ఘనిస్థాన్, రెండో రోజు ఆట ముగిసే సమయానికి 113 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
http://www.teluguone.com/news/content/shubman-gill-next-to-brodman-36-222189.html





