మార్నింగ్ అలారం గురించి షాకింగ్ నిజాలు..!

Publish Date:Aug 8, 2024

Advertisement

 

అలారం చాలామంది దినచర్యలో భాగం.  ఉదయాన్నే చదువుకునే వారి నుండి ఉద్యోగాలు చేసుకునే వారి వరకు ఉదయం పనులు పర్పెక్ట్ గా ఫినిష్ కావాలి అంటే అలారం పెట్టుకుంటూ ఉంటారు. చాలామంది ఉదయాన్నే నిద్ర లేవడం అనే అలవాటును అలారం ద్వారానే ఫాలో అవుతారు. స్మార్ట్ ఫోన్లు అందరికీ అందుబాటులో వచ్చాక కేవలం ఒకటి మాత్రమే కాకుండా ఏకంగా మూడు నుండి నాలుగు సార్లు అలారాన్ని నిమిషాల వ్యవధిలో సెట్ చేసేవారు కూడా ఉన్నారు. అయితే ఇలా మార్నింగ్ అలారం సెట్ చేసుకోవడం చాలా ప్రమాదం అని ఇది ఏకంగా గుండెకు గండి పెడుతుందని అంటున్నారు వైద్యులు.


వైద్యులు చెబుతున్న విషయాల ఆధారంగా నిద్రలలో శరీరంలో అనేక రకాల మార్పులు చోటు చేసుకుంటాయి. శరీరం ఒక నిశ్చల స్థితిలో ఉన్నప్పుడు అలారం వల్ల కలిగే శబ్దం గుండెను చాలా డిస్బర్బ్ చేస్తుందట.


నిద్రపోతున్నప్పుడు శరీరంలో రక్తం చిక్కగా ఉంటుంది.  అలారం గట్టిగా శబ్దం చేసినప్పుడు రక్తపోటు పెరుగుతుంది. దీని కారణంగా  గుండె కొట్టుకునే వేగం కూడా పెరుగుతుంది. ఇది  గుండెపోటు రావడానికి దారితీస్తుందట.


మరొక ముఖ్య విషయం ఏంటంటే ఉదయాన్నే ఇలా అలారం పెట్టుకుని నిద్రలేస్తే మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుందట.  రోజంతా ఒత్తిడిలోనే సమయం గడుస్తుందట. అలారం ద్వారా నిద్ర లేవడం అనేది ఒక బలవంతపు అలవాటులాగా మారుతుంది. ఇది మానసికంగా డిస్టర్బ్ చేస్తుంది.
 

గాఢనిద్ర నుండి అకస్మాత్తుగా మేల్కొనడం వల్ల జ్ఞాపకశక్తి మీద, ఆలోచనా సామర్థ్యం మీద కూడా ప్రతికూల ప్రభావం పడుతుంది.  ఇది రోజూ రిపీట్ అవుతుంటే ఒత్తిడి కూడా పెరుగుతుందట.


అలారం మీద ఆధారపడి నిద్రలేచే అలవాటు ఎక్కువగా ఉంటే అది నిద్రా చక్రం అయిన సిర్కాడియన్ రిథమ్ మీద ప్రభావం చూపిస్తుంది.  ఈ సిస్టమ్ చెదిరిపోవడం వల్ల అనేక మానసిక సమస్యలు వస్తాయి.


పై సమస్యలను దృష్టిలో ఉంచుకుని నిద్ర లేవడానికి అలారం ఉపయోగించడాన్ని మానేయమని వైద్యులు చెబుతున్నారు. దీనికి బదులుగా సూర్యకాంతి వచ్చే ప్రదేశంలో నిద్రపోవడం,  రాత్రిళ్లు తొందరగా నిద్రపోవడం చేయాలి. దీని వల్ల ఉదయాన్నే మెలకువ వస్తుంది. ఒకవేళ అలా మెలకువ రాకపోతే ఎవరిని అయినా ఉదయాన్నే ఓ నిర్ణీత సమయానికి మేల్కొలిపేలా చేయాలి. మొదట కొన్ని రోజులు ఎవరో ఒకరు నిద్ర లేపుతుంటే కొన్ని రోజులలోనే అదే సమయానికి  మెలకువ వస్తుంది.

                                      *రూపశ్రీ.

By
en-us Political News

  
ప్రస్తుత ఆధునిక కాలంలో శారీరక ఆరోగ్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో, మానసిక ఆరోగ్యానికి (Mental Health) కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వడం ఎంతో అవసరం. కానీ, నేటి ఒత్తిడితో కూడిన జీవనశైలి, వ్యక్తిగత సమస్యల వల్ల చాలా మంది...
ఈ రోజుల్లో మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల చాలా మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య మలబద్ధకం. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే పైల్స్, గ్యాస్ వంటి ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఎలాంటి మందులు వాడకుండా, ఇంట్లోనే సహజంగా మలబద్ధకాన్ని ఎలా తగ్గించుకోవచ్చో ప్రముఖ ఆయుర్వేద నిపుణులు..
మానవ శరీరంలో ప్రేగుల పాత్ర చాలా ఉంది.,  తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడంలో,  శరీరానికి అవసరమైన పోషకాలను గ్రహించడంలో, వ్యర్థాలను బయటకు పంపడంలో ప్రేగులు చాలా కీలక పాత్ర పోషిస్తాయి. తిన్న ఆహారం..
మన శరీరంలో పొటాషియం స్థాయిలు హెచ్చుతగ్గులు కావడం వల్ల కలిగే అనారోగ్య సమస్యలు, వాటి కారణాలు మరియు నివారణ మార్గాల గురించి ప్రముఖ వైద్యులు డాక్టర్ పాపారావు గారు ఈ వీడియోలో క్లుప్తంగా వివరించారు...
మూత్రపిండాలు శరీరం నుండి విషపదార్థాలను తొలగించడం, రక్తపోటును నియంత్రించడం,  శరీరంలో నీరు, ఖనిజాలను బాలెన్స్డ్ గా ఉంచడం వంటి   ముఖ్యమైన విధులను నిర్వర్తిస్తాయి. అయితే, కొన్ని అనారోగ్యకరమైన..
చాలా మందిని వేధించే ప్రధాన ఆరోగ్య సమస్యల్లో ‘తల తిరగడం’ (Vertigo/Dizziness) ఒకటి. హఠాత్తుగా కళ్ళు తిరగడం వల్ల భయం, అసౌకర్యం కలగడమే కాకుండా రోజువారీ పనులు చేసుకోవడం కష్టమవుతుంది.
చాలా మందికి రాత్రిపూట వేడివేడి అన్నం తింటే గాని నిద్ర పట్టదు. కానీ, బరువు తగ్గాలని లేదా ఫిట్‌గా ఉండాలని ప్రయత్నించే వారికి..
మనలో చాలా మందికి అద్దంలో చూసుకున్నప్పుడు కొన్ని శరీర భాగాలు నచ్చవు. ముఖ్యంగా ఎంత వ్యాయామం చేసినా, ఎంత కఠినమైన డైట్ పాటించినా తగ్గని మొండి కొవ్వు మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది...
ప్రస్తుత రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలా మంది మహిళలను వేధిస్తున్న అతిపెద్ద సమస్య పి.సి.ఓ.డి (PCOD). అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది..
ఈనాటి వేగవంతమైన జీవనశైలిలో మనకు తెలియకుండానే మనం అనేక ఆరోగ్య సమస్యలను కొనితెచ్చుకుంటున్నాము. ముఖ్యంగా, నేటి యువతలో సెక్స్ పట్ల ఆసక్తి తగ్గడం అనేది ఒక ప్రధాన సమస్యగా మారుతోంది. ..
మధుమేహం (Diabetes) ఉన్నవారు చేసే మొదటి పని అన్నం మానేసి చపాతీలు తినడం. మరి నిజంగా చపాతీ తింటే షుగర్ తగ్గుతుందా? అన్నం తింటే పెరిగిపోతుందా? ఈ విషయంలో చాలా మందిలో..
నేటి వేగవంతమైన ఒత్తిడితో కూడిన జీవితంలో ఆందోళన ఒక సాధారణ సమస్యగా మారింది. కొన్నిసార్లు చిన్న చిన్న విషయాలు కూడా మనసును అశాంతపరిచి, నిద్ర, ఆహరం, రోజువారీ జీవనశైలిపై  ప్రభావం చూపుతాయి...
కాలం మారినా మనిషి జీవన పోరాటం మాత్రం మారదు.  కొందరు కాలంతో పోటీ పడి ఎండ, వాన, చలి వంటి వాటిని లెక్క చేయకుండా సాగుతూ ఉండాలి. లేకపోతే వారితో పాటు వారిని నమ్ముకున్న కుటుంబాలు కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుంది.....
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.