షర్మిలా వర్సెస్ జగన్.. ఆస్తిగొడవలూ, రాజకీయాలు!

Publish Date:Oct 29, 2024

Advertisement

ఆస్తుల వ్యవహారంలో వైఎస్ కుటుంబం బజారున పడుతున్నది. ప్రజాజీవితంలో ఉన్నవారికి వ్యక్తిగతం అనేది ఉండదని రాజకీయోక్తి. అదే నేడు జగన్,షర్మిల విషయంలో నిజమవుతున్నది.. ఆస్తుల  విభేదాలు ఎలా ఉన్నా వైఎస్ కుటుంబం లోని లొసుగులన్నీ పరస్పర ఆరోపణలు, ప్రత్యారోపణలతో బయటపడి వైఎస్ కుటుంబం నవ్వుల పాలౌతోంది.  జగన్, షర్మిల మధ్య అన్నా చెల్లెళ్ల అనుబంధం, రక్త సంబంధం కంటే ఆస్తి గొడవలే పెద్ద పీట వేసుకు కూర్చున్నాయి.

జగన్ ఇక  షర్మిలపై వ్యాఖ్యలు చేయనని ప్రకటించడం తన ప్రతిష్ఠ మరింత మసకబారకుండా ఉండటానికి చేస్తున్న ప్రయత్నం తప్ప మరొకటి కాదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక షర్మిలపై వ్యాఖ్యలు చేయనని ప్రకటిస్తూ ఆయన రాసిన లేఖ.. షర్మిలను మరింత రెచ్చగొట్టేదిలా ఉంది తప్ప సమస్య పరిష్కారం కోసం చేసిన ప్రయత్నంలా ఇసుమంతైనా లేదు.  ఎవరు ఎంతగా గింజుకున్నా, సొంత పరువు బజారున పడేసుకునేలా వ్యవహరించినా జగన్ షర్మిల మధ్య ఆస్తుల తగాదాను తీర్చాల్సింది న్యాయస్థానాలే తప్ప రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలతో ఓరిగేదేం ఉండదు. 

ఇప్పటికే షర్మిల జగన్ మధ్య రాజకీయ వైరుద్ధ్యం, వ్యక్తిగత వైరం చల్లారే అవకాశాలు లేని స్థాయికి వెళ్లిపోయాయి. జగన్ రెండడుగులు ముందుకు వేసి తన కుటుంబ వ్యవహారాన్ని వైసీపీ రాజకీయ వ్యవహారంగా మార్చేశారు. సొంత చెల్లి అన్న అనుబంధం మరిచి తన పార్టీ నేతల చేత షర్మిలపై అనుచితంగా విమర్శల దాడి చేయించారు. ఆమె వ్యక్తిత్వ హననానికి కూడా వెనుకాడలేదు. మొత్తంగా జగన్ తీరు  పట్ల రాజకీయాలతో సంబంధం లేని వారు కూడా ఏవగించుకునేలా ఉంది. వైఎస్ అభిమానులైతే జగన్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతే స్థాయిలో షర్మిల పట్ల సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. షర్మల కూడా అన్న అనుచిత తీరును,  ఆయన పార్టీ నేతల విమర్శలను దీటుగా ఎదుర్కొంటున్నారు. 

వైఎస్ మరణం వెనుక టీడీపీ హస్తం ఉందని,ముఖ్యంగా చంద్రబాబు హస్తం ఉందని విజయసాయిరెడ్డి తదితరులు ఆరోపించడం, దానికి షర్మిల అధికారంలో ఉన్న గత ఐదేళ్లలో గాడిదలు కాసారా ,క నీసం విచారణ కూడా ఎందుకు చేయలేదని ధ్వజమెత్తారు. కని పెంచిన తల్లి విజయమ్మ పై కూడా కేసు వేసిన విషనాగు జగన్ అని షర్మిల ఘాటుగా విమర్శలు చేశారు.  

వైఎస్ ఆస్తులు పంచారని,మిగిలినవి జగన్ స్వార్జితమేనని విజయసాయి చెప్పడం ఆశ్చర్యం. వైఎస్ చనిపోయే నాటికి ఎన్నికల అఫిడవిట్ ప్రకారం 2009లో జగన్ ఆస్తుల విలువ రూ.77 కోట్లు మాత్రమే. అది 2024కల్లా రూ.530కోట్లకు చేరింది. అదెలా సాధ్యమయ్యిందో జగన్ వివరించి ఉండాల్సింది. స్వార్జితం, చెమటోడ్చి సంపాదించాను అని జగన్ చెప్పడం నమ్మశక్యంగా లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అది పక్కన పెడితే చంద్రబాబు వదిలిన విషపు బాణం షర్మిల అని జగన్ అనుయాయిలు ఆరోపించడం,  ఆమెకు పీసీసీ పదవి ఇప్పించిందే చంద్రబాబు అని అనడం విడ్డూరంగానే కాదు, హాస్యాస్పదంగా కూడా ఉన్నాయి.    ఏదిఏమైనా ఆస్తులు తగాదాలు రాజకీయాలతో కలపడం, సందర్భం వచ్చిందని దుమ్మెత్తిపోయడం సబబు కాదని,రాజకీయాలను మరింత దిగజార్చవద్దని వైఎస్ అభిమానులు జగన్ కు సూచిస్తున్నారు.  

By
en-us Political News

  
తమిళనాడులో బీజేపీ, హీరో విజయ్ సారథ్యంలోని టీవీకేల పొత్తు విషయంలో మరోసారి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
దేశంలోని నాలుగు రాష్ట్రాలతో పాటు ఒక కేంద్రపాలిత ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది
ఈసీ తీరుపై నమ్మకం లేదని చెబుతున్న పార్టీ, ఇప్పుడు సీఈసీపై అభిసంశన తీర్మానానికి మద్దతుగా నిలబడకుంటే.. ఆ పార్టీ నైతికతే ప్రశ్నార్థకంగా మారుతుంది. ఒక వేళ వైసీపీ ఈ తీర్మానాన్ని వ్యతిరేకిస్తే ఇక ముందు, ఎన్నికల అక్రమాలపై మాట్లాడేందుకు వైసీపీకి అర్హతే ఉండదు. ఇంత వరకూ తెలుగుదేశం కూటమి విజయంపై వారు చేసిన విమర్శలన్నీ దూదిపింజెల్లా ఎగిరిపోతాయి.
బీఆర్ఎస్ హయాంలో ఇదే ఫామ్‌హౌస్ వేదికగా జరిగిన ఎమ్మెల్యేల కొనుగోలు ఉదంతం అప్పట్లో పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అప్పట్లో రోహిత్ రెడ్డి ఫిర్యాదుతోనే పోలీసులు అక్కడ సోదాలు నిర్వహించి, ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అప్పట్లో ఈ కేసు జాతీయ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది.
దేవ్ జీ అరెస్ట్ ఎలా జరిగింది? అరెస్టు తరువాత ఆయన లొంగుబాటు ప్రకటన చేసి జనజీవన స్రవంతిలో కలుస్తున్నట్లు ఎందుకు ప్రకటించాల్సి వచ్చింది? లొంగిపోలేదు అంటూనే.. ప్రస్తుత పరిస్థితుల్లో అజ్ణాతంగా ఉండి ఉద్యమాన్ని కొనసాగించడం కష్టసాధ్యమని ఎందుకు చెబుతున్నారు?
త్రిష త్వరలోనే సినిమాలకు గుడ్‌బై చెప్పి రాజకీయాల్లోకి రావడం కన్ఫర్మ్ అన్న వాదన బలంగా వినిపిస్తోంది. అయితే ఇందుకు సంబంధించి త్రిష నుంచి ఎటువంటి క్లారిటీ అయితే ఇప్పటి వరకూ రాలేదు. ప్రస్తుతం త్రిష పలు సినిమాలలో నటిస్తున్నారు. వాటిలో మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమా కూడా ఉంది.
మంత్రిగా పదవీ బాధ్యతలు నిర్వర్తిస్తూ కూడా పవన్ కల్యాణ్ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనీ, షూటింగ్ లంటూ అధిక సమయం హైదరాబాద్ లోనే ఉంటున్నారని రోజా అన్నారు. ప్రజా సమస్యలను గాలికొదిలేసి సినిమాలలో యాక్టింగ్ కి పరిమితమైనట్లుగా పవన్ కల్యాణ్ తీరు ఉందని రోజా అన్నారు. కీలకమైన మంత్రివర్గ సమావేశానికి డుమ్మా కొట్టడం సరికాదన్న రోజా దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విధానసౌధలో కేబినెట్ సమావేశం నిర్వహిస్తున్న సమయంలోనే.. పాతిక మంది ఎమ్మెల్యేలు ఓ ప్రైవేట్ హోటల్‌లో ఈ భేటీ జరగడం సంచలనం సృష్టించింది.
తెలుగువన్ వాస్తవ వేదిక 16వ సంచికలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
జనసేన పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఈసారి దూరం జరిగింది.
పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి ఊరట
రాష్ట్రంలో బీఆర్ఎస్‌ రెండుసార్లు, కాంగ్రెస్‌ ఒకసారి అధికారంలోకి వచ్చాయనీ, ఆ రెండు ప్రభుత్వాల వైఫల్యాలనూ గమనించిన తెలంగాణ ప్రజలు వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అధికారం కట్టబెట్టాలని ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశారన్నారు.
జాతీయ పార్టీలకే ప్రయోజనం చేకూరుతుందనీ, రాష్ట్రాల సమస్యలపై పట్టింపే లేని పరిస్థితి ఉత్పన్నమౌతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం ఖర్చు తగ్గుతుందన్న నెపంతో కేంద్రం జమిలి ఎన్నికల నిర్వహణకు మొగ్గు చూపడమంటే.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే ఔతుందని పేర్కొన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.