కేసీఆర్ చేతగాని సీఎం!.. షర్మిలపై టీఆర్ఎస్ మౌనం..
Publish Date:Feb 11, 2022
Advertisement
తెలంగాణ రాజకీయాలలో ఆమె స్థానం ఏమిటో? ఆమె స్టేక్ ఏమిటో? ఎవరికీ తెలియదు. కానీ, తెరాస ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి కీసీఆర్’ను బీజీపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులకంటే, ఎక్కువగా, ఘాటుగా విమర్శిస్తారు. వ్యంగ్య బాణాలు విసురుతారు. అయినా, ప్రధాని మోడీని సహా, ఎవరినీ వదల కుండా అందరినీ అన్ని భాషల్లో, తిట్టి పోసే, ‘ముఖ్యమంత్రి’ కేసీఆర్, ఆయనకు ఏమాత్రం తగ్గకుండా అందరినీ దూషించే సామర్ధ్యం ఉన్న కేటీఆర్, ఆమె జోలికి మాత్రం వెళ్ళరు. ఎందుకో .. మతలబు ఏమిటో ... ఎవరికీ తెలియదు. అయితే, కేసీఆర్’ కోసంగా ప్రశాంత్ కిశోర్, ఆమెను తెలంగాణలో ప్లాంట్ చేశారని అంటారు. అదలా ఉంటే తాజగా షర్మిల మరో మారు కేసీఆర్’పై వ్యంగ్య బాణాలు సంధించారు. ఆత్మహత్యలు చేకున్న రైతుల కుటుంబాలకు ఇస్తామన్న నష్ట పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపధ్యంలో షర్మిల, రాష్ట్రంలో ఆత్మ హత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు, కుటుంబానికి రూ.6లక్షల చొప్పున ఇస్తామన్న ఎక్స్‌గ్రేషియా తెరాస ప్రభుత్వం ఏడేళ్ళలో ఒక్కరికీ ఇవ్వలేదని ఘాటుగా విరుచుకు పడ్డారు. కేసీఆర్ ను డైరెక్ట్’గా దొర అని సంబోధిస్తూ, ‘దొర ఇచ్చిన మాట కోసం తల నరుక్కుంటాడు తప్పితే మాట తప్పే మనిషి కాద’ ని వ్యంగ్యంగా కామెంట్ చేశారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.6 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇస్తామంటూ ప్రభుత్వం జీవో ఇచ్చి ఏడేళ్లయినా ఇప్పటికీ ఒక్కరికి కూడా ఇవ్వలేదని షర్మిల దుయ్యబట్టారు. 2015లో ఇచ్చిన జీవో కాగితాలకే పరిమితమైందన్నారు. అలాగే, ఏడేళ్ళ క్రితం ఆత్మహత్య చేసుకొన్న 133 మంది రైతులకు ఎక్స్ గ్రేషియా ఇచ్చింది లేదు. తల నరుక్కొన్నది లేదని అన్నారు. కోర్టులు మొట్టికాయలు వేస్తేకానీ ఇచ్చిన జీవో గుర్తుకు రాదు. కరోనా టెస్టులు పెంచాలని, టీఎస్పీఎస్సీ సభ్యులను భర్తీ చేయాలని, రాష్ట్రంలో కమిషన్లను ఏర్పాటు చేయండని, ఆఖరికి చనిపోయిన రైతులను ఆదుకోవాలని కోర్టులే చెప్పాలి’ అని షర్మిల పేర్కొన్నారు. కోర్టులు చెబితేకానీ బాధ్యతలు గుర్తుకురాని ముఖ్యమంత్రి కేసీఆర్, అంటూ షర్మిల విమర్శించారు. అయినా, తెరాస నాయకులూ ఎవరూ రియాక్ట్ కాలేదు. చుట్టమైతే తిట్టినా ఇష్టమే కదా.. అదన్న మాట.
ఇంతకీ ఆమె ఎవరో కాదు, వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. నిజానికి, ఆమె తెలంగాణ రాజకీయాల్లో అరంగేట్రం చేసినప్పటి నుంచి ఆమె చుట్టూ అనేక రాజకీయ వ్యూహాగానాలు అల్లు కున్నాయి. అదలా ఉంటే ఇప్పుడు, ఇటు కేసీఆర్ (తెరాస)కు అటు,షర్మిల ( వైఎస్సార్ టీపీ)కి ప్రశాంత్ కిశోర్ టీమ్’ జాయింట్ గా వర్క్ చేస్తోందని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపధ్యంలో షర్మిల ఘాటు, వ్యంగ విమర్శలను కేసీఆర్, కేటీఆర్ సీరియస్’గా తీసుకోవడం లేదని, నిజానికి ఆమెను మాట్లాడిస్తున్నదే ఆ ఇద్దరి కామన్ ఫ్రిండ్ పీకే’ అని రాజకీయ, మీడియా వర్గాల్లో వినవస్తోంది.
http://www.teluguone.com/news/content/sharmila-fire-on-cm-kcr-39-131630.html





