జగనన్న క్యాస్ట్ పాలి-ట్రిక్స్.. వామ్మో ఇంత స్కెచ్ ఉందా?
Publish Date:Feb 11, 2022
Advertisement
జగన్‌మోహన్‌రెడ్డి. ఆ పేరులో 'రెడ్డి'ని ట్రెస్ చేస్తుంటారు ఆయన అభిమానులు. ఇక, జగనన్నేమో.. 'కమ్మ' పేరుతో కుల గబ్బు రేపుతుంటారు. కొవాగ్జిన్‌నూ కులం గాడిన కట్టిన ముఖ్యమంత్రి ఆయన. ఇక, నిమ్మగడ్డ నుంచి రామోజీరావు వరకూ.. అందరినీ చంద్రబాబు కులానికి లింకుపెడుతూ రాజకీయ పబ్బం గడుపుతుంటారు. ఇక, ఆయన చేసిన, చేస్తున్న కాపు రాజకీయం ఇప్పటికీ కాక రేపుతూనే ఉంది. అందుకే, ఈసారి సీఎం జగన్ చాలా జాగ్రత్తగా పావులు కదిపారు. సినిమా ప్రముఖులతో మీటింగ్‌లో క్యాస్ట్ ఈక్వేషన్‌ను చాలా పద్దతిగా పొందుపరిచారు. జగన్ దగ్గరకు వెళ్లిన సినీ స్టార్స్‌ను ఓసారి గమనిస్తే ఆ కులాల లెక్కేంటో తేలిపోతుంది. చిరంజీవి, మహేశ్, ప్రభాస్.. ముగ్గురూ మూడు కులాలకు ప్రాతినిధ్యం వహించే టాప్ హీరోలు. కమ్మ కులానికి వ్యతిరేకంగా జగన్ మొదట్నుంచీ గళం విప్పుతున్నారన్న ప్రచారం ఉంది. అందుకే అలాంటి ప్రచారానికి తావు లేకుండా వివిధ కులాలకు ప్రాతినిధ్యం ఉండేలా తనతో భేటీ అయ్యే బృందాన్ని జాగ్రత్తగా సెలెక్ట్ చేశారు జగన్. కాపు వర్గం నుంచి చిరంజీవిని ముందుంచి.. కాపులకు పవన్‌కల్యాణ్ మాత్రమే కాదు తానూ కావాల్సినవాడిననే మెసేజ్ ఇచ్చారని అంటున్నారు. కమ్మ కమ్యూనిటీ నుంచి మహేశ్‌బాబు, పోసాని, రాజమౌళి, కొరటాలలను రప్పించుకుని.. కాస్త డ్యామేజ్ కంట్రోల్‌కు ప్రయత్నించారు. ఇక, రఘురామ ఎపిసోడ్‌తో ఆ వర్గం వైసీపీకి దూరమవగా.. ప్రభాస్‌ను ఇన్వైట్ చేసి 'రాజు'లను సంతృప్తి పరిచే వ్యూహం పన్నారని అంటున్నారు. ఇక ఎంతమంది ఉన్నా.. రెడ్డి గారు లేకపోతే ఎలా? అందుకే, ఈసారి దిల్‌రాజురెడ్డిని కాకుండా.. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ అధినేత నిరంజన్‌రెడ్డిని ఆహ్వానించారు. కులాల సమతూకంతో పాటు.. మత సామరస్యం కూడా పాటించినట్టున్నారు జగనన్న. అందుకే కాబోలు.. అసలు ప్రస్తుత ఇష్యూతో అసలేమాత్రం సంబంధంలేని అలీని కూడా జట్టులో చేర్చుకుని.. చర్చలు జరిపారు. ఇలా, కులమతాల సమతూకంతో తాడేపల్లి ప్యాలెస్‌లో జగన్నాటకాన్ని బాగానే రక్తి కట్టించారని అంటున్నారు. జగనన్నా.. మజాకా...!!
http://www.teluguone.com/news/content/cast-politics-over-jagan-and-tollywood-meeting-39-131634.html





