షణ్ముక్- దీప్తి సునయన లవ్ బ్రేకప్.. యూట్యూబ్ స్టార్స్ భావోద్వేగ పోస్టులు 

Publish Date:Jan 1, 2022

Advertisement

అనుమానించినట్లే జరిగింది. కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారమే నిజమైంది. సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన దీప్తి సునయన, షణ్ముఖ్ జంట విడిపోయింది. కొత్త సంవత్సం రోజునే ఇద్దరు సోషల్ మీడియా వేదికగా అధికారికంగా బ్రేకప్ ప్రకటించారు. తామిద్దరం విడిపోతున్నామంటూ వేరు వేరుగా ఎమోషనల్ పోస్టులు పెట్టారు. 

సోషల్ మీడియాలో దీప్తి సునయన, షణ్ముఖ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఇద్దరు కలిసి పలు షార్ట్ ఫిలిమ్స్ తోపాటు కవర్ సాంగ్స్ లోనూ మెరిశారు. సోషల్ మీడియాలో ఈ ఇద్దరికీ విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఈ ఇద్దరు లవ్ లో ఉన్న విషయం కూడా అందరిలో తెలుసు. అయితే గత కొద్ది రోజులుగా వీరిద్దరు విడిపోతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు తెగ హల్చల్ చేశాయి. తాజాగా ఈ వార్తలు నిజమేనని తేలిపోయింది. షణ్ముఖ్ జశ్వంత్ తో విడిపోతున్నట్లు అతని ప్రేయసి దీప్తి సునయన తెల్చీ చెప్పేసింది. తామిద్దరం విడిపోతున్నామంటూ తన ఇన్ స్టా ఖాతాలో షేర్ చేసింది దీప్తి.

దీనిపై షణ్ముఖ్ స్పందించాడు. నిర్ణయాలు తీసుకునే హక్కు దీప్తికి ఉందని. మా దారులు వేరని తెలిసిందని.. ఇక మా బంధం 5 ఏళ్ళు అందంగా గడిచిందని తెలిపాడు షణ్ముఖ్. నాకు తాను హ్యాపీగా ఉండటమే కావలి అంటూ రాసుకొచ్చాడు. ఈ ఐదేళ్లలో నీ సపోర్ట్ తో చాలా నేర్చుకున్నాను.. మంచి వ్యక్తిగా ఎదిగాను.. అని ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశాడు షణ్ముఖ్. 

ముందుగా దీప్తి సునయన ఇన్ స్టాలో బ్రేకప్ గురించి పోస్ట్ చేసింది. “నా శ్రేయోభిలాషులు మరియు స్నేహితులందరికీ ఎంతో ఆలోచించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నాం. నేను, షణ్ముఖ్ పరస్పరం మా వ్యక్తిగత జీవితాలలో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాం. ఈ ఐదు సంవత్సరాలు మేము సంతోషంగా ఉన్నాం. ప్రేమ, ఎదుగుల సమయంలో మాలోని రాక్షాసులతో పోరాటం చాలా కష్టం. మీరందరు కోరుకున్నట్టే మేమిద్దరం ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇది చాలా కాలంగా జరుగుతుంది. కానీ సోషల్ మీడియాలో కనిపించినంత సులభంగా మాత్రం కాదు. మేమిద్దరం కలిసి ఉండేందుకు ప్రయత్నించాము. కానీ జీవితానికి అవసరమైన వాటిని విస్మరించాం. మా మార్గాలు వేరని తెలుసుకున్నాం. అందుకే మా దారులలో వెళ్లేందుకు ఇద్దరం కలిసి ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈ క్లిష్ట సమయంలో మీరు మాకు అండగా ఉండండి. అలాగే మా ప్రైవసీకి భంగం కలిగించరని కోరుకుంటున్నాం.” అంటూ సుదీర్ఘ పోస్ట్ చేసింది దీప్తి సునయన.

బిగ్‏బాస్ షోలోకి రాకముందే షణ్ముఖ్ దీప్తి ప్రేమలో ఉన్నారు. కానీ బిగ్‏బాస్ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత షణ్ముఖ్ సిరితో ఎక్కువగా కనెక్ట్ అయ్యాడు. బిగ్‏బాస్ జర్నీలో వీరిద్దరి శ్రుతిమించిన ప్రవర్తన, హగ్గులు, ముద్దులు ప్రేక్షకులకు చిరాకు తెప్పించాయి. ఇరువురి కుటుంబసభ్యులు వచ్చి హగ్గులు తగ్గించండి అని చెప్పినా వారి ప్రవర్తనలో మార్పు రాలేదు. అలాగే ప్రతిసారి ఫ్రెండ్ షిప్ హగ్ అంటూ చెప్పడంతో వీరిద్దరిపై మరింత నెగిటివిటి పెరిగింది. ఇవే కాకుండా.. ప్రతిసారి సిరిని షణ్ముఖ్ కంట్రోల్ చేయడం.. ఆమె ఎవరితో మాట్లాడిన సహించలేకపోవడం.. చూపులతోనే సిరిని కంట్రోల్ చేయడం వంటివి షణ్ముఖ్ ఇమేజ్ ను భారీగా డ్యామేజ్ చేశాయి. దీంతో టైటిల్ రేసులో ముందంజలో ఉన్న షణ్ముఖ్ చివరిగా రన్నరప్ గా మిగిలాడు. కాగా బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే అనంతరం.. షణ్ముఖ్, దీప్తి విడిపోయారంటూ నెట్టింట్లో వార్తలు వైరల్ అయ్యాయి. ఈ విషయంపై షణ్ముఖ్ స్పందిస్తూ… ప్రస్తుతం దీప్తి తనపై అలిగి బ్లాక్ చేసిందని.. త్వరలోనే హైదారాబాద్ వెళ్లి కలుస్తానంటూ చెప్పుకొచ్చాడు. 

By
en-us Political News

  
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్,   విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  
 నామినేషన్ల ఉపసంహరణ గడువు  ముగిసే నాటికి  రాష్ట్ర వ్యాప్తంగా  77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.  ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు.  గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో   మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.