షాబాద్ ఆరు హత్యల కేసులో సంచలన విషయాలు..!
Publish Date:Jul 13, 2026
Advertisement
షాబాద్‌లో సంచలనం సృష్టించిన ఆరు హత్యల కేసులో ప్రధాన నిందితుడు రాజ్‌కుమార్‌కు సంబంధించిన కీలక విషయాలు దర్యాప్తులో ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం...ఈ హత్యలు ఆకస్మికంగా జరిగినవి కాకుండా ముందస్తు ప్రణాళికతో జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజ్‌కుమార్ వివాహితుడు. అతనికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే తన ఇంటి సమీపంలో నివసించే మైనర్ బాలికతో పరిచయం పెంచుకుని ఆమెను వేధించినట్లు ఆరోపణలు రావడంతో అతనిపై పోక్సో కేసు నమోదైంది. ఈ కేసు నమోదైన తర్వాత కుటుంబంలో విభేదాలు మరింత తీవ్రమయ్యాయి. భర్త ప్రవర్తనపై తీవ్ర అసంతృప్తికి గురైన భార్య సరిత, విడాకులు కావాలని ఒత్తిడి తీసుకువచ్చింది. భర్తతో కలిసి జీవించబోనని స్పష్టం వ్యక్తం చేసినట్లు సమా చారం. కుటుంబ సభ్యులు, ముఖ్యంగా రాజ్‌కుమార్ తండ్రి, భార్యాభర్తల మధ్య రాజీ కుదిర్చేందుకు అనేకసార్లు ప్రయత్నించినా పరిస్థితి మారలేదని దర్యాప్తులో వెల్లడైనట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో రాజ్‌కుమార్ ఆర్థికంగా కూడా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు సమాచారం. ఆన్‌లైన్ బెట్టింగ్‌లలో భారీగా డబ్బులు పోగొట్టుకోవడంతో అప్పులు పేరుకుపోయాయి. వాటిని తీర్చేందుకు ఎకరం భూమిని విక్రయించి సుమారు రూ.1.50 కోట్ల వరకు అప్పులు చెల్లించినట్లు తెలుస్తోంది. అయిన ప్పటికీ అతని ఆర్థిక పరిస్థితి పూర్తిగా గాడిలో పడలేదని అధికారులు భావిస్తున్నారు. పోక్సో కేసు నమోదవడం, భార్య విడాకులు కోరడం, ఆర్థిక సమస్యలు... ఈ మూడు అంశాలే అతడిలో తీవ్ర అసహనాన్ని పెంచాయని పోలీసులు అనుమా నిస్తున్నారు. తనపై కేసు పెట్టిన కుటుంబంపై పగ పెంచుకోవడంతో పాటు భార్యపై కూడా తీవ్ర ఆగ్రహంతో రగిలిపోయాడు. ఈ నేపథ్యంలోనే భార్య సరితను చంపేస్తానంటూ పలుమార్లు బెదిరించినట్లు కూడా విచారణలో బయటపడింది. హత్యలకు కొన్ని గంటల ముందు కూడా రాజ్‌కుమార్ సాధారణంగానే వ్యవహరించాడు. తన కుమారుడిని బయటకు తీసుకెళ్లి కొంతసేపు ఆడించాడు. అనంతరం ఇద్దరూ కలిసి హెయిర్ కటింగ్ చేయించుకున్నారు. ఆ తర్వాత ఇంటికి వెళ్లిన రాజ్‌కుమార్, తన ముందస్తు ప్రణాళిక ప్రకారమే భార్య, పిల్లలపై దాడి చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అక్కడితో ఆగకుండా, మైనర్ బాలిక కుటుంబ సభ్యులపై కూడా దాడి చేసి మొత్తం ఆరుగురిని హత్య చేయడంతో..ఈ ఘటన రాష్ట్రవ్యాప్తం గా సంచలనం రేపింది. ఈ ఘటనతో షాబాద్ ప్రాంతం ఒక్కసారి గా ఉలిక్కిపడింది. ముందస్తు బెయిల్ ఆర్డర్ కాపీలో కీలక విషయాలు..! ఇదిలా ఉండగా మరోవైపు రాజ్ కుమార్ ముందస్తు బెయిల్ ఆర్డర్ కాపీలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాజ్‌కుమార్‌కు గతంలో ముందస్తు బెయిల్ లభించింది. జూన్ 12న కోర్టు అతనికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఆ సందర్భంగా తనపై నమోదైన పోక్సో కేసు తప్పుడు కేసు అని, బాధితురాలి తండ్రి తన వద్ద అప్పు తీసుకుని, ఆ డబ్బు తిరిగి అడిగినందుకే కేసు పెట్టారని కోర్టులో వాదించినట్లు సమాచారం. ఫిర్యాదు నమోదైన రోజున తాను సంఘటన స్థలంలో లేనని, తన భార్యతో కలిసి ఆసు పత్రికి వెళ్లినట్లు కూడా అతని తరఫు న్యాయవా దులు వాదించినట్లు బెయిల్ ఆర్డర్‌లో పేర్కొ న్నట్లు తెలుస్తోంది. పోలీసుల చేతికి చిక్కింది ఎవరు..? ఇంకా మరో వైపు ప్రధాన నిందితుడు సూర్యాపేట జిల్లాలో పట్టుబడ్డాడంటూ ఆదివారం సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. కోదాడ సమీపంలోని ఓ బంజారా తండాకు చెందినా యువ కుడు రాజ్‌కుమార్‌ను పోలి ఉండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే విచారణ చేపట్టి, అతను రాజ్‌కుమార్ కాదని స్పష్టం చేశారు. దీంతో సోషల్ మీడియాలో ప్రచారమైన వార్తలు పుకార్లేనని తేలింది. ప్రస్తుతం ప్రధాన నిందితుడి కోసం ప్రత్యేక పోలీసు బృందాలు విస్తృ తంగా గాలిస్తున్నాయి. ఈ కేసుకు సంబంధించిన మరిన్ని కీలక విషయాలు దర్యాప్తు పూర్తయ్యే కొద్దీ వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు వెల్లడిస్తున్నారు. నిందితుడి కోసం పోలీసులు 14 ప్రత్యేక బృందాలతో ముమ్మర గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. హైదరాబాద్–బెంగళూరు జాతీయ రహదారిపై ఉన్న హోటళ్లు, లాడ్జీలు, దాబాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అలాగే బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలోని సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. నిందితుడి కుటుంబ సభ్యులు, సన్నిహితులను కూడా విచారిస్తున్నారు.ఇదిలా ఉండగా, చేగూరు రైల్వే ట్రాక్‌పై నిందితుడు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించి, చివరి క్షణంలో వెనక్కి తగ్గినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి రైల్వే ట్రాక్ సమీపంలో రాజ్‌కుమార్ సంచరించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
http://www.teluguone.com/news/content/shabad-six-murder-case-36-225856.html





