షాబాద్ ఆరు హత్యల కేసుపై హరీష్ రావు షాకింగ్ కామెంట్స్..!

Publish Date:Jul 13, 2026

Advertisement

 

షాబాద్‌లో సంచలనం సృష్టించిన ఆరు హత్యల కేసులో మాజీ మంత్రి హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుల తీరుపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాజ్‌కుమార్‌ను ముందుగానే అరెస్ట్ చేసి ఉంటే ఆరుగురు అమాయకుల ప్రాణాలు కాపాడేవారని ఆయన అన్నారు. సిద్దిపేట మీటింగ్ లో హరీష్ రావు మాట్లాడుతూ.. రాజ్‌కుమార్‌పై ఇప్పటికే పోక్సో కేసు నమోదైందని, అయినప్పటికీ అతడిని అరెస్ట్ చేయకుండా ఉద్దేశపూర్వకంగా వదిలేశారని ఆరోపించారు. 

రేవంత్ రెడ్డికి సన్నిహితుడైన ఓ మార్కెట్ కమిటీ చైర్మన్ రూ.20 లక్షలు లంచం తీసుకుని రాజ్‌కుమార్‌ను అరెస్ట్ కాకుండా కాపాడాడని ఆయన ఆరోపించారు. పోలీసులు సకాలంలో చర్యలు తీసుకోకుండా సుమారు 45 రోజుల పాటు నిందితుడిని స్వేచ్ఛగా తిరిగేలా చేశారని, ఆ సమయంలో అతడు కోర్టును ఆశ్రయించి బెయిల్ పొందాడని హరీష్ రావు అన్నారు. అనంతరం అదే వ్యక్తి ఆరుగురిని అత్యంత దారుణంగా హత్య చేశాడని ఆరోపించారు. ఈ ఘటనకు ప్రభుత్వ నిర్లక్ష్యం, పోలీసుల వైఫల్యమే కారణమని ఆయన విమర్శించారు.ఇంకా, సోషల్ మీడియా పోస్టులు చేసిన వారిపై పోలీసులు వెంటనే చర్యలు తీసుకుంటున్నారని, కానీ పోక్సో కేసులో నిందితుడైన రాజ్‌కుమార్ విషయంలో మాత్రం అదే వేగం కనిపించలేదని హరీష్ రావు విమర్శించారు. 

ఏపీలో వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్‌ను, నల్లబాలు అనే వ్యక్తిని సోషల్ మీడియా పోస్టుల కారణంగా అరెస్ట్ చేశారని, కానీ రాజ్‌కుమార్‌ను మాత్రం అరెస్ట్ చేయకుండా అతనితో పోలీసులు కూర్చొని మద్యం సేవించారని కూడా ఆయన ఆరోపించారు. షాబాద్‌లో జరిగిన ఈ ఆరు హత్యల ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిందని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో పూర్తి స్థాయి విచారణ జరిపి, నిందితుడికి సహకరించిన వారిపై కూడా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

By
en-us Political News

  
సోషల్ మీడియా ప్రపంచంలో ఏది ఎప్పుడు వైరల్ అవుతుందో ఎవ్వరూ ఊహించలేరు.
ఐఏఎస్, ఐపీఎస్‌ల ఫ్యాక్టరీగా మారిన నేతర్‌హాట్ బడి
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక సంచలన శకం ముగిసింది.
టీటీడీలోని వివిధ ట్రస్టులు, పథకాలకు విరాళాలు అందించే దాతలకు కల్పిస్తున్న ప్రివిలేజెస్‌లో పలు మార్పులు చేస్తున్నట్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు.
హెచ్‌ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బచ్చు రవీందర్ నివాసంలో సోదాలు ముగిశాయని ఏసీబీ డీఎస్పీ మజీద్ అలీఖాన్ వెల్లడించారు.
కన్న కొడుకు భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్న ఆ తల్లి గుండె, నేడు శోకసంద్రమై ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసింది.
ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం, తిరుపతి విమానాశ్రయాల తర్వాత ఇమిగ్రేషన్ చెక్ పోస్ట్ హోదా దక్కించుకున్న మూడవ విమానాశ్రయంగా భోగాపురం నిలిచింది. ఈ పరిణామం కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నుంచి ఈ ఎయిర్‌పోర్ట్ ఏరోడ్రోమ్ లైసెన్స్ పొందిన తర్వాత కొన్ని రోజులకే చోటుచేసుకోవడం గమనార్హం.
ప్రకాశం జిల్లా సింగరాయ కొండలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది.
నటుడు జూనియర్ ఎన్టీఆర్ పేరును ఉపయోగిస్తూ RAW NTR (రా-ఎన్టీఆర్) పేరుతో కొందరు ప్రైవేట్ వ్యక్తులు సంస్థను నిర్వహిస్తూ అది ఎన్టీఆర్ అధికారిక సంస్థ అన్నట్లుగా ప్రచారం చేస్తున్నారని ఆరోపణలు
తెలంగాణ విమానయాన రంగంలో సరికొత్త అధ్యాయం లిఖించబడబోతోంది.
రూ.2 లక్షల లంచంతో ఏఈ దొరికేశాడు..
సార్, ఒకసారి హగ్ చేసుకోవచ్చా.. యువ వైద్యుడి కోరిక తీర్చిన ముఖ్యమంత్రి విజయ్..!
ఏసీబీ డీఎస్పీ మజీద్ అలీ ఖాన్ ఆధ్వర్యంలో హైదరా బాద్‌తో పాటు మొత్తం 12 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. నానక్‌రామ్‌గూడ లోని సుమధుర అక్రోపోలిస్ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉన్న రవీందర్ ఇంటితో పాటు ఆయన కుటుంబ సభ్యులు, బంధువులకు సంబంధించిన పలు ప్రదేశా ల్లో అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.