ట్రంప్ దూకుడికి అమెరికా సెనేట్ కళ్లెం!

Publish Date:Jun 23, 2026

Advertisement

అంతర్జాతీయ వేదికపై ఇరాన్‌తో కయ్యానికి కాలు దువ్వుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు స్వదేశంలోనే ఊహించని  షాక్ తగిలింది. కాంగ్రెస్ ముందస్తు అనుమతి లేకుండా ఇరాన్‌పై ఎలాంటి ఏకపక్ష సైనిక చర్యలు చేపట్టడానికి వీల్లేదంటూ యూఎస్ సెనేట్  తీర్మానాన్ని ఆమోదించింది. ఇరాన్ సరిహద్దుల వద్ద మోహరించిన అమెరికా సాయుధ బలగాలను వెంటనే ఉపసంహరించుకోవాలని  స్పష్టం చేసింది. వైట్‌హౌస్ వర్గాల నుంచి వస్తున్న యుద్ధ సంకేతాలకు కళ్లెం వేసేలా అమెరికా పార్లమెంట్ ఎగువ సభ  సెనేట్ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది.

ఈ కీలక తీర్మానంపై సెనేట్‌లో ఉత్కంఠభరితంగా సాగిన ఓటింగ్ ప్రక్రియలో   తీర్మానానికి అనుకూలంగా 50 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 48 ఓట్లు  పడ్డాయి.  2 ఓట్ల స్వల్ప తేడాతో ట్రంప్ వైఖరిని తప్పుబడుతూ ఈ తీర్మానం ఆమోదం పొందింది.  అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, అధికార రిపబ్లికన్ పార్టీకి చెందిన నలుగురు కీలక సెనేటర్లు సొంత పార్టీ అధ్యక్షుడి నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. వారు విపక్ష డెమొక్రాట్లతో చేతులు కలిపి ఈ యుద్ధ నిరోధక తీర్మానానికి మద్దతుగా ఓటు వేయడం సంచలనంగా మారింది.

ఇప్పటికే అమెరికా దిగువ సభ  హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లోనూ ఇదే తరహా తీర్మానం భారీ మెజారిటీతో ఆమోదం పొందింది. అమెరికా రాజ్యాంగ నియమాల ప్రకారం ఉభయ సభల ఆమోదం లభించిన ఇటువంటి సంయుక్త తీర్మానాలకు అధ్యక్షుడి అధికారిక సంతకం అవసరం లేదు. సాంకేతికంగా, చట్టబద్ధంగా ఈ తీర్మానం ట్రంప్‌ను పూర్తిగా కట్టడి చేయలేకపోయినప్పటికీ, రాజకీయంగా ఆయనపై   నైతిక ఒత్తిడిని పెంచుతుందనడంలో సందేహం లేదు.  ఇరాన్‌తో ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చిన తర్వాత అమెరికా కాంగ్రెస్‌లోని రెండు సభలు ఏకతాటిపైకి వచ్చి ఇలాంటి తీర్మానాన్ని ఆమోదించడం ఇదే తొలిసారి కావడం విశేషం.  

By
en-us Political News

  
పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తాం..
హైదరాబాద్‌లో కల్తీ, నాసిరకం ఆహార ఉత్పత్తుల తయారీపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు.
ఈ నెల 22 వ తేదీ ఉదయం భూపాలపల్లి RTO ఆఫీస్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం లో మరణించిన జిల్లా రవాణా శాఖ అధికారి వెంకన్న మృతిపై విచారణ
తుంగభద్ర నుంచి మన రాష్ట్రానికి రావాల్సిన నికర వాటా జలాల వినియోగానికి
మహారాష్ట్ర రాజధాని, దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరాన్ని వరుణుడు వణికించాడు.
ఏపీలో మత్స్యకార కుటుంబాలకు ప్రజాప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ భరోసా ఇచ్చారు.
జొన్నగిరి గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టు ప్రారంభోత్సవ సభలో ముఖ్యమంత్రి..
బర్త్‌డే ప్లాన్ వెనుక దాగున్న భారీ కుట్ర..
డిగ్రీ లేకుండానే ఏఐతో అద్భుతాలు సృష్టిస్తున్న ఆయుష్ సింగ్..
తమిళనాడు సీఎం విజయ్ ఉదారత..
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతా నగరంలో ఒక ఘోరమైన ప్రమాదం చోటుచేసుకుంది.
చంచల్‌గూడ జైలు నుంచి బాల్క సుమన్ విడుదల
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి విమర్శల పర్వం ఊపందుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.