ముగిసిన మాజీ మంత్రి అప్పలరాజు పోలీసు కస్టడీ.!

Publish Date:Aug 5, 2026

Advertisement

గొర్రెల కాపరి దానయ్య మృతి కేసులో  అరెస్టై రిమాండ్ లో ఉన్న వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును కోర్టు అనుమతిపై  మంగళవారం (ఆగస్టు 4) ఒక రోజు కస్టడీకి తీసుకున్న పోలీసులు కస్టడీ గడువు ముగియడంతో అదే రోజు సాయంతరం  అంపోలు జైలుకు తిరిగి తరలించారు. సీదిరి అప్పలరాజు కుమారుడు నిర్లక్ష్యంగా బైక్ నడిపి గొర్రెల కాపరి దానయ్య మృతికి కారకుడైన కేసులో సాక్ష్యాలను తారుమారు చేయడానికీ, పోలీసులను తప్పుదోవపట్టించడానికి ప్రయత్నించారంటూ సీదిరి అప్పలరాజు  ఈ కేసులో పోలీసులు ఏ3గా నిందితుడి అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.   

రిమాండ్ లో ఉన్న అప్పలరాజును కోర్టు  ఒకరోజు పోలీస్ కస్టడీకి అనుమతించింది. దీంతో   శ్రీకాకుళం జిల్లా అంపోలు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న అప్పలరాజును మంగళవారం (ఆగస్టు 4)  కట్టుదిట్టమైన భద్రత నడుమ కాశీబుగ్గ స్టేషన్‌కు తరలించి  నాలుగు గంటల పాటు విచారించారు.     దానయ్య   మృతికి దారితీసిన రోడ్డు ప్రమాద  ఘటన ఎప్పుడు జరిగింది,

ప్రమాదం జరిగిన సమయంలో అప్పలరాజు ఎక్కడ ఉన్నారు, ఘటన స్థలానికి ఆయన ఎంత సమయానికి చేరుకున్నారు తదితర అంశాలపై పోలీసులు ఆయనను ప్రశ్నించినట్లు తెలిసింది.  కోర్టు విధించిన 1 రోజు పోలీస్ కస్టడీ గడువు  పూర్తి కావడంతో, పోలీసులు   ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి,  పోలీసు బందోబస్తు మధ్య తిరిగి  అంపోలు జైలుకు తరలించారు.  

Seediri Appalaraju, Kasibugga Police Station, Danayya death case, Police custody, Ampolu Jail Srikakulam,  former minister

By
en-us Political News

  
నల్లమలలో సోదాలు.. కౌకూర్‌, యాప్రాల్‌, అచ్చంపేటలో ఆయుధాల కోసం గాలింపు..!
హైదరాబాద్ గచ్చిబౌలి అంజయ్యనగర్‌లోని హరిహర మెన్ హాస్టల్‌లో దారుణ హత్య చోటుచేసుకుంది. తోటి పనివాడు ప్రమోద్ జరిపిన కత్తిపోట్లకు కుక్ శశిధర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.
ఢిల్లీ ఎర్రకోట బాంబు పేలుడు కేసులో ఎన్ఐఏ సంచలన చార్జ్‌షీట్ దాఖలు చేసింది. 11 మంది ప్రాణాలు తీసిన ఈ ఘటన వెనుక లాల్ మందిర్ దాడి కుట్ర, మూత్రం నుంచి బాంబు తయారీ, 12 సార్లు రెక్కీ నిర్వహించిన విస్తుపోయే వివరాలు వెలుగులోకి వచ్చాయి.
అమెరికాలోని పెన్సిల్వేనియా ల్యాంకాస్టర్ కౌంటీలో ఎఫ్రాతా పోలీసులు చేపట్టిన కీలక అరెస్ట్ వివరాలు. క్రైమ్‌వాచ్ నిఘా మరియు తాజా క్రైమ్ అప్‌డేట్స్ కోసం చదవండి.
ఒడిశా కోరాపుట్ పరిధిలోని బాలిపేట సేవాశ్రమం హాస్టల్‌లో 9వ తరగతి విద్యార్థి సీయారా తాడింగిపై సహవిద్యార్థి తీవ్రంగా దాడి చేశాడు. మత్తు పదార్థాల ప్రభావంతోనే ఈ దాడి జరిగిందని, ర్యాగింగ్ అనుమానాలు ఉన్నాయని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
ఆయుధాలు చోరీ అయ్యాయి అంటూ సీన్ క్రియేట్ చేసిన ఇంటి దొంగలు..!
లండన్ వీసాలు, ఉద్యోగాల పేరిట మోసాల ఆరోపణలతో యూట్యూబర్ నందూస్ వరల్డ్ నందనను విజయవాడ పోలీసులు 4 గంటల పాటు విచారించారు. బిగ్ బాస్ తెలుగు 10 ఎంట్రీ ప్రచారం, రూ. 15 లక్షల ఫిర్యాదు మరియు పోలీసులకు ఆమె ఇచ్చిన షాకింగ్ స్టేట్‌మెంట్ పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
సంగారెడ్డి జిల్లా కంది మండలంలో అక్రమ ఇసుక దందాపై మైనింగ్, రెవెన్యూ, పోలీస్ అధికారులు సంయుక్త దాడులు నిర్వహించారు. ఎర్ధనూర్ సర్వే నెంబర్ 134లోని నక్క వాగు పరివాహక ప్రాంతంలో ఉన్న 6 ఇసుక ఫిల్టర్లను ధ్వంసం చేశారు. వాల్టా చట్టం ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు పెడతామని అధికారులు హెచ్చరించారు.
లండన్ ఉద్యోగాలు, వీసా రెన్యువల్స్ పేరిట రూ.15 లక్షల మోసానికి పాల్పడిన ఆరోపణలపై నందూస్ వరల్డ్ యూట్యూబర్ నందనను శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఇబ్రహీంపట్నం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు వివరాలు మరియు సీఐ సుబ్రహ్మణ్యం అందించిన పూర్తి సమాచారం ఇక్కడ చదవండి!
ఉత్తరప్రదేశ్ ఝాన్సీలోని పహుజ్ డ్యామ్ వద్ద సోషల్ మీడియా రీల్ కోసం 30 అడుగుల ఎత్తు నుంచి నీటిలోకి దూకిన యువకుడి రెండు కాళ్లు విరిగిపోయాయి. వైరల్ స్టంట్ వికటించిన పూర్తి వివరాలు మరియు వీడియో కథనం ఇక్కడ చదవండి.
సోషల్ మీడియాలో ఓ మహిళా ప్రజాప్రతినిధిని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ కానిస్టేబుల్‌పై సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేష్ సస్పెన్షన్ వేటు వేశారు.
కృష్ణాష్టమి 2026 సందర్భంగా భారతదేశంలో తప్పక సందర్శించాల్సిన మథుర, బృందావనం, ద్వారక, గురువాయూర్ మరియు పూరీ జగన్నాథ ఆలయాల విశేషాలు మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను ఇక్కడ తెలుసుకోండి.
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు 2026 అక్టోబర్ 12 నుండి 21 వరకు జరగనున్నాయి. గరుడ సేవ, రథోత్సవం, చక్రస్నానం మరియు వాహన సేవల సంపూర్ణ షెడ్యూల్ ఇక్కడ తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.