111 జీవో రద్దు వెనక రహస్యం ఏమిటి ?

Publish Date:May 19, 2023

Advertisement

తెలంగాణ రాష్ట్రం  దశాబ్ది ఉత్సవాలకు సిద్దమవుతోంది.   రాష్ట్ర వ్యాప్తంగా దశాబ్ది ఉత్సవాలను  అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో 21 రోజులపాటు  నిర్వహించాలని రాష్ట్ర మంత్రి వర్గం నిర్ణయించింది. నూతనంగా నిర్మించిన బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన  జరిగిన తొలి మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రజల భాగస్వామ్యంతో.. ప్రజల మధ్య చేపట్టే ఈ ఉత్సవాల్లో గ్రామ, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో ఏయే రోజుల్లో ఏయే కార్యక్రమాలు చేపట్టాలన్నదీ మంత్రి వర్గ సమావేశంలో చర్చించి ఖరారు చేశామని మంత్రి హరీష్ రావు మీడియాకు తెలిపారు.  

ఈ సమావేశంలో, మరి కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు.  అయితే  నూతన సచివాలయంలో జరిగిన తొలి మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న ఇతర నిర్ణయాలు అన్నీ ఒకెత్తు అయితే, జీవో 111 పూర్తిగా రద్దు చేస్తూ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం ఒక్కటీ ఒకెత్తుగా రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. అలాగే  ప్రతిపక్ష పార్టీలు జీవో 111 రద్దు వెనక కుట్ర ఉందని ఆరోపిస్తున్నాయి. ముఖ్యంగా ముఖ్యంత్రి కుటుంబ సభ్యుల ప్రయోజనాలను కాపాడేందుకే రాష్ట్ర ప్రభుత్వం జీవో 111 రద్దు నిర్ణయం తీసుకుందని  కాంగ్రెస్, బీజేపీ సహా ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. 

ఆప్రాంతంలో ముఖ్యమంత్రి కుటుంబానికి ఉన్న వేలాది ఎకరాల  పంట భూములను రియల్ ఎస్టేట్ భూములుగా మార్చేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని సీఎల్పీ నేత  భట్టివిక్రమార్క ఆరోపించారు. అంతే కాదు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చట్టవిరుద్ధం, సుప్రీం కోర్టు మార్గదర్శకాలకు విరుద్ధమని  పేర్కొన్నారు. హిమయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ వంటి సహజ జలవనరులపై ప్రాభవం చూపే ఏ నిర్ణయం తీసుకోరాదని సుప్రీం కోర్టు స్పష్టమైన మార్గదర్శకాలను నిర్దేశించిందని భట్టి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ప్రస్తావించిన ప్రత్యామ్నాయ జలవనరులు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులని అంటూ సహజ జలవనరులను కాపాడవలసిన ప్రభుత్వమే కంచే చేను మేసిన చందంగా  111 జీవో రద్దు చేసిందని భట్టి ఆరోపించారు.

మరోవంక బీజేపీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ ప్రభాకర్ లక్షలాది ఎకరాల భూములపై ప్రభుత్వం కన్ను పడిందని ఆరోపించారు. మంత్రి కేటీఆర్ ఫార్మ్ హౌస్ తో పాటుగా ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు, అధికార పార్టీ  నాయకులు, మంత్రుల భూములను రియల్ ఎస్టేట్ గా మార్చేందుకే ప్రభుత్వం 111జీవో రద్దు చేసిందని ప్రభాకర్ ఆరోపించారు. కాగా,  84 గ్రామాల ప్రజల అభ్యర్థన మేరకు.. ఆ జీవోను పూర్తిగా ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నమని ప్రభుత్వం చెప్పడం పచ్చిఅబద్ధమని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ ఆరోపించారు. ఆ ప్రాంతంలో లక్షల ఎకరాల భూములు అసలు యజమానుల స్వాధీనంలో లేవని ఎప్పుడోనే చేతులు మారాయని దయాకర్ అన్నారు. 

అదలా ఉంటే జంట జలాశయాల వెంబడి 111 జీవో ఎత్తివేత ద్వారా రూ.5-6 వేల కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోందని, అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. 111 జీవో పరిధిలో ఉన్న వ్యవసాయ భూములను నివాస, నివాసేతర భూములుగా మార్చడం ద్వారా ఈ ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. 111 జీవో పరిధిలో ఉన్న 84 గ్రామాల్లో ప్రభుత్వ భూములు పోను సుమారు లక్ష ఎకరాల ప్రైవేటు భూములు ఉంటాయని ప్రభుత్వం అంచనా వేసింది. అన్నీ వ్యవసాయ భూములుగానే రికార్డుల్లో ఉన్నాయి. ఇక్కడ ఒక ఎకరం వ్యవసాయ భూమిని రికార్డుల్లో ఇతర అవసరాలకు ఉద్దేశించిన భూమిగా మార్చాలంటే ప్రభుత్వానికి రూ.12 లక్షలు కట్టాలి. 50 వేల ఎకరాలు కన్వర్షన్‌కు వచ్చినా ఏకరాకు రూ.12 లక్షల చొప్పున మొత్తం ప్రభుత్వానికి రూ.6 వేల కోట్లు వస్తాయని గురువారం కేబినెట్‌ సమావేశంలో చర్చ జరిగినట్లు సమాచారం. అయితే అదే సమయంలో ఈ జీవో రద్దు న్యాయ సమీక్షకు నిలుస్తుందా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. 

111 జీవోను పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం తరువాత వచ్చే న్యాయపరమైన చిక్కులపై సరైన కసరత్తు చేసినట్లుగా కనిపించడం లేదు. సుప్రీంకోర్టు ఆదేశానుసారంగానే జంట జలాశయాల పరిధిలో 111 జీవో అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ జీవోను రాష్ట్రమంత్రివర్గం పూర్తిగా రద్దు చేయడంతో భవిష్యత్తులో న్యాయపరమైన చిక్కులు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. 111 జీవోకు సంబంధించి ఎన్జీటీతో పాటు పలు కోర్టుల్లో వివాదాలు నడుస్తున్నాయి. జీవో సవరించాలంటూ కొందరు గ్రీన్‌ ట్రిబ్యూనల్‌, హైకోర్టులో వేసిన కేసులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. గ్రీన్‌ ట్రైబ్యునల్‌ ఆదేశాల మేరకు జీవో సవరణకు సంబంధించి ఉన్నత స్థాయి కమిటీ కూడా వేశారు. దాని నివేదిక రాలేదు. దానిపై హైకోర్టు కూడా ఆరా తీసింది. జీవోకు తూట్లు పొడుస్తున్నారంటూ 2000లో కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇందులో సుప్రీంకోర్టు ప్రభుత్వానికి అక్షింతలు వేసింది. మరింత పకడ్భందీగా అమలు చేయాలని ఆదేశించింది. ఈ నేపద్యంలో  111 జీవో  రద్దు న్యాయసమీక్షకు ఎంతవరకు నిలుస్తుంది అనేది చెప్పలేంని అంటున్నారు.

By
en-us Political News

  
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
 బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై  చార్జ్‌షీట్‌  విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్  ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు.  తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే..  మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి  సొంత నియోజకవర్గానికే  ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.  
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో  గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన  బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది.  పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న  నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి. 
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.
ఇండియా కూటమి తరఫున రాహుల్ గాంధీనే ప్రధానమంత్రి అభ్యర్థి అని కుండబద్దలు కొట్టారు. ఆ విషయాన్నే తమిళనాడు కాంగ్రెస్ శాసనసభాపక్ష  నాయకురాలు తారాహై కత్‌బర్ట్  మరింత క్లారిటీ ఇస్తూ.. విజయ్ ప్రధాని అవుతారంటూ కొందరు ప్రచారం చేయడం కేవలం టీవీకే శ్రేణుల ఉత్సాహం వల్ల జరుగుతున్న ప్రచారమే తప్ప, అది ఆ పార్టీ అధికారిక వైఖరి కాదన్నారు.
రాజకీయ క్షేత్రంలో ముందస్తు ఊహాగానాలు, భవిష్యత్ ఎన్నికల అంచనాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే సాగుతుంటాయి. ఈ నేపథ్యంలో సపోజ్ ఫర్ సపోజ్  ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందన్న చర్చ జోరందుకుంది. రానున్న  రాజకీయ సమీకరణాలపై   చర్చోపచర్చలు మొదలయ్యాయి.
కొండా సురేఖపై వేటు తప్పదనీ, ఆమెకు క్యాబినెట్ నుంచి ఉద్వాసన తప్పదన్న ప్రచారం జోరుగా సాధింది. ఒక దశలో రేవంత్ కేబినెట్ లోకి సురేఖ స్థానంలో మరో ఫైర్ బ్రాండ్ నాయకురాలు విజయశాంతిని తీసుకోనున్నట్లు కూడా వార్తలు వినిపించాయి. 
 ప్రభుత్వ మద్దతుతో జరిగే ఏకగ్రీవ ఎన్నికలు ఉంటాయన్న ఆయన రాజకీయ పార్టీ కోణంలో ఏకగ్రీవాలు ఉండకూడదని జగన్ అన్నారంటూ బొత్స  వివరణపై వైసీపీ నేతలు పెదవి విరుస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.