కమలంలో కర్ణాటక గుబులు

Publish Date:May 19, 2023

Advertisement

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తెలంగాణ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయి? రాష్ట్ర రాజకీయ సమీకరణాలు మారిపోతాయా? ఇంతవరకు ఒక లెక్క ఇకపై మరో లెక్కన రాజకీయ ముఖ చిత్రమే మారి పోతుందా? అంటే  పరిశీలకులు ఇలాంటి ప్రశ్నలకు ఇప్పిటికిప్పుడు సమాధానం చెప్పడం కొంత సాహసమే  అంటున్నారు. 

అయితే  బీఆర్ఎస్ మొదలు బీజేపీ వరకు ప్రధాన రాజకీయ పార్టీలలో కర్ణాటక ఎన్నికల ఫలితాలపై విభిన్న కోణాల్లో చర్చ అయితే జరుగుతోంది. కర్ణాటకలో అనూహ్య విజయం సొంతం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు తెలంగాణలోనూ హస్తం పార్టీదే గెలుపని ధీమా వ్యక్తపరుస్తున్నాయి. మరో వంక అధికార బీఆర్ఎస్  నాయకులు,కర్ణాటక కర్ణాటకే తెలంగాణ తెలంగాణే  అంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ.. ముచ్చటగా మూడవ సారి మళ్ళీ తమదే విజయమని   ధీమా  వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సర్వేలనీ తమకే అనుకూలంగా ఉన్నాయని, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా 100 నుంచి 105 నియోజక వర్గాల్లో కారు జోరుకు తిరుగుండదని పార్టీ వేదిక నుంచి ప్రకటించారు. 

అలాగే కర్ణాటకలో అధికారం కోల్పోయిన బీజేపీ నాయకులు కూడా తెలంగాణలో మాత్రం అధికారం తమదేనని అంటున్నారు. అయితే ఆరేడు నెలల తర్వాత జరిగే ఎన్నికల ఫలితాల సంగతి ఎలా ఉన్నా, కర్ణాటక ఓటమి తర్వాత తెలంగాణ బీజేపీలో అసమ్మతి రాగాలు అధికమయ్యాయి. నిజానికి బీజేపీలో అంతర్గత కలహాలు కొత్తకాదు. ముఖ్యంగా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ వ్యవహార సరళి విషయంలో పార్టీ నాయకులలో చాలా కాలంగా అసమ్మతి వ్యక్తమవుతూనే వుంది.అవును, ఇతర పార్టీల నుంచి వచ్చిన (బయటి) నాయకులే  కాదు, ఒరిజినల్ బీజేపీ నేతల్లోనూ బండి నాయకత్వాన్ని వ్యతిరకించే నేతలు లేక పోలేదు. అయితే ఇంతకాలం అసంతృప్తి గరళాన్ని గొంతులో దాచుకుని గుంభనంగా ఉన్న నాయకులు, ఇప్పుడు కర్ణాటక ఫలితాల తరువాత అసమ్మతి గళం విప్పుతున్నారు.  

ముఖ్యంగా మాజీ మంత్రి హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మరీ బీజేపీలో చేరిన మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటి రెడ్డి వెంకట రెడ్డి మరొ కొందరు  ‘బయటి’ నాయకులు బీజేపీలో కొనసాగే విషయంలో పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. నిజానికి బీజేపీలో ‘బయటి’ నేతలకు ప్రాధాన్యత ఉండదని, అందుకే బీజేపీలో ‘బయటి’ నేతలు అట్టే కాలం నిలవ లేరని అంటారు. అందుకే ఈటల, కోమటిరెడ్డితో పాటుగా మరికొందరు ముఖ్యనేతలు కాంగ్రెస్ వైపు చుస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. 

నిజానికి బీజేపీ ఎమ్మెల్యేలు ముగ్గురిలో ఏ ఒక్కరూ ఒరిజినల్  బీజేపీ నాయకులు కాదు. గోషామహల్ ఎమ్మెల్యే టీడీపీ నుంచి బీజేపీలోకి వచ్చారు, అయన మళ్ళీ టీడీపీలోకి వెళుతున్నారని ఇటీవల ప్రచారం జరిగింది. అయితే, ఆయన బీజేపీ తనపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేసినా, వేయక పోయినా, టికెట్ ఇచ్చినా ఇవ్వక పోయినా కాషాయా ధ్వజం వదిలేది లేదని స్పష్తం చేశారు.  దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన రావు బీఆర్ఎస్ నుంచి బీజేపీ లోకి వచ్చారు, ఆయన కూడా పార్టీ మారుతున్నారని ప్రచారం జరిగినా, ఆయన ఆ వార్తలను ఖండించడమే కాకుండా, పార్టీ ఆదేశిస్తే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు..ఎవరిపై   పోటీ చేసందుకు సిద్దమని ప్రకటించారు. తాజాగా  ఈటల రాజేందర్ విషయంలోనూ అలాంటి వదంతులే షికారు చేస్తున్నాయి. అయితే ఢిల్లీ నుంచి వచ్చిన రాజేందర్ ఆ వదంతులను ఖండించారు. అయినా ఆ ప్రచారం అయితే అలానే సాగుతోంది.   ఏది ఏమైనా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రభావం అరు నెలల తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికలపై ఏ విధంగా ఉంటుందనేది ఇప్పుడే ఉహించడం కొంచెం చాలా కష్టమనే రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

By
en-us Political News

  
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
 బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై  చార్జ్‌షీట్‌  విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్  ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు.  తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే..  మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి  సొంత నియోజకవర్గానికే  ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.  
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో  గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన  బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది.  పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న  నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి. 
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.
ఇండియా కూటమి తరఫున రాహుల్ గాంధీనే ప్రధానమంత్రి అభ్యర్థి అని కుండబద్దలు కొట్టారు. ఆ విషయాన్నే తమిళనాడు కాంగ్రెస్ శాసనసభాపక్ష  నాయకురాలు తారాహై కత్‌బర్ట్  మరింత క్లారిటీ ఇస్తూ.. విజయ్ ప్రధాని అవుతారంటూ కొందరు ప్రచారం చేయడం కేవలం టీవీకే శ్రేణుల ఉత్సాహం వల్ల జరుగుతున్న ప్రచారమే తప్ప, అది ఆ పార్టీ అధికారిక వైఖరి కాదన్నారు.
రాజకీయ క్షేత్రంలో ముందస్తు ఊహాగానాలు, భవిష్యత్ ఎన్నికల అంచనాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే సాగుతుంటాయి. ఈ నేపథ్యంలో సపోజ్ ఫర్ సపోజ్  ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందన్న చర్చ జోరందుకుంది. రానున్న  రాజకీయ సమీకరణాలపై   చర్చోపచర్చలు మొదలయ్యాయి.
కొండా సురేఖపై వేటు తప్పదనీ, ఆమెకు క్యాబినెట్ నుంచి ఉద్వాసన తప్పదన్న ప్రచారం జోరుగా సాధింది. ఒక దశలో రేవంత్ కేబినెట్ లోకి సురేఖ స్థానంలో మరో ఫైర్ బ్రాండ్ నాయకురాలు విజయశాంతిని తీసుకోనున్నట్లు కూడా వార్తలు వినిపించాయి. 
 ప్రభుత్వ మద్దతుతో జరిగే ఏకగ్రీవ ఎన్నికలు ఉంటాయన్న ఆయన రాజకీయ పార్టీ కోణంలో ఏకగ్రీవాలు ఉండకూడదని జగన్ అన్నారంటూ బొత్స  వివరణపై వైసీపీ నేతలు పెదవి విరుస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.