హాస్య నటుడు అలీకీ ట్రాజడీయేనా.. జగన్ చెప్పిన తీపి కబురు రాజ్యసభ సీటు కాదా?

Publish Date:May 4, 2022

Advertisement

హాస్య నటుడు అలీకి జగన్ హామీ ఇచ్చిన తీపి కబురు అందడం లేదా? ఆశించినట్లుగా రాజ్యసభకు అలీకి అవకాశం ఇవ్వడం లేదా? జరుగుతున్న పరిణామాలను గమనిస్తే అలీకి జగన్ హ్యాండిచ్చారనే అర్ధమౌతుంది.  ఏపీలో నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలకు జరగనున్నాయి. సంఖ్యా బలాన్ని బట్టి ఆ నాలుగూ కూడా వైసీపీ ఖాతాలోనే పడతాయి. జగన్ అలీని రాజ్యసభకు పంపుతారని హామీ ఇచ్చారనీ, అందుకే సినీ పరిశ్రమలో తనకు అత్యంత సన్నిహితుడైన పవన్ కల్యాణ్ ను కూడా కాదని అలీ వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారనీ ఒక ప్రచారం ఉంది. అంతే కాకుండా జగన్ ఇటీవల స్వయంగా అలీని తిరుపతికి పిలిపించుకుని మరీ  త్వరలో శుభ వార్త వింటారని చెప్పారనీ కూడా అంటున్నారు. ఆ శుభ వార్త రాజ్యసభ టిక్కెట్టేనని అలీతో సహా అంతా భావించారు. మరి అంతలోనే ఏమైందో రాజ్యసభ టికెట్ల అభ్యర్థుల ఎంపికలో అలీ పేరు కనీసం పరిశీలనకు కూడా రాలేదంటున్నారు. ఇక ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డికి రెన్యువల్ చేసే పరిస్థితే లేదని పార్టీ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి. దీంతో రాజ్యసభకు జగన్ ముగ్గురు అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంటుంది. జగన్ కేసులు వాదించే న్యాయవాది నిరంజన్ రెడ్డిని రాజ్యసభకు పంపించే యోచనలో జగన్ ఉన్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అంటే మరో రెండు రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. ఆ రెండు స్థానాలలో ఒకటి ఎస్సీలకు కేటాయించాలని జగన్ భావిస్తున్నారు. ఆ కోటాలో డొక్కా మాణిక్యవరప్రసాద్, బీరం మస్తానరావుల పేర్లు పరిశీలనలో ఉన్నాయంటున్నారు. మరో స్థానాన్ని కమ్మ సామాజిక వర్గానికి కేటాయించి, విస్తరణలో ఆ వర్గానికి మొండి చేయి చూపి ఎదుర్కొన్న విమర్శల నుంచి బయటపడాలని జగన్ భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో జగన్ నటుడు అలీ రాజ్యసభ ఆశలు గల్లంతైనట్లేనని అంటున్నారు. జగన్ ను నమ్ముకుని పార్టీలో చేరిన అలీకి ఇది రెండో ఆశాభంగంగా చెప్పుకోవచ్చు. మొదటిది 2019 ఎన్నికలలో అలీకి రాజమండ్రి, మంగళగిరిలలో ఏదో స్థానం నుంచి అసెంబ్లీకి పోటీ చేసే అవకాశం ఇస్తానని జగన్ హామీ ఇచ్చారని చెబుతున్నారు. ఆ ఆహామీ కారణంగానే అప్పట్లో జనసేనలో చేరుదామని భావించిన అలీ మనసు మార్చుకుని వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారంటారు. అలీ, పవన్ కల్యాణ్ మంచి స్నేహితులన్న విషయం సినీ పరిశ్రమ మొత్తానికి తెలుసు. అలాంటిది అలీ వైసీపీ తీర్ధం పుచ్చుకోవడంతో ఇరువురి మధ్యా స్నేహం కూడా చెడింది. పవన్ కల్యాణ్ అలీ వైసీపీలో చేరడాన్ని ప్రస్తావిస్తూ, సాయం పొందిన వ్యక్తులు కూడా ఇలా చేస్తారంటూ వ్యాఖ్యానించారు. అందుకు ప్రతిగా అలీ కూడా ఏం సాయం చేశారు పవన్ కల్యాణ్ గారూ, ఎవరికైనా చెప్పి సినిమా అవకాశాలు ఇప్పించారా? డబ్బు సాయం ఏమైనా చేశారా అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించిన విషయం కూడా తెలిసిందే. 
 
అప్పట్లో అసెంబ్లీ సీటు విషయంలో మాటతప్పిన జగన్ ఇప్పుడు రాజ్యసభ టికెట్ విషయంలో మడమ తిప్పడంతో జగన్ ను నమ్ముకున్న అలీకి రెండు సార్లూ నిరాశ ఎదురైనట్లయ్యింది. రాజ్యసభ రేసులో ఎంటరౌతూనే ఔటైపోయిన అలీ ఎలా స్పందిస్తారన్నది చూడాలి.

By
en-us Political News

  
మనీశ్ సిసోడియా సవాల్ ను స్వీకరించిన కాంగ్రెస్, బిజెపి, శిరోమణి అకాలీదళ్ పార్టీలు పంజాబ్‌లో ఆప్ పాలనలో గత నాలుగున్నరేళ్లలో కనీసం 6 ప్రధాన పోటీ పరీక్షల్లో అక్రమాలు, లీకేజీలు జరిగాయని ఆధారాలతో సహా వెల్లడించారు.
ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ నేతల మధ్య వాగ్బాణాలు పతాక స్థాయికి చేరాయి.
తాజాగా బోండా ఉమ.. గుంటూరులో జరిగిన కాపు ఉద్యమ నేత, దివంగత ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభకు హాజరై వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబుతో వేదిక పంచుకోవడం, ఆ వేదికపై నుంచి బోండా ఉమ చేసిన వ్యాఖ్యలు.. ఆ అనుమానాలకు మరింత బలం చేకూర్చాయి
కాక్రోచ్ ఉద్యమం ప్రారంభం అయిన నాటి నుంచీ ధర్మేంద్ర ప్రధాన్ ను వెనకేసుకుంటూ వచ్చిన మోడీ చివరకు దిగిరాక తప్పని పరిస్థితి ఏర్పడటమే ఇందుకు కారణం. అందులోనూ ధర్మేంద్ర ప్రధాన్ స్వయంగా విద్యార్థి నాయకుడు. విద్యార్థి నాయకుడి నుంచి రాజకీయ వేత్తగా అక్కడ నుంచి విద్యాశాఖ మంత్రిగా ఎదిగారు.
వైసీపీ హయాంలో పర్యాటక, సాంస్కృతిక, యువజన సంక్షేమం, క్రీడా శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన సంగతి విదితమే.. ఆ సమయంలో రాష్ట్రవ్యాప్తంగా ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా క్రీడా పరికరాల కొనుగోల విషయంలో భారీ స్థాయిలో అక్రమాలు, నిధుల మళ్లింపు జరిగాయన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ తరువాత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధకారంలోకి వచ్చాకా, ఆడుదాం ఆంధ్ర అక్రమాలపై వివిధ పోలీస్ స్టేషన్లలో పెద్ద ఎత్తున ఫిర్యాదులు నమోదయ్యాయి.
అంబటితో వేదిక పంచుకోవడంపై కలకలం..! కాపు ఉద్యమంపై కీలక వ్యాఖ్యలు..!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ స్పందించారు.   ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.  ఈ మేరకు సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ ద్వారా ఆమె స్పీడీ రికవరీ ఆకాంక్షిస్తూ పోస్టు షేర్ చేశారు. రాజకీయంగా, సిద్ధాంతపరంగా విభేదాలు పక్కన పెట్టి ప్రజాస్వామ్య విలువలను  పాటించారు.
కర్ణాటక రాజకీయాల్లో అత్యంత సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సంచలన నిర్ణయం తీసుకున్నారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల అపాయింట్‌మెంట్ కోసం సాగిస్తున్న ప్రయత్నాలు
అయితే 2014 ఎన్నికలలో పార్టీ ఘోర పరాజయానికి ఫైర్ బ్రాండ్ నేతల నోటి దురుసు కూడా ఒక ప్రధాన కారణం అయ్యిందని అప్పట్లోనే పరిశీలకులు విశ్లేషించారు. అయితే పరాజయం తరువాత కూడా వైసీపీ తీర మారలేదు. అప్పట్లో నోరున్నది దూషించడానికే అన్నట్లుగా వ్యవహరించిన కొడాలి నాని వంటి వారు ఓటమి తరువాత సైలెంట్ అయిపోయినా.. వారి స్థానంలోకి అంబటి రాంబాబు, పేర్ని నాని వంటి వారు వచ్చి చేరారు.
ఇటీవల కాలంలో ముగ్గురుర వైసీపీ నేతలపై నమోదైన మూడు కేసుల్లో ఆ నేతలు వ్యవహరిస్తున్న తీరు, వారికి పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి మద్దతు విమర్శలకు గురౌతోంది. పూర్తిగా కుటుంబ వివాదాలు, ప్రత్యక్షంగా వారు పాల్పడిన అక్రమాలకు సంబంధించిన ఆధారాలతో నమోదైన కేసులను కూడా రాజకీయ వేధింపులంటూ  వారు మాట్లాడుతున్న మాటలు, చేస్తున్న వ్యాఖ్యలు విస్తుగొలుపుతున్నాయి.
ప్రభుత్వ బాకాలుగా వ్యవహరిస్తున్న మరికొన్ని మీడియా సంస్థల విలేకరులపై కూడా జంతర్ మంతర్ వద్ద నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రదర్శనకారులపై పోలీసుల దాష్టీకాన్నీ, తమ ఆందోళనలపై కేంద్రం అనుసరిస్తున్నఅణచివేతనూ ప్రస్తావించకుండా కేంద్ర ప్రభుత్వ అనుకూలతకే ప్రాధాన్యం ఇవ్వడంతోనే ప్రధాన స్రవంతి మీడియా ప్రజాగ్రహానికి గురౌతోందని చెబుతున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేసిన ఈ వీడియో సందేశంపై ప్రముఖ నటుడు, సామాజిక విమర్శకుడు ప్రకాశ్ రాజ్ ప్రధాని ముఖంలో భయం ప్రస్ఫుటంగా కనిపించిందంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.