Publish Date:Jul 24, 2026
కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఆందోళన మోడీలో భయాన్ని పెంచుతోందా? పరీక్షల ప్రక్రియలో పారదర్శకత పెంచేందుకు, అక్రమార్కులపై ఉక్కుపాదం మోపేందుకు ప్రస్తుతం ఉన్న చట్టాలను మరింత కఠినతరం చేస్తామంటూ గురువారం (జులై 24) అర్ధరాత్రి మోడీ విడుదల చేసిన వీడియోలో.. ఆయన ముఖంలో భయం స్పష్టంగా కనిపించిందా? అంటే ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ ఔననే అంటున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేసిన ఈ వీడియో సందేశంపై ప్రముఖ నటుడు, సామాజిక విమర్శకుడు ప్రకాశ్ రాజ్ ప్రధాని ముఖంలో భయం ప్రస్ఫుటంగా కనిపించిందంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ప్రధాని వీడియో సందేశాన్ని రీపోస్టు చేస్తూ.. ప్రకాశ్ రాజ్. తాను ప్రధాని ముఖంలో భయాన్ని స్పష్టంగా చూశానని పేర్కొన్నారు. ప్రధాని భయపడ్డారు.. యువత, విద్యార్థుల ఉద్యమంతో ప్రధాని దిగిరాక తప్పలేదనీ, దేశ భవిష్యత్ కోసం కాక్రోచ్ జనతా పార్టీ పోరాటాన్ని ఆయన అభినందిస్తూ.. ఆ పోరాటం వల్లనే దేశ ప్రజలలో చైతన్యం వచ్చిందని పేర్కొన్నారు. విద్యార్థుల మహోద్యమం ముందు మోడీ మోకరిల్లక తప్పలేదనడానికి ఆయన విడుదల చేసిన వీడియోయే తిరుగులేని సాక్ష్యమని ప్రకాశ్ రాజ్ పేర్కొన్నారు.
Prakash Raj, PM Narendra Modi, NEET Paper Leak, Jantar Mantar Protests, Exam Reforms India
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/cockroaches-agitatiom-made-modi-fear-25-227038.html
పెట్రోల్‌లో ఇథనాల్ కలపడాన్ని ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వ తాజా విధానాలు ఇప్పుడు సామాన్యుల వంటగదిపై తీవ్ర ప్రభావం
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి.
వికారాబాద్ జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన అనంతగిరి హిల్స్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
హైదరాబాద్ నగరంలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది.
గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని చారిత్రాత్మక బాపూఘాట్ వద్ద జాతిపిత మహాత్మా గాంధీకి రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నివాళులు అర్పించింది.
కనీస ధర రూ.30కి పెంపునకు సిఫార్సు.!
వెబ్‌సిరీస్ ల్లో ఎక్కువగా బ్యాంకులు, బంగారు దుకాణాల్లో దోపిడీలకు సంబంధించిన వీడియోలే చూసేవాడు.. ఆ తర్వాత తనకున్న ఆర్మీ అనుభవాన్ని ఉపయోగించుకోని సికింద్రాబాద్ మద్రాస్ రెజిమెంట్‌ను ఎంచుకున్నాడు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) వ్యవహారశైలిని నిరసిస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
హైదరాబాద్ నగరవాసుల ప్రయాణ కష్టాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకుంది.
కొత్త కారు కొనుక్కోవాలని ఎన్నో రోజులుగా కలలు కంటారు.. ఆ కల నెరవేరిన రోజు ఆ ఆనందమే వేరు! ఎంతో ఇష్టపడి కొత్త బీఎండబ్ల్యూ కారు కొనుగోలు చేసిన ఓ వ్యక్తి..
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త వాతావరణం నెలకొంది.
మహారాష్ట్రలోని ప్రఖ్యాత హిందూ హృదయసమ్రాట్ బాలాసాహెబ్ థాకరే మహారాష్ట్ర సమృద్ధి మహామార్గ్‌పై జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది.
దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు బయలుదేరిన ఫ్లైదుబాయ్ విమానంలో భారత సంతతి కెప్టెన్‌పై జరిగిన కత్తిదాడి అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది.