అప్పుడు కొట్టారు.. ఇప్పుడు కేసు పెట్టారు.. మ‌రో ర‌ఘురామ‌గా గుప్తా!

Publish Date:Mar 19, 2022

Advertisement

వైయస్ఆర్‌సీపీ రెబల్ నేత సుబ్బారావు గుప్తాపై అధికార జగన్ పార్టీ పరోక్షంగా వేధింపులకు గురి చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. తాజాగా గుప్తాపై ఒంగోల్ నగర మేయర్ జి. సుజాత ఫిర్యాదుతో వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయింది. ఒంగోలు మంగమూరు సెంటర్‌లో పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలంటూ కొంతమంది వైశ్యులు చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు. ఆ క్రమంలో విగ్రహం ఏర్పాటుకు కార్పొరేషన్ అనుమతి కోసం వైశ్య సంఘాల ప్రతినిధులతో కలిసి సుబ్బారావు గుప్తా మేయర్ వద్దకు వెళ్లారు. ఈ సందర్భంగా తనను సుబ్బారావు గుప్తా కులం పేరుతో దూషించారంటూ మేయర్ వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. అయితే గుప్తాపై ఒంగోలు నగర మేయర్ పోలీస్ కేసు పెట్టడం వెనక జగన్ పార్టీలోని కీలక నేతల హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ క్రమంలో గుప్తాపై చాలా పకడ్బందీగా. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారని సమాచారం. 

అయితే జగన్ పార్టీ.. అధికారంలోకి వచ్చిన తర్వాత.. పార్టీలో వివిధ స్థాయిలలో ఏం జరుగుతోందో అందరికీ అంతా తెలిసిందే. ఇదే విషయాన్ని ఫ్యాన్ పార్టీలోని వారేవరూ బయటకు చెప్పే సాహసం అయితే చేయలేదనేది మాత్రం సుస్పష్టం. కానీ సీఎం జగన్ సమీప బంధువు, మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ముఖ్య అనుచరుడు సుబ్బారావు గుప్తా మాత్రం.. జగన్ పార్టీలో చోటు చేసుకొంటున్న పరిణామాలు.. వాటి వల్ల భవిష్యత్తులో పార్టీ నేతలకు, కార్యకర్తలకు ఎదురయ్యే సమస్యలను కట్టే.. కొట్టే.. తెచ్చే.. అన్నట్లు చెప్పేశాడు. అదీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇలాకా ఒంగోలులో.. అదీకూడా మంత్రి వాసన్న జన్మదిన వేడుకల వేదికగా చేసుకుని.. మొత్తానికి  మొత్తం నిజాలు అయితే కక్కిపారేశాడు. 

ఆ తర్వాత సుబ్బారావు గుప్తాలో అసలు భయం మొదలై.. గుంటూరులోని ఓ లాడ్జిలో ప్రాణభయంతో దాక్కోవడం.. అతడి కోసం బాలినేని ప్రధాన అనుచరుడు సుబానీ రంగంలోకి దిగి.. గుప్తాను పట్టుకోని..  బండబూతులు తిడుతూ అతడిపై దాడి చేసి.. మంత్రి వాసన్నకు క్షమాపణలు చెప్పిండం.. సదరు వీడియో అటు సోషల్ మీడియాలో ఇటు మీడియాలో తెగ హల్ చల్ చేసింది. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలన్నీ అందరికీ తెలిసినవే.  ఆ తర్వాత సుబ్బారావు గుప్తా.. ఆంధ్రాలో పలువురు కీలక నేతలతో భేటీ కావడమే కాదు.. ఆర్య వైశ్య సంఘాల నేతలతో కూడా విజయవాడలో సమావేశం ఏర్పాటు చేసి.. వారితో చర్చలు జరపడం.. తనపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం.. ఆ క్రమంలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌నే కాదు.. అసరమైతే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను సైతం కలుస్తానని ప్రకటించారు. అయితే ఇటీవల ఢిల్లీలో అధికార వైసీపీ రెబల్ ఎంపి రఘురామ కృష్ణంరాజు ను కలవడం, మంత్రి బాలినేని, అతని కొడుకుపై మళ్ళీ విమర్శలు చేస్తున్న నేపథ్యంలోనే.. సుబ్బారావు గుప్త పై SC, ST కేసు బనాయించారని స్థానికుల చర్చ.

ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి.. మంత్రి కొడాలి నానికి నాలుగు మంచి మాటలు చెప్పడం.. ఆ క్రమంలో మా ఇలాకాలో మా మంత్రి బాలినేని వాసన్నను చూసి.. ఎలా యాక్షన్ చేయాలో నేర్చుకోవాంటూ కొడాలి నానికి నాలుగు శుద్దులు చెప్పారీ గుప్తా. అంతేకాదు.. రానున్న ఎన్నికల్లో గుడివాడ నుంచి తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటూ కొడాలి నానికి సవాల్ విసిరారు. ఆ తర్వాత గుప్తా ఢిల్లీ వెళ్లి.. జంతర్ మంతర్ వద్ద.. తనకు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగారు. ఆ తర్వాత కొద్దికాలం సైలెంట్‌గా ఉన్నా ఈ సుబ్బారావు గుప్తాపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు కావడం పట్ల ఆయన కుటుంబ సభ్యులు అయితే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  అంతేకాదు.. సుబ్బారావు గుప్తాపై బలమైన కేసులు  నమోదు చేసి.. వాటి ద్వారా మంత్రి బాలినేని వాసన్న కక్ష తీర్చుకుంటున్నారనే చర్చ అయితే ప్రకాశం జిల్లాలో జోరుగా నడుస్తోంది.

By
en-us Political News

  
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులపేర్ల మీద అధికారికంగా నమోదై ఉన్న భూముల వివరాలను అసెంబ్లీ వేదికగానే  రేవంత్ రెడ్డి బయటపెట్టారు.  
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.