రాష్ట్రపతి ఎన్నిక.. విపక్షాల ఉమ్మడి అభ్యర్థి రేసు నుంచి తప్పుకున్న శరద్ పవార్

Publish Date:Jun 14, 2022

Advertisement

రాష్ట్రపతి ఎన్నిక నోటిఫికేషన్ ముందు వరకూ ఉత్కంఠ రేపినా చివరకు వచ్చేసరికి ఏకపక్షంగా మారిపోయే అవకాశాలే కనిపిస్తున్నాయి. విపక్షాల అనైక్యత కారణంగా బీజేపీ అభ్యర్థి ఎన్నిక లాంఛనమే అనే పరిస్థితి ఏర్పడింది. సరిగ్గాఈ కారణంగానే విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా అందరికీ ఆమోదయోగ్యమైన శరద్ పవార్ పోటీకి విముఖత వ్యక్తం చేస్తున్నారన్నది విశ్లేషకుల మాట. దేశంలోనే అత్యున్నత రాజ్యాంగ పదవి అయిన రాష్ట్రపతి ఎన్నిక విషయంలో తొలి నుంచీ విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా శరద్ పవార్ అయితే ఎవరికీ అభ్యంతరం ఉండదన్న అభిప్రాయమే వ్యక్తం అవుతూ వచ్చింది. అయితే విపక్షాల ఐక్యతకు చొరవ చూపే విషయంలో వివిధ పార్టీల నాయకల మధ్య సయోధ్య లేకపోవడంతో.. అది సాకారం కాలేదు.

ఇప్పుడు తీరా  రాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడిన అనంతరం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి చొరవ తీసుకుని బీజేపీ యేతర పక్షాల నేతల సమావేశం ఏర్పాటు చేసినప్పటికీ అప్పటికే ఆలస్యమైంది.  మమతా బెనర్జీ కూడా బీజేపీయేతర పక్షాల నేతలకు ఆహ్వానం పంపే విషయంలో తనదైన శైలిని అనుసరించారు. సోనియాకు ఆహ్వానం పంపిన ఆమె కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించలేదు. మరో వైపు కాంగ్రెస్ విపక్షాల ఉమ్మడి అభ్యర్థి ఎంపిక విషయమై పార్టీల అభిప్రాయాలు తెలుసుకునేందుకు సోనియా ప్రతినిథిగా మల్లిఖార్జున ఖర్గేకు బాధ్యతలు అప్పగించింది. అందరి కంటే ముందు ఈ పని కోసం కాలికి బలపం కట్టుకు తిరిగిన కేసీఆర్.. తన ప్రయత్నాలకు బీజేపీ యేతర పార్టీల నుంచి సానుకూలత రాకపోవడంతో కినుక వహించి మౌనం వహించారు.

ఇలా విపక్షాల అనైక్యత కారణంగా అభ్యర్థి ఎంపిక ఒకడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అన్నట్లుగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రపతి అభ్యర్థిగా విపక్షాల ఉమ్మడి అభ్యర్థి రేసులో తాను లేనంటూ శరద్ పవార్ మంగళవారం విస్పష్ట ప్రకటన చేశారు. దీంతో విపక్షాల ఉమ్మడి అభ్యర్థి ఎవరన్న విషయంలో మళ్లీ సస్పెన్స్ నెలకొంది. తొలుత శరద్ పవార్ అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ తెరమీదకు తీసుకువచ్చింది. రాజకీయాలలో సీనియర్ అయిన  శరద్ యాదవ్ అభ్యర్థిత్వం పట్ల ఏ బీజేపీయేతర పార్టీ కూడా వ్యతిరేకత వ్యక్తం చేయలేదు.

అయితే పార్టీలుఈ విషయాన్నిప్రకటించే విషయంలో జరిగిన జాప్యం, అలాగే వైసీపీ, బీజేడీ వంటి పార్టీలు బీజేపీ అభ్యర్థికే మద్దతు ఇస్తాయన్న స్పష్టత రావడంతో శరద్ పవార్ తాను రేసులో లేననీ, పోటీకి సుముఖంగా  లేననీ ప్రకటించేశారు. ప్రస్తుత సినేరియాలో విపక్షాలకు ఉమ్మడి అభ్యర్థిని గెలిపించుకోవడానికి అవసరమైనన్ని ఓట్లు ఎలక్టోరల్ కాలేజీలో లేవు. దీంతో గెలిచే అవకాశంలేని పోటీలో దిగడమెందుకన్నభావనతోనే శరద్ పవార్ రేసు నుంచి తప్పుకున్నారని పరిశీలకులువిశ్లేషిస్తున్నారు.

By
en-us Political News

  
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో  అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.  అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ   అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది. 
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ..  తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ  తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి. 
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది.  సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును  దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి  కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది.  ఈ నేపథ్యంలో తాను కేవలం  మంత్రి పదవిని  మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం  వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక  ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..   తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ..  వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.  
 ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.