కోనసీమ అల్లర్లెవరి పనో తేలిపోయింది!

Publish Date:Jun 14, 2022

Advertisement

పచ్చటి కోనసీమలో అల్లర్ల చిచ్చు ఎవరి పనో తేలిపోయింది. కోనసీమ అల్లర్ల కేసులో పోలీసులు అరెస్టు చేసిన వారంతా వైసీపీ కార్యకర్తలే. వీరిలో మంత్రి పినిపె విశ్వరూప్ అనుచరులు సైతం ఉన్నారు. ఈ అల్లర్లలో మంత్రి పినిపె విశ్వరూప్ నివాసం దగ్ధమైన సంగతి విదితమే. పోలీసులు అల్లర్ల కేసులో అరెస్టు చేసిన వారిలో అత్యధికులు ఆ మంత్రిగారి అనుచరులే ఉండటం చూస్తుంటే నిర్ద్వంద్వంగా అల్లర్ల వెనుక ఉన్నది వైసీపీయే అన్న విషయం తేటతెల్లం అవుతుంది.

ఇప్పటి వరకూ కోనసీమ అల్లర్లకు సంబంధించి పోలీసులు అరెస్టు చేసిన వారు రెండు వందల మందికి పైనే ఉన్నారు. వారంతా వైసీపీ కార్యకర్తలే. కోనసీమ సాధన సమితి నేతలనూ పోలీసులు అరెస్టు చేసి కేసులు పెట్టారు. వారు కూడా పినిపై విశ్వరూప్ అనుచరులే. ఈ అరెస్టులను బట్టే వైసీపీ కుట్రతోనే కోనసీమలో చిచ్చు పెట్టిందని అవగతమౌతోంది. వాస్తవం ఇలా ఉండగా... ఇప్పటి వరకూ కోనసీమ విధ్వంసంపై ఒక్క మాట కూడా మాట్లాడని సీఎం జగన్ అనంతపురంలో మంగళవారం కోనసీమలో విపక్షాలు చిచ్చు పెట్టాయంటూ ఆరోపణలు చేశారు.

ఏకంగా మంత్రి ఇంటిని దగ్ధం చేశారు అంటూ తెలుగుదేశం, జనసేనలపై విమర్శలు గుప్పించారు. అల్లర్ల వెనుక ఉన్నది వైసీపీయేనంటూ పోలీసులు అరెస్టుల సాక్షిగా తేటతెల్లమైపోతుంటే.. జగన్ మాత్రం ఆ అల్లర్ల వెనుక ఉన్నది విపక్షాలేనంటూ జనం సానుభూతి పోందేందుకు ప్రయత్నిస్తున్నారు. అల్లర్లు జరిగి ఇన్ని రోజులైనా.. ఆ విధ్వంసంలో ఏకంగా మంత్రి నివాసం దగ్ధమైనా జగన్ ఇప్పటి వరకూ మంత్రిని పరామర్శించిన పాపాన పోలేదు. దీనిని బట్టి కోనసీమ విధ్వంసాన్ని  విపక్షాలపై విమర్శలు చేసి రాజకీయంగా లబ్ధి పొందాలన్న యావే కానీ.. వాస్తవాలు బయటపడుతున్నా, అరెస్టయిన వారంతా అధికార పార్టీ అనుచరగణం అని తేలిపోయినా అంగీకరించేందుకు మాత్రం వైసీపీ కానీ జగన్ కానీ సిద్ధంగా లేరని అవగతమౌతోంది.

 వర్గాలు, కులాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి పబ్బం గడుపుకోవడమే జగన్ సర్కార్ ధ్యేయంగా కనిపిస్తున్నది. జగన్ సర్కార్ ఓట్ల వేటలో కోనసీమ జిల్లాలో చిచ్చు రగిల్చింది. అసలు  జగన్ సర్కార్ తన విధానాలతో రాష్ట్రంలో ప్రశాంతతకు తావు లేకుండా చేసింది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా అశాంతి, ఆందోళనలతో రాష్ట్రం అట్టుడికి పోతోంది.అందులో భాగంగానే ప్రశాంతతకు మారు పేరైన కోససీమలో కుల చిచ్చు రేపి పబ్బం గడుపుకోవాలన్న జగన్ సర్కార్ యత్నం.. బూమరాంగ్ అయ్యింది. అల్లర్ల వెనుక ఉన్నది వైసీపీయే అన్న విషయం తేటతెల్లమయ్యేలా అల్లర్ల కారకులంటూ పోలీసులు అరెస్టు చేసిన వారంతా వైసీపీ కార్యకర్తలే ఉన్నారు,

వారిలోనూ మంత్రి అనుచరుల సంఖ్యే ఎక్కువ.  అసలు కోనసీమలో చిచ్చు పెట్టడం కోసమే  కొత్త జిల్లాల ఏర్పాటు ప్రకటించిన సమయంలోనే పలు దళిత సంఘాలు కోనసీమకు డాక్టర్ బి. ఆర్. అంబేడ్కర్ పేరు పెట్టాలని కోరాయి. అప్పడు వాటి వినతిని పెడచెవిన పెట్టి కోనసీమ జిల్లాగా నామకరణం చేసింది. అంతే కాదు నిర్ణయం తీసేసుకున్నాం ఇక మార్పు లేదంటూ ప్రభుత్వ పెద్దలు ఘనంగా ప్రకటనలు కూడా చేసేశారు.  ఆ తరువాత  హఠాత్తుగా కోనసీమ జిల్లా పేరును బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా మారుస్తే ప్రభుత్వం ప్రకటించింది.

దీంతో వైసీపీ కార్యకర్తలే ఆ మార్పును వ్యతిరేకిస్తూ ఆందోళనలు, అల్లర్లకు దిగారని విశ్లేషకులు అంటున్నారు. అసలు మొదటే జిల్లా పేరును బీఆర్ అంబేడ్కర్ కోనసీమ అని పేరు పెట్టి ఉంటే ఎలాంటి ఆందోళనలకూ తావుండేది కాదనీ, కానీ అలా చేస్తే వైసీపీకి పొలిటికల్ మైలేజీ ఉండదన్న ఉద్దేశంతోనే  సర్కార్ కోనసీమలో కులచ్చిచ్చును ప్రేరేపించేలా కుట్రపన్నిందనీ అప్పట్లోనే విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పడు అల్లర్ల కారకులంతా వైసీపీవారేనని పోలీసుల అరెస్టులతో తేటతెల్లమవ్వడంతో కోనసీమ విధ్వంసంలో దోషి ప్రభుత్వమేనని పరిశీలకులు అంటున్నారు.


 

By
en-us Political News

  
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో  అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.  అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ   అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది. 
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ..  తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ  తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి. 
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది.  సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును  దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి  కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది.  ఈ నేపథ్యంలో తాను కేవలం  మంత్రి పదవిని  మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం  వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక  ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..   తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ..  వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.  
 ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.