అప్రతిహాతంగా ఇనుప ఖనిజం దోపిడీ
Publish Date:Apr 2, 2012
Advertisement
రాష్ట్రంలో పలు రకాల దోపిడీదారులు స్వైరవిహారం చేస్తున్నారు. మద్యం రూపంలో కొంతమంది, ఇసుక రూపంలో కొంతమంది, ఎర్రమట్టి రూపంలో మరికొంతమంది ఇలా ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ దోపిడీకి పాల్పడుతున్నారు. తాజాగా వరంగల్ జిల్లాలో మరో దోపిడీ వెలుగులోకి వచ్చింది. ఇక్కడ కొంతమంది దోపిడీదారులు రాజకీయ నాయకుల అండదండలు, అధికారుల సహాయ సహకారాలతో ఇనుమ ఖనిజాన్ని అక్రమంగా తవ్వి రవాణా చేసేస్తున్నారు. ఇనుప ఖనిజం గనులకు లైసెన్సులు కూడా వీరి వద్ద ఉండవు. అయితే ఏదో ఒక ఖనిజం పేరుతొ లైసెన్స్ పొంది ఆ ఖనిజానికి బదులుగా ఇనుప ఖనిజాన్ని తవ్వి తరలించి వేస్తున్నారు. వరంగల్ జిల్లా ములుగు మండలం మల్లంపల్లి గ్రామ సమీపంలో ఇనుప ఖనిజ నిక్షేపాలున్నాయి. అయితే ఈ ఇనుప ఖనిజాన్ని ఎర్రమట్టిగా రికార్డుల్లో చూపిస్తున్నారు. ఎర్రమత్తిని తవ్వడానికి అతి తక్కువ ఫీజు చెల్లించి దానిరూపంలో ఉన్న ఇనుప ఖనిజాన్ని రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు తరలిస్తున్నారు. దీన్ని ప్రధానంగా సిమెంట్ ఫ్యాక్టరీలు ఎక్కువగా ఉన్న నల్గొండ జిల్లాకు పంపుతున్నారు. అక్కడ దీన్ని శుద్ధిచేసి స్టీల్ ఫ్యాక్టరీలకు విక్రయించి కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నారు. గత ఐదు సంవత్సరాలుగా ఈ దోపిడీ సాగుతున్నప్పటికీ అధికారులు దీనిపై దృష్టి పెట్టడం లేదు. ఎర్రమట్టి రూపంలో విలువైన ఇనుప ఖనిజం స్వాహా చేస్తూ దోపిడీదారులు కోట్లాది రూపాయలు దర్జాగా అనుభవిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/sand-24-13104.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





