ఇక సమైక్య పోరాటం
Publish Date:Jan 16, 2013
Advertisement
కేంద్రం తన నిర్ణయం ప్రకటించే సమయం ఆసన్నమవుతున్నకొద్దీ రాష్ట్రంలో ఆంద్ర, తెలంగాణా రాజకీయాలు ఊపందుకొంటున్నాయి. రాష్ట్ర విభజన ఖాయమనే సంకేతాలు వెలువడుతున్న నేపద్యంలో, సీమంద్రాకు చెందిన వివిధ పార్టీల నేతలందరూ, తమ విభేదాలను, పార్టీ సిద్ధాంతాలను మళ్ళీ మరోమారు పక్కన బెట్టి సమైక్యపోరాటానికి చేతులు కలుపుతున్నారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న సీమాంధ్రా మంత్రులు ఈ సమైక్య పోరాటానికి ముందు నిలుస్తున్నారు. మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, వట్టి వసంతకుమార్, టీజీ వెంకటేష్, కాసు కృష్ణారెడ్డి, శైలజానాధ్, విశ్వరూప్ ఏరాసు ప్రతాపరెడ్డితోపాటు మరో పదిమంది ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లి కేంద్రంపై సమైక్యరాష్ట్రానికి అనుకూలంగా ఒత్తిడి తెచ్చే ప్రయత్నంలో ఉన్నారు. అదే సమయంలో మధు యాష్కీ, రాజయ్య వంటి తెలంగాణావాదులు కూడా డిల్లీలోనే తిష్టవేసి తెలంగాణా కోసం తమ ప్రయత్నాలు తము చేస్తున్నారు. రేపు అనగా జనవరి 17వ తేదీన సీమాంధ్ర కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు మంత్రుల క్వార్టర్స్‌లోని క్లబ్‌లో సమావేశం అవ్వాలని నిర్ణయించడంతో తెలంగాణా వాదులు ఆగ్రహం ప్రకటిస్తున్నారు. తెలంగాణా గడ్డపై తెలంగాణా వ్యతిరేఖ ఆలోచనలు చేసేవారి సమావేశాలను తప్పక అడ్డుకొంటామని ఆన్నారు. ఈ నేపద్యంలో రేపు సీమంద్రా సమావేశం జరగడం అనుమానమే. అయితే, కేంద్రం గనుక రాష్ట్ర విభజన ప్రకటించిన మర నిమిషమే సీమంద్రా రాజకీయ నాయకులందరూ తమ పదవులకు రాజీనామా చేసి ఉద్యమాలు మొదలుపెడతామని కేంద్రాన్ని హెచ్చరిస్తున్నారు. తాము ఇప్పటివరకూ పార్టీ అధిష్టానంపై నమ్మకం, గౌరవంతో ఒత్తిడి చేయలేదని, గానీ ఇప్పుడు కేంద్రం తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకునేమాటయితే తాము తప్పనిసరిగా పార్టీకి వ్యతిరేఖంగా నిర్ణయం తీసుకోవలసి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఇంతవరకు నిదానంగా వేచిచూసిన సీమంద్రా నేతలు ఇప్పుడు రంగ ప్రవేశం చేయడంతో ఒక్కసారిగా రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కిపోయాయి. ఇక, రేపటినుండి రాష్ట్రంలో పరిస్థితులు మరింత దిగజారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
http://www.teluguone.com/news/content/samaikyandra-24-20423.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





