బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కు పాము కాటు..
Publish Date:Dec 26, 2021
Advertisement
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్ పాముకాటుకు గురయ్యారు. గత కొన్నిరోజులుగా సల్మాన్ తన కుటుంబానికి దూరంగా పాన్వేల్‌లోని ఫాంహౌస్‌లో ఉంటున్నారు.ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున ఆయన్ని పాము కరిచింది. దీంతో, సల్మాన్ వ్యక్తిగత సిబ్బంది వెంటనే ఆయన్ని ముంబయిలోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. విషం లేని పాము కాటువేయడంతో సల్మాన్ ఖాన్ కు ప్రమాదం తప్పిందని వైద్యులు తెలిపారు. పాము కాటు వేసిన తర్వాత.. సల్మాన్ ఖాన్ ను నేరుగా నవీ ముంబై కమోతే ప్రాంతంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో సల్మాన్ ఖాన్ కు అవసరమైన వైద్యం అందించాక.. కొంత సమయం అబ్జర్వేషన్ లో ఉంచారు డాక్టర్లు. అనంతరం డిశ్చార్జ్ చేశారు. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్.. ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. ఎవరు కూడా ఆందోళన చెందనవసరం లేదని పేర్కొన్నారు. సల్మాన్ ఖాన్ చేతిపై పాము కాటేసినట్లు సమాచారం. రేపు సల్మాన్ బర్త్ డే. ఈ క్రమంలో ఆయన పుట్టినరోజు వేడుకలు చేసుకునేందుకు ఫాంహౌస్ కు వెళ్లినట్లు సమాచారం. అయితే అతని ఆరోగ్యం ఎలా ఉన్న సరే.. ఇవాళ రాత్రికి పార్టీ ఇచ్చేందుకు సల్మాన్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. లాక్ డౌన్ సమయంలో కూడా సల్మాన్ చాలా టైం పన్వేల్ ఫాం హౌస్ లోనే గడిపారు. ఫాం హౌస్ లో పొలంలో పనిచేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులతో పంచుకున్నాడు. మరోవైపు సల్మాన్ పాముకాటుకు గురయ్యారని తెలిసి అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
http://www.teluguone.com/news/content/salman-khan-hospitalzed-with-snake-bite-39-129098.html





