మరణించిన, సస్పెండైన వారికీ జీతాలు!

Publish Date:Feb 4, 2022

Advertisement

‘మొండివాడు రాజు కంటే బలవంతుడు’ అంటారు. మరి ఏపీ సీఎం జగన్ ని మొండివాడనాలో?.. రాజు అనాలో..? లేక మొండితనం మూర్తీభవించిన రాజు అని భావించాలో? అర్థంకాని పరిస్థితి వచ్చిందని అంటున్నారు. ఏపీలోని ఉద్యోగులు, ఉపాధ్యాయుల పీఆర్సీ, పెన్షనర్ల పింఛన్ల విషయంలో తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు చందాన వ్యవహరిస్తున్నారు. తాను ఏది చేస్తే అదే రైట్ అనే ధోరణిలో ముందుకు పోతున్నారు. జగన్ రెడ్డి సర్కార్ లోని ఈ ధోరణి కారణంగానే ఇప్పుడు భారీ మొత్తంలో నిధులు ఖజానా నుంచి బయటికి వెళ్లిపోయాయి. కొత్త పీఆర్సీని ఎలాగైనా అమలు చేసి తీరాలనే పిచ్చి పట్టుదలకు పోయిన జగన్ రెడ్డి సర్కార్ ఉద్యోగులు, ఉపాధ్యాయుల జనవరి నెల జీతాలు, పెన్షనర్ల పింఛన్ డబ్బులు ఫిబ్రవరి ఒకటి, రెండు తేదీల్లోనే వారి వారి బ్యాంకు ఖాతాలకు బదిలీ చేసింది. ఆదరాబాదరాగా చేసిన ఆ పనే ఇప్పుడు వైసీపీ సర్కార్ నాలిక కరుచుకునేలా చేసింది.

నిజానికి ఉద్యోగులు, ఉపాధ్యాయుల నెలవారీ జీతాలు, పెన్షనర్ల పింఛన్ బిల్లులపే ట్రెజరీ సిబ్బంది ప్రాసెస్ చేస్తారు. అయితే.. కొత్త పీఆర్సీ ఫిట్ మెంట్ విషయంలో గుర్రుగా ఉన్న ట్రెజరీ సిబ్బంది కూడా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలకు మద్దతు పలికారు. శాలరీ బిల్లుల ప్రాసెస్ ను పట్టించుకోలేదు. బిల్లులు ప్రాసెస్ చేయాలయంటూ ట్రెజరీ సిబ్బందిని జగన్ సర్కార్ ఎంతలా వత్తిడి చేసినా.. బెదిరించినా లొంగలేదు.. మెట్టు దిగలేదు. పని చేయలేదు. అయినప్పటికీ తాను అనుకున్నట్లుగానే ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛన్ దారుల డబ్బుల్ని సాంకేతిక పరిజ్ఞానం సాయంతో బదిలీ చేసింది.

ఇక్కడే జగన్ రెడ్డి సర్కార్ తప్పులో కాలేసింది. అదేమంటే.. మరణించిన ఉద్యోగులకు, విధుల నుంచి బహిష్కరణకు గురైన సిబ్బందికి కూడా పూర్తి స్థాయిలో డబ్బులు వారి వారి బ్యాంకు ఖాతాల్లో వేసింది. వారితో పాటుగా మరణించిన పింఛన్ దారులకు కూడా పింఛన్ సొమ్ములు జమ చేసేసింది. ఆనక తీరుబడిగా లెక్క వేసుకుంటే.. అసలు డబ్బుల కంటే పెద్ద మొత్తంలో అధికంగా ఖజానా నుంచి నిధులు వెళ్లినట్లు అర్థం అయింది. దీంతో మరణించిన, సస్పెండ్ అయిన, పెన్షనర్ల వివరాలు పంపించాలని ట్రెజరీ ఉన్నతాధికారులకు ఆగమేఘాల మీద ఆర్థికశాఖ ఆదేశాలు ఇచ్చింది. తాజా వివరాల కోసం ట్రెజరీ అధికారులకు ఆర్థికశాఖ ఉన్నతాధికారులు ప్రొఫార్మా పంపించారు. దీంతో పాటు అనర్హులకు కూడా జీతం డబ్బులు పడ్డాయననే ఫిర్యాదులు కూడా ప్రభుత్వానికి కుప్పలు తెప్పలుగా వచ్చాయట. దీంతో అనర్హులకు జీతాలు పడితే వారి వివరాలు పంపాలని ట్రెజరీ అధికారులకు ఆర్థికశాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు పంపించారు.

ఏపీలో వైసీపీ సర్కార్ వచ్చినప్పటి నుంచీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది,పెన్షనర్లకు ప్రతి నెలా వారి డబ్బుల్ని పది, పదిహేను తేదీలు దాటితే కాని ఇచ్చేది కాదు. కొత్త పిచ్చోడు పొద్దెరగడన్నట్లు కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు వేసేయాలనే తొందరలో ఇంత భారీ తప్పిదం జరిగిపోయిందంటున్నారు విశ్లేషకులు. కొండ నాలుకకు మందు వేస్తే.. పెద్ద నాలుకే ఊడిపోయిన చందంగా మారింది ఇప్పుడు ఏపీలోని వైసీపీ సర్కార్ తీరు అనే విమర్శలు వస్తున్నాయి. మరణించిన వారి, సస్పెండైన వారి ఖాతాల్లో వేసిన జీతం డబ్బుల్ని ఆయా వ్యక్తులు లేదా వారి వారసులు డ్రా చేసుకుంటే ఏంచేస్తుందనేది ప్రశ్న. ఆ డబ్బుల్ని తిరిగి రాబట్టాలంటే జగన్ సర్కార్ ఎన్ని ఫీట్లు చేయాలో.. ఎన్ని చీవాట్లు తినాలో.. అసలు ఆ డబ్బులు వెనక్కి వస్తాయో.. రావో అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న అంటున్నారు విశ్లేషకులు.

By
en-us Political News

  
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు. 
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.  
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో   పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. 
 ధనుష్‌ తన కొత్త రాజకీయ పార్టీ కోసం  తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు  ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.