సజ్జలకు కేబినెట్ బెర్త్? తెలుగు పన్నీర్ సెల్వం అవుతారా? 

Publish Date:Sep 15, 2021

Advertisement

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగుతీసి అడుగేయాలంటే, అయన అనుమతి అవసరం. రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలే అయినా, ఆయన ఓకే చేస్తేనే  ఫైల్ ముందుకు కదులుతుంది. ముందు అయన దర్శనం చేసుకుంటేనే, ముఖ్యమంత్రి దర్శనం లభిస్తుంది. అలాగని ఆయన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సమీప బంధువో, క్లాస్మేట్, రూమ్మేట్టో కాదు, చివరకు జైల్మేట్ కూడా కాదు. ఎంపీ, ఎమ్మెల్యే అసలే కాదు. నిజానికి ప్రత్యక్ష రాజకీయాలలో ఆయన పాత్ర ఇంచుమించుగా జీరో. అయినా ప్రభుత్వం తీసుకునే కీలక నిర్ణయాలు ఆయన నోటి నుంచే మీడియాకు చేరతాయి. ప్రభుత్వ నిర్ణయాలే కాదు, ఫ్యామిలీ పాలిటిక్స్ విషయంలోనూ ఆయనే మాటే. ‘బైబిల్’ వాక్కు. 

వైసీపీలో ఆయన కీలక బాధ్యతలే నిర్వహించారు. పార్టీ జనరల్ సెక్రటరీగానూ పనిచేశారు. అయినా, నెంబర్ 2 షాడో తొలిగే వరకు ఆయన చాలావరకు తెర చాటునే ఉండి పోయారు. నెంబర్ 2 ను మేఘాలు కప్పేయడంతో, అయన వెలుగులోకి వచ్చారు.   ఆయన ఎవరో ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది. అవును,ఆయన మరెవరో కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రజావ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత, అయిన వారిని, కానీ వారిని అనేక మందిని సలహాదారులుగా నియమించారు. అలా నియమించిన ‘మంద’ లో ఆయన కూడా ఒకరు. అయితే, కలిసొచ్చె కాలమొస్తే నడిచొచ్చే కొడుకు పుడతారన్నట్లు, ఆయనకు కాలం కలిసొచ్చింది. కారణాలు ఏవైనా ఆయన ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి దగ్గరయ్యారు. అత్యంత సన్నిహితునిగా ముద్ర పడింది. ప్రభుత్వ నిర్ణయాలు మొదలు రాజకీయ వివివాదాలు, పరిష్కారాల వరకు అన్నిటికీ ఆయనే కేంద్ర బిందువు. ఇన్ని మాటలెందుకు కానీ, జగన్ రెడ్డి ప్రభుత్వానికి, కర్త, కర్మ, క్రియ అన్నీ ఆయనే  అంటారు.   

అదే సమయంలో అయన  సలహాదారుగా ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటూ రాజకీయ వ్యవహారాల్లో ఎలా వేలు పెడతారనే విమర్శలు వినవచ్చాయి. విమర్శలు మాత్రమె కాదు, ఏకంగా ప్రభుత్వంలో ఆయన పోషిస్తున్న పాత్రపై న్యాయస్థానంలో పిటీషన్ కూడా దాఖలైంది. అయితే ‘మరకా మంచిదే’ అన్నట్లుగా, ఈ మరక కూడా ఆయనకు మరో అదృష్ట రేఖగా మారింది. ఈ గొడవంతా ఎందుకని అనుకున్నారో ఏమో, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఆయనను మంత్రివర్గంలోకి తీసుకోవాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుతం వైసీపీ వర్గాల్లో ఇదే చర్చ జోరుగా సాగుతోంది. అదే జరిగితే తంతే వెళ్లి గారెల బుట్టలో పడినట్లు సజ్జల అదృష్టమే అదృష్టం. అలాగే రేపు ఏదైనా జరగరానిది జరిగి మళ్ళీ జైలుకు వెళితే, తెలుగు పన్నీర్ సెల్వం అయ్యే అదృష్తం కూడా దక్కవచ్చని అంచున్నారు. 

ఎటూ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఫస్ట్ కాబినెట్ కూర్పు సమయంలోనే మంత్రి పదవి అంటే ఐదేళ్ళు అనుకునేరు, రెండున్నర ఏళ్ల తర్వాత మంత్రి వర్గం పూర్తిగా మారిపోతుంది, మీరంతా మాజీలు అయిపోతారు. కొత్త వారికి అవకాశం ఇస్తామని ముందుగానే చెప్పారు. ఇప్పుడు ఆ ఆగడువు ముగింపు దశకు చేరుకుంది.  కాబట్టి మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణ ముహూర్తం రానే వచ్చింది ఈ నేపధ్యంలో కొత్త మంత్రివర్గం కూర్పు పై జరుగతున్న చర్చల్లో సజ్జల పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. సజ్జలకు కాబినెట్ బెర్త్ ఖాయమని అంటున్నారు. అయితే, ఆయన శాసన సభ సభ్యుడు కాదు.. కాబట్టి ఆరు నెలలలో అయన ఎమ్మెల్యే,/ ఎమ్మెల్సీగా ఎన్నిక కావల్సి ఉంటుంది. అదెంత పని  రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా.. 

By
en-us Political News

  
కరీంనగర్ గడ్డపై బీజేపీ కాషాయ దళం కదం తొక్కింది.
ఈ చర్చల్లో భాగంగానే.. రేవంత్ కేబినెట్ లో ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క కు తోడుగా మరో ఉపముఖ్యమంత్రిని కూడా నియమించే అవకాశాలున్నాయన్న చర్చ జోరందుకుంది. 
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత   ప్రతి జిల్లాలోనూ పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని ఆయన సవివరంగా పేర్కొన్నారు. ఈ విషయంలో ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
పంచాయతీ ఎన్నికలకు పొత్త ధర్మం వర్తించదని ఆ ప్రకటన పేర్కొంది.   గ్రామాభివృద్ధి, స్వేచ్ఛాయుత పాలన, మహాత్మాగాంధీ ఆశయాల సాకారం గ్రామీణ స్థాయి నుంచే సాధ్యమవుతాయని పేర్కొంది.   
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాగలిగిందని బి.ఎం. సందీప్ కుమార్ పేర్కొన్నారు.
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
మొత్తం 28 జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 27 చోట్ల విజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.  
అదానీతో సంబంధాలపై   రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో అదానీ పెట్టుబడుల ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ప్రజాధనాన్ని దోచి అదానీకి కట్టబెట్టే విధానం తమది కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి బలమైన ఉనికి లేదని, ఇటీవలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.
పోలీసుల హెచ్చరికలు, ఆంక్షలను బేఖాతరు చేస్తూ ఆయన భారీ కాన్వాయ్‌తో అక్కడికి రావడంపై స్థానిక ప్రజలు, తెలుగుదేశం వర్గీయులు  ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఎంపీ కాన్వాయ్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా  అంకాలమ్మ గూడూరులో ఘర్షణ వాతావరణం నెలకొంది. 
ఇదే వేదికపై నుంచి   544.11 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన రేవంత్ రెడ్డి,  ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని కూడా   ప్రారంభించారు.
కొలంబియా యూనివర్సిటీ వేదికగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ప్రస్తుతం  దేశ ఆర్థిక వ్యవస్థ   పతనావస్థలో ఉందని రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోయిందని, యువతకు ఉపాధి అవకాశాలు కరవయ్యాయని ఆయన ఆరోపించారు.
తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.