Publish Date:Dec 29, 2021
జగన్ సర్కారుకు ఖతర్నార్ వార్నింగ్ ఇచ్చారు మాజీ కేంద్రమంత్రి, బీజేపీ జాతీయనేత ప్రకాశ్ జవదేకర్. ఏపీలో కొందరు నేతలు బెయిల్‌పై బయట ఉన్నారని.. వారంతా త్వరలోనే జైలుకు వెళ్తారంటూ హాట్ కామెంట్స్ చేశారు. ప్రకాశ్ జవదేకర్ చేసిన వ్యాఖ్యలు జగన్‌రెడ్డిని, విజయసాయిరెడ్డిని ఉద్దేశించి చేసినవే అని అందరికీ తెలుసు. వాళ్లిద్దరూ జైలుకెళ్లడం ఖాయమంటూ జవదేకర్ తేల్చి చెప్పారు. ఇక, మరో ఎంపీ సుజనాచౌదరి సైతం సంచలన స్టేట్మెంట్ ఇచ్చారు. ఏపీలో ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ పెడితే.. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఖాయమన్నారు. ఏపీలో ఏం జరుగుతోందని కేంద్ర హోంశాఖ నిత్యం నిఘా వేస్తోందన్నారు. ఇలా.. బీజేపీ జాతీయ నేతలు అంతేసి మాటలు అంటే.. నేరుగా జగన్‌రెడ్డిని, విజయసాయిరెడ్డిని టార్గెట్ చేస్తే.. ఉలిక్కిపడిన వైసీపీ.. అంతలోనే సర్దుబాటు రాజకీయం స్టార్ట్ చేసింది.
జగన్ తరఫున ఎప్పటిలానే సజ్జల రంగంలోకి దిగారు. విజయవాడలో జరిగిన బీజేపీ ప్రజాగ్రహ సభ సంచలనాలను సైడ్‌వేస్ చేయడానికి.. జవదేకర్, సుజనా కామెంట్లను వదిలేసి.. సోము వీర్రాజు వ్యాఖ్యలపై మాత్రమే స్పందించారు సజ్జల. కావాలనే.. వీర్రాజు ఇష్యూను చర్చలో పెట్టి.. అసలైన బెయిల్, జైల్ టాపిక్‌ను పక్కకు తప్పించే ప్రయత్నమని ఇట్టే తెలిసిపోతుందని అంటున్నారు.
చంద్రబాబు ఎజెండానే బీజేపీ నేతల ఎజెండా అని.. వీర్రాజుకు స్కిప్ట్ రాసిచ్చింది చంద్రబాబేనంటూ రొటీన్ ఆరోపణలు చేశారు సజ్జల. కర్నూలులో హైకోర్టు పెడతామన్న సోము కామెంట్లను తమకు అడ్వాంటేజ్‌గా మార్చుకున్నారు. ఇలా టీడీపీ-బీజేపీ.. వీర్రాజు-చంద్రబాబు చుట్టూనే సజ్జల ప్రెస్‌మీట్ అంతా నడిచింది కానీ.. ఎక్కడా ప్రకాశ్ జవదేకర్ చేసిన సంచలన వ్యాఖ్యలపై మాత్రం స్పందించలేదు. అంటే, బీజేపీ జాతీయ నాయకత్వానికి వైసీపీ భయపడుతున్నట్టేనా? జగన్ బెయిల్ రద్దు అవుతుందని.. త్వరలో జైలుకు వెళ్తారని పరోక్షంగా అంగీకరించినట్టేనా? లేదంటే, ప్రకాశ్ జవదేకర్ చేసిన కామెంట్లను సజ్జల ఎందుకు ఖండించలేదు? ఎదురుదాడి ఎందుకు చేయలేకపోయారు? జగన్ జుట్టు కేంద్ర చేతిలో ఉందనే భయమేనా? అంటూ సజ్జలను ప్రశ్నిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/sajjala-comments-on-ap-bjp-vijayawada-meeting-39-129284.html
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది. సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్, విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.