విశాఖకు వైసీపీ ముప్పు... పెద్ద కుట్ర ఉందంటోన్న సబ్బం

Publish Date:Dec 24, 2019

Advertisement

టీడీపీ నేత, మాజీ ఎంపీ సబ్బం హరి సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖను రాజధానిగా ప్రకటించడం వెనుక పెద్ద కుట్ర ఉందన్నారు. జగన్ నిర్ణయంతో విశాఖకు పెనుముప్పు రాబోందని హెచ్చరించారు. సడన్‌గా విశాఖను రాజధానిగా చేయడం వెనుక పెద్ద కుట్ర ఉందని అనుమానం వ్యక్తంచేశారు. విశాఖను నాశనం చేసేందుకే జగన్ ప్రభుత్వం ఇక్కడికి రాజధానిని మార్చుతోందని ఆరోపించారు. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ఆరు నెలలుగా భీమిలిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందన్న సబ్బం హరి... ఖాళీగా ఉన్న భూముల్ని దోపిడీ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. త్వరలోనే ఆధారాలతో సహా దోపిడీని బయటపెడతానని సబ్బం హరి సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖలో ఇప్పటికే రౌడీ మూకలు దిగాయని... ప్రభుత్వం నోటిఫై చేసిన భూముల్ని స్వాహాచేసే కుట్ర జరుగుతోందని సబ్బం ఆరోపించారు. అమరావతిలో భూముల్ని కబ్జా చేయలేరు కాబట్టే కొత్త ప్రాంతాన్ని రాజధానిగా ఎంచుకున్నారని... కానీ, వైసీపీ నేతల ఆటలు విశాఖలో సాగవన్నారు.

గత ప్రభుత్వంలో అవినీతి జరిగిందని, అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపించిన వైసీపీ నేతలు ఎందుకు నిరూపించలేకపోయారని సబ్బం ప్రశ్నించారు. టీడీపీ హయాంలో అవినీతి జరిగినట్లు వైసీపీ ప్రభుత్వం నిరూపించి ఉంటే జగన్ ను ప్రజలు నమ్మేవారని, కానీ కేవలం ఆరోపణలుచేసి బురద చల్లే ప్రయత్నం చేయడంతో విశ్వాసం కోల్పోయారన్నారు. విశాఖ ఇప్పటికే అభివృద్ధి చెందిన నగరమని... ఇప్పుడు రాజధానిగా ప్రకటించి చేసేదేమీ ఉండదన్నారు. విశాఖలో ఏవో రెండు భవనాలు కట్టడం మినహా ఏమీ చేయలేరని సబ్బం అన్నారు. విశాఖకు తనకున్న సహజ వనరులతో స్వతహాగా ఎదిగిందని, తమ స్వార్ధం కోసం వైజాగ్ ను నాశనం చేయొద్దని సూచించారు.

అయితే, బీజేపీ నేతలు తలుచుకుంటే అమరావతిని మార్చడం జగన్ తరం కాదన్నారు. మోడీ-షాతో చెప్పిస్తే జగన్ ఏమీచేయలేరని సబ్బం వ్యాఖ్యానించారు. ఏపీలో బీజేపీ బలపడాలనుకుంటే రాజధాని వివాదంలో కల్పించుకోవాలని, మోడీ-షాతో మాట్లాడి మూడు రాజధానుల ఆటలకు కళ్లెం వేయాలని సూచించారు. జగన్ కు ఓటేసినందుకు ఇప్పుడు ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారన్న సబ్బం హరి... రాజకీయ కక్షల కోసం రాష్ట్రాన్ని నాశనం చేయొద్దని వైసీపీ ప్రభుత్వానికి సూచించారు.

By
en-us Political News

  
ఒడిశాకు చెందిన ఒక నిరుపేద వ్యక్తి తన సోదరి మరణానంతరం ఆమె బ్యాంకు ఖాతాలో ఉన్న ఇరవై వేల రూపాయలు విత్ డ్రా చేసుకోవడానికి బ్యాంకును సంప్రదించాడు. ఆ డబ్బుతో ఆమె అంత్యక్రియల తాలూకు ఖర్చులు లేదా ఇతర అవసరాలు తీర్చుకోవాలని చెప్పాడు.
గత ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియా వేదికగా రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని చేసిన దాడుల కేసులో వైసీపీ సోషల్ మీడియా అప్పటి ఇన్‌ఛార్జ్ సజ్జల భార్గవ్‌రెడ్డిని పులివెందుల పోలీసులు విచారించారు. సుమారు 9 గంటల పాటు సాగిన ఈ విచారణలో పోలీసులు ఆయనపై దాదాపు 70 ప్రశ్నలను సంధించారు.
బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రాష్ట్ర స్థాయి కమిటీ మినహా అన్ని కమిటీలను పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ రద్దు చేశారు.
బీఆర్ఎస్ 25వ వ్యవస్థాపక దినం పురస్కరించుకుని కేసీఆర్, కేటీఆర్ కవిత వ్యాఖ్యలకు దీటుగా సమాధానం ఇస్తారని ఆశించారు. అయితే అందుకు భిన్నంగా కేసీఆర్, కేటీఆర్ ల మౌనం అందరినీ విస్మయపరిచింది.
తమిళనాడులో ఎన్నికల పోలింగ్‌ ముగియడంతో.. అన్ని పార్టీలూ గెలుపు అంచనాల్లో నిమగ్నమయ్యాయి.
రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండుతుండటం, వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉండటంతోనే బహిరంగ సభ నిర్వహించకూడదని పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారని కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇచ్చిన వివరణ నమ్మశక్యంగా లేదని పార్టీ శ్రేణులే పెదవి విరుస్తున్నాయి.
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం ప్రసంగించిన కేటీఆర్.. 14ఏళ్లపాటు పోరాటం చేసి కేసీఆర్ తెలంగాణ సాధించారన్నారు.
శాసనమండలి కార్యాలయంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఈ ఇరువురి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
ముఖ్యంగా కవిత టీఆర్ఎస్ పార్టీ.. బీఆర్ఎస్ పార్టీని క్లిష్టపరిస్థితుల్లోకి నెట్టేసింది. బీఆర్ఎస్ అధినేత సొంత కుటుంబం నుంచే తిరుగుబాటు రావడం ఆ పార్టీ క్యాడర్ ను అయోమయంలో, గందరగోళంలో పడేసింది. పైగా కవిత.. పార్టీ పేరు టీఆర్ఎస్ కావడంతో బీఆర్ఎస్ పరిస్థితి వెంటిలేటర్ పైకి వెళ్లేలా మార్చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ప్రతిపక్షాలు సమర్పించిన ఈ నోటీసులో ప్రధానంగా ఎన్నికల నిర్వహణలో పారదర్శకత లోపించిందని, నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించాయి. ఈ వ్యవహారంలో వివిధ పార్టీలకు చెందిన సభ్యులు ఏకతాటిపైకి వచ్చి నోటీసు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.
గతంలో ఇదే 152 స్థానాల పరిధిలో బీజేపీ బలం కేవలం 59 సీట్లు మాత్రమే. అయితే ఇప్పుడు ఆ సంఖ్యను రెండింతలు చేసి 110కి చేర్చడం అంటే అది సామాన్యమైన విషయం కాదు.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామక ప్రక్రియ ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన ప్రొఫెసర్ ఎం. కోదండరాం, మాజీ క్రికెటర్ మొహమ్మద్ అజారుద్దీన్ పేర్లకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా శనివారం ఆమోద ముద్ర వేశారు. దీనికి సంబంధించిన ఫైలుపై గవర్నర్ సంతకం చేయడంతో.. వీరిద్దరి నియామకానికి మార్గం సుగమమైంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.